Ias officer y srilakshmi questioned in obulapuram mining case

IAS officer Y Srilakshmi questioned in Obulapuram mining case, Karnataka minister Gali Janardhan Reddy, CBI

IAS officer Y Srilakshmi questioned in Obulapuram mining case

ias sri lakshmi.GIF

Posted: 11/20/2011 12:51 PM IST
Ias officer y srilakshmi questioned in obulapuram mining case

 ias sri lakshmiకోఠిలోని సీబీఐప్రధాన కార్యాలయానికి వచ్చిన శ్రీలక్ష్మిని  అధికారులు సుమారు రెండుగంటల పాటు ప్రశ్నించారు.  గాలి గనుల లీజుల్లో అక్రమాల కేసులో ఐఎఎస్‌ అధికారిని శ్రీలక్ష్మిని సీబీఐ అధికారులు రెండోరోజూ విచారించారు. ఈ సందర్భంగా ఆమెపై అవినీతి ఆరోపణలు చేసిన మైనింగ్‌ వ్యాపారి శశికుమార్‌ నుకూడా ఎదురుగా కూర్చోబెట్టి విచారించినట్లు తెలి సింది. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని సుదీర్ఘవిచారణ ఎదుర్కొనడానికి ఆరోగ్యపర మైన ఇబ్బందులు ఉన్నాయంటూ ఆమె వైద్యుల సర్టిఫికెట్‌ అందజేశారు. దాంతో ఆమె విచారణను ముగించిన సీబీఐ అధికారులు ఆమెను వెంటపెట్టుకుని అశోక్‌నగర్‌ సిండికేట్‌ బ్యాంకుకు తీసుకువెళ్ళి అక్కడ శ్రీలక్ష్మి పేరుతో ఉన్న లాకర్‌లను తెరిపించారు.  లాకర్‌లలో నగదు, నగలతో పాటు కొన్ని డాక్యుమెంట్ల్‌లను కూడా స్వాధీనం చేసుకు న్నారు. దాదాపు ఐదుగంటల పాటు శ్రీలక్ష్మి లాకర్‌ల తనిఖీ కొనసాగింది. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో తిరిగి కోఠిలోని కార్యాలయానికి తీసుకవచ్చిన సీబీఐ అధికా రులు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో శ్రీలక్ష్మిని ఇంటికి వెళ్ళేందుకు అనుమతిం చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  China warning to america
New love letter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles