సింపుల్ కానీ పవర్ ఫుల్ మమతాబెనర్జీ | Mamata Banerjee looking simple but most powerfull

Mamata banerjee looking simple but most powerfull

Mamata Banerjee, West Bengal, Mamata Banerjee politics, Woman Empowerment, మమతా బెనర్జీ

West Bengal Chief Minister Mamata Banerjee looking very simple but she is very powerfull. She is example for woman empowerment in India.

సింపుల్ కానీ పవర్ ఫుల్ మమతాబెనర్జీ

Posted: 05/20/2016 01:07 PM IST
Mamata banerjee looking simple but most powerfull

స్ర్తీ శక్తిని చాటి చెప్పిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది తమ మేధస్సుతో తాము కూడా ఎవరికీ తక్కువ కాదు అని నిరూపిస్తే.. మరికొంత మంది రాజకీయ ద్వారా తమ సత్తాను చాటారు.. ఇక ముందు కూడా చాటుతారు కూడా. పశ్చిమబెంగాల్ లో కామ్రేడ్ ల విజయపరంపరకు అడ్డుకట్ట వేసి.. అక్కడ తన జెండాను పాతిన మమతాబెనర్జీ అపూర్వ విజయాలు స్ర్తీ లోకానికి ఆదర్శం. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు మమత.

1970 ల్లో కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు మమతాబెనర్జీ. 1984లో కాంగ్రెస్ నుంచి జాదవ్ పూర్ లోక్ సభకు పోటీచేసి గెలిచారు. మొదటిసారి పోటీలోనే కమ్యూనిస్ట్ దిగ్గజం సోమనాథ్ ఛటర్జీని ఓడించారు దీదీ. 1989 ఎన్నికల్లో ఓడిపోయారు. 1991లో మళ్లీ ఎన్నికై… పీ.వీ.నరసింహరావు మంత్రివర్గంలో మానవవనరులు, క్రీడలు,మహిళా శిశుసంక్షేమ శాఖల సహాయమంత్రిగా పనిచేశారు. బెంగాల్ లో పాతుకుపోయిన వామపక్షాలను కూకటివేళ్ళతో పెకలించాలన్నది ఆమె జీవితాశయం. కాంగ్రస్ తన ఆశయాలకు అడ్డంకి అని భావించారు.  1993లో పదవులకు రాజీనామా చేశారు. 1997లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించారు.  అప్పటి నుంచి తెలివైన వ్యూహాలతో రాజకీయ ప్రస్థానం సాగించారు.

1998లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ‘దరోగా ప్రసాద్ సరోజ్’ కాలర్ పట్టుకోవడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. 1999లో వాజ్ పేయి ప్రధాని అయినపుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు దీదీ. 2001లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. 2001 బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నారు. 2004 జనవరిలో మళ్లీ ఎన్డీఏలో చేరి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు.

2004 లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. మమత ఒక్కరే ఎంపీగా గెలిచారు. ఈ టైమ్ లో సీఎం బుద్దదేవ్ భట్టాచార్య ఇండస్ట్రియల్ పాలసీలకు వ్యతిరేకంగా బెంగాల్ లో పోరాటం చేశారు. సింగూర్ లో టాటా మోటార్స్ ప్లాంట్ కు వ్యతిరేకంగా 2006లో అసెంబ్లీ మార్చ్ విజయవంతంగా నిర్వహించారు. నందిగ్రామ్ లో జరిగిన హింసను అడ్డుకున్నారు. ఇదే ఆమె రాజకీయ జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. సామాన్యులకు నిజమైన దీదీగా మారారామె. అదే సీపీఎం పతనానికి నాంది అయింది.

2009 పార్లమెంట్ ఎన్నికల్లో UPAలో చేరారు. మళ్లీ రైల్వేమంత్రి అయ్యారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో… 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనను అంతమొందిస్తూ… అధికారంలోకి వచ్చింది తృణమూల్. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు.మమత ఒక సాధారణ మహిళగా ఎలా ఉంటారో… ముఖ్యమంత్రిగానూ అలాగే ఉంటారు. రెండు మూడొందల్లో వచ్చే బెంగాల్ కాటన్ చీర, కాళ్లకు రబ్బరు స్లిప్పర్స్.. ఇవి కూడా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles