ఖైదీ నంబర్ 150.. టాలీవుడ్ లోనే ఫస్ట్ టైం | first time in Tollywood with Khaidi No.150 book.

Khaidi no 150 book launch soon

Chiranjeevi Khaidi No 150, Special book on Khaidi, Khaidi No 150 book, Ammadu Kummudu song Making, Ammadu Let's do Kummudu, Khaidi No.150 Making Videos, Special book for Chiru 150, Khaidi book, Khaidi NO 150 book

Chiranjeevi Khaidi No 150 Special book launch soon.

ఖైదీ 150 మరో సంచలనం నిర్ణయం

Posted: 12/22/2016 12:24 PM IST
Khaidi no 150 book launch soon

సుమారు పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి హీరోగా వెండితెరపై బాస్ సందడి చేయబోతున్నాడు. అన్నయ్య రీఎంట్రీపై అభిమానులు ఎంత ఆత్రుతతో ఉన్నారో, యావత్ తెలుగు ప్రేక్షకులు కూడా ఎలా ఎంటర్ టైన్ చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఇక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావటంతో బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా చెర్రీ బాగానే ఖర్చుపెట్టాడు.

అయితే కొంత కాలం క్రితం దాకా బిజినెస్ విషయంలో బయ్యర్లు భయానికి గురయ్యారన్న వార్త చక్కర్లు కొట్టింది. రీమేక్ కావటం, పైగా చిరు స్టామినా రీఎంట్రీలో మరి అంతలా ఉంటుందా అన్న అనుమానాలు వారిలో నెలకొన్నాయి. కానీ, వాటన్నింటిని పటాఫంచల్ చేస్తూ సుమారు 100 కోట్ల(అన్ని రైట్స్ కలుపుకుని) దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. మరోవైపు మరుపురాని గుర్తుగా మిగిల్చేందుకు 150 పేరిట ఓ పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నారంట.

యాక్షన్ సీన్లు.. డ్యాన్సులతో కూడిన ఈ పుస్తకంలో టెక్నిషియన్ల అనుభవాలను కూడా చేర్చనున్నారంట. ఇప్పటికే ప్రింటింగ్ దశలో ఉన్న ఈ పుస్తకం ప్రీ రిలీజ్ పంక్షన్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది ఖైదీ టీం. పుస్తకం రిలీజ్ అయితే మాత్రం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించటం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది.

కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన కుమ్ముకుంటున్న అమ్మడు.. లెట్స్ డూ కుమ్ముడు పాట మేకింగ్ వీడియో నెట్ లో దుమ్ము రేపుతోంది. స్టైలిష్ స్టెప్పుల స్పెషలిస్ట్ శేఖర్ మాస్టర్ మెగాస్టార్ తో ఓ రేంజ్ స్టెప్పులే వేయించాడని అర్థమౌతోంది. మొత్తానికి అభిమానుల కోసం తన స్టయిల్ ను చూపించడానికి రెడీ అయిపోతున్నాడనే అనుకోవచ్చు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles