Tanikella bharani biography

Tanikella bharani biography, tanikella biography in telugu, tanikella bharani books, tanikella bharani history in telugu, tanikella bharani latest movies, tanikella bharani story in telugu, tanikella bharani biography news, tanikella bharani history, tanikella bharani story

Tanikella bharani biography

హాస్యప్రధాన పాత్రలను పోషించిన తెలుగు సినిమా నటుడు!

Posted: 07/15/2014 06:50 PM IST
Tanikella bharani biography

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య ప్రధాన పాత్రలతో పాటు విలన్ క్యారెక్టర్లలో లీనమై, తన ప్రతిభతో అందరినీ మైమరిపించే సినిమా నటుడు ‘‘తనికెళ్ల భరణి’’! తెలుగు భాషాభిమాని అయిన ఈయన... ఎన్నో రచనలు రచించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈయన సకలాకళా కోవిదుడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలం జగన్నాధపురంలో జన్మించిన ఈయన... దాదాపు 320 సినిమాల్లో నటించాడు.

జీవిత చరిత్ర :
తనికెళ్ల భరణి 1956 జూలై 14వ తేదీన టివిఎస్స్ రామలింగేశ్వరరావు, లక్ష్మీ సరసమ్మ దంపతులకు జన్మించారు. భరణిగారి భార్య పేరు దుర్గాభవాని. ఈ దంపతులకు మహాతేజ, సౌందర్యలహరి కుమారుడు, కుమార్తెలు. ఆయన నిర్మించుకున్న స్వగృహానికి కుమార్తె పేరు పెట్టుకున్నారు.

తనికెళ్ల భరణి ఇంటర్ చదివే సమయంలో ఆయన మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన దేవరకొండ ప్రసాద్ ప్రేరణతో రచయితలు రాయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆయన ‘‘అగ్గిపుల్ల ఆత్మహత్య, కొత్త కాలాలు’’ అనే కవితలను రాశారు. తరువాత బీకాం చదివే సమయంలో రాళ్లపల్లితో పరిచయం అయింది. అప్పుడు ఆయన సహకారంతో ఆయన రాసిన ‘‘ముగింపు లేని కథ’’ నాటకంలో తనికెళ్ల భరణి 70 సంవత్సరాల వృద్ధుడు పాత్రను పోషించాడు. ఆ నాటకం మంచి విజయం సాధించడంతో భరణికి నాటకరంగంలో ఒక స్థిరమైన స్థానం లభించింది.

రాళ్లపల్లిగారు అప్పట్లో ‘‘శ్రీ మురళీ కళానిలయం’’ అనే ఒక నాటక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఒకనాడు రాళ్లపల్లి ప్రత్యేక పనిమీద మద్రాసుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆ నాటక సంస్థకు రచయితలు కరువయ్యారు. ఆ సమయంలో భరణికి నాటక రచయితగా నిలదొక్కకుకోవడానికి ఒక మంచి అవకాశం లభించింది. ఆ సంస్థ కోసం ఆయన దాదాపు 10 నాటకాలను రచించారు. అందులో స్త్రీవాదాన్ని బలపరుస్తూ వ్రాసిన ‘‘గోగ్రహణం’’ అనే నాటకానికి సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం ఎంతో విశిష్టమైనది.

అప్పట్లో ఔత్సాహిక నాటకాలు వేయడానికి వేదికగా ‘‘రవీంద్ర భారతి, నారద గానసభ’’ వంటి నాటకరంగాలు వున్నా... వాటికి ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వుండేది. అప్పుడు భరణి దగ్గర వాటిని వెచ్చించే డబ్బులు లేకపోవడంతో భరణి తాను పనిచేస్తున్న సంస్థవారు బెంగాలీ నాటకకర్త అయిన ‘‘బాదల్ సర్కార్’’ ను ప్రేయరణగా తీసుకుని వీధి నాటకాలు చేయడం మొదలపెట్టారు. అందులో ఆయన మొదటిది ‘‘బాలశిక్ష’’ నాటకం. భరణి ఇందులో నటించడమే కాక నాటకాల నటనా బాధ్యత కూడా వహించాడు. నాటకాల్లో భరణి ఎక్కువగా విలన్ పాత్రలే పోషించేవాడు.

తనికెళ్ల భరణి రాసిన ‘‘చల్ చల్ గుర్రం’’ అనే నాటకాన్ని చూసిన రామరాజు హనుమంతరావుగారు ఆయనకు ‘‘కంచు కవచం’’ చిత్రానికి వచనకర్తగా అవకాశం ఇచ్చాడు. తరువాత ‘‘లేడీస్ టైలర్, శివ’’, ఇంకా దాదాపు 60 చిత్రాలకు వచనకర్తగా పనిచేసే అవకాశం లభించింది. ముఖ్యంగా ఈయన తెలంగాణ యాసలో వచనాలు రాయడంలో ప్రసిద్ధుడు. అందుకు ఉదాహరణగా ‘‘మొండి మొగుడు - పెంకి పెళ్లా’’ అనే చిత్రంలో కథానాయికకు పూర్తిగా తెలంగాణయాసలో వచనాలు రాసిచ్చింది ఈయనే!

తనికెళ్ల భరణి తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకుగానూ ఈయనకు చలనచిత్ర నటుడిగా ప్రత్యేక గుర్తింపు లభించింది. కామెడీ విలన్, విలన్ మరియు ఉదాత్తమైన వైవిద్యమైన పాత్రదారణతో భరణి ప్రజాదరణ పొందిననటులలో ఒకరయ్యారు. సముద్రం సినిమాలో ఈయన నటించిన ప్రతినాయకుడికి ఉత్తమ నంది పురస్కారం లభించింది. ఈయన మిథునం సినిమాకు దర్శకత్వ బాధ్యతలు కూడా వహించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • The stage and movie actor sthanam narasimha rao biography

    40 ఏళ్లకుపైగా ‘‘స్త్రీ’’ పాత్రలో జీవించిన ‘‘స్థానం’’!

    Sep 25 | ప్రస్తుతకాలంలో వున్న నటీనటులందరూ నటనకు ఎంతవరకు ప్రాధాన్యం ఇస్తారో తెలియదు కానీ... ఇంకా సినిమారంగం రాకముందు రంగస్థల నాటకాల కాలంలో కేవలం నటనకోసమే తమ జీవితాన్ని అంకితం చేసిన ఎందరో కళాకారులు వున్నారు. ఏ... Read more

  • Bellary raghava alias tadipatri raghavacharlu biography

    రంగస్థల రారాజు.. బహుముఖ ప్రజ్ఞ మన బళ్లారి

    Sep 23 | ఇంకా చలనచిత్ర పరిశ్రమ రాకముందే తెలుగునాటకరంగంలో ఎందరో గొప్ప నటులు తమతమ నటన ప్రతిభతో ప్రత్యేక ప్రస్థానాలను ఏర్పరుచుకున్నవారున్నారు. అందులో మన బళ్లారి రాఘవ ఒకరు. ఈయన న్యాయవాది పట్టా పొందినప్పటికీ నాటకాలలో ప్రత్యేక... Read more

  • Akkineni nageswara rao gif

    తెలుగు చిత్రపరిశ్రమకి మూలస్థంభంగా నిలిచిన నటసామ్రాట్!

    Sep 20 | నాటకరంగం ద్వారా కళారంగంలోకి అడుగులు పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు.. నటనలో తన ప్రతిభను నిరూపించుకుని తెలుగుసినిమా తొలినాళ్ల అగ్రనాయకులలో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. ధర్మపత్ని సినిమాతో సినీజీవితాన్ని ప్రారంభించిన ఈయన.. తెలుగు, తమిళ భాషల్లో... Read more