Durgabai Deshmukh, Indian Freedom Fighter మహిళాభ్యున్నతికి పాటుపడిన స్త్రీజనోద్ధరణ నేత దుర్గాబాయి దేశ్ ముఖ్

Durgabai deshmukh indian freedom fighter

Durgabai Deshmukh, Indian Freedom Fighter, feminist, Parlimentarian, able administrator, great visionary leader, AMS institutions founder

Durgabai Deshmukh was a feminist, a Parlimentarian, an administrator and a great visionary. She considered that her mission in life was to uplift the socially oppressed and politically neglected mass of India.

మహిళాభ్యున్నతికి పాటుపడిన స్త్రీజనోద్ధరణ నేత దుర్గాబాయి దేశ్ ముఖ్

Posted: 06/17/2017 05:21 PM IST
Durgabai deshmukh indian freedom fighter

అందరూ మనిషులుగానే పుడతారు.. కానీ కొందరు మాత్రమే మహామనుషులుగా నిలుస్తారు. నేటి సమాజంలో వేనూళ్లుకున్న స్వార్థం.. నేను, నావాళ్లు.. అనే పదాలకు పూర్తి భిన్నంగా  మేము మావాళ్లు అనే భావనతో సమాజంలో మార్పుకు.. సంఘహితం కోసం చేసిన కార్యక్రమాలకు తమ సొంత డబ్బులు, అస్తులు కూడా అమ్మి నేటికి ఆ కార్యక్రమాలతో మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోయిన వారే మహనీయులు. అలాంటి వారిలో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ఒకరు.

దుర్గాభాయి దేశ్ ముఖ్ గురించి ఒక్కమాటలో చెప్పడం అనితర సాధ్యం. దేశ స్వాత్రంత్యం కోసం మొక్కబోని దైర్యంతో తన భాల్యం నుంచే పోరాడిన వీరవనిత. ఒక నిర్భయమైన స్వాతంత్ర్య సమరయోధురాలు. అటు స్వతంత్ర్య సమరంలో పాల్గొంటూనే ఇటు సామాజిక కార్యక్రమాలను తన భుజాన వేసుకుని మహిళాభ్యున్నతికి పాటుపడిన మహనీయురాలు. సమాజంలో అప్పట్లో వేళ్లూనుకున్న అనేక రుగ్మతల నుంచి మహిళలను, బాలికలను కాపాడిన సామాజిక కార్యకర్త. తన జీవితాన్ని స్త్రీ జనోద్దరణకు అంకితం చేసిన స్ఫూర్తిప్రదాత దుర్గాబాయి.

ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించిన దుర్గాబాయి  దేశభక్తురాలిగా, స్వాతంత్య్ర సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, కార్యకర్తగా, రచయిత్రిగా... తన కాలంలో మరెవరూ చూపని ధైర్యసాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచిపోయారు. మన తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ మహిళామూర్తులలో దుర్గాబాయిని ఆగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి వ్యవస్థగా మారిన సందర్భాలు అనేకం. అలాంటి వ్యవస్థ దుర్గాబాయి కూడా. అమె న్యాయకోవిదిరాలిగా మేధావిగా అప్పటి జాతీయ నేతలందరూ గుర్తించారు,

1909వ సంవత్సరం జూలై 15వ తేదీన కాకినాడలో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు జన్మించిన దుర్గాబాయి.. కానీ ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి స్నాతక పట్టా పొందింది.తర్వాత న్యాయశాస్త్రం చదివి మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించారు. ఆమె భారతదేశం లో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ మరియు భారతదేశం యొక్క ప్రణాళికా సంఘం సభ్యురాలిగా కూడా సేవలందించారు.

అమె ధైర్యం ఎలాంటిందంటే.. తన 11 సంవత్సరాల ప్రాయంలో ఖాదీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆమెను వాలంటీర్‌గా నియమించినపుడు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన పండిట్‌ నెహ్రూనే టికెట్‌ లేని కారణంగా అనుమతించలేదు. అమె ధైర్యానికి నేహ్రూకూడా ముగ్దుడయ్యారు. ఈమె బాల్యం నుండీ ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికీ విద్యాబోధన కావించేవారు.

స్వాతంత్య్రోద్యమ కాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి... ఎంఎ, బిఎల్‌, బిఎ ఆనర్స్‌ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచారు. గాంధీజీగారి పిలుపుమేరకు పెద్దసంఖ్యలో నగదు మొత్తాన్ని, నగలను సేకరించిన దుర్గాబాయి... ఓ బహిరంగసభలో గాంధీగారికి విరాళంగా అందజేశారు. ఆమెలోని ధైర్యసాహసాలకు, దక్షతకు, కృషి, పట్టుదలకు ఇవే నిదర్శనాలు.

స్వాతంత్య్ర సమరంలో, ఉప్పు సత్యాగ్రహంలో టంగుటూరి ప్రకాశంపంతులు, దేశోద్ధారకుని కాశీనాధ నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలసి ఈమె పనిచేశారు. తరువాత దుర్గాబాయి భారత రాజ్యాంగ రచనాసంఘం సభ్యురాలిగా, ప్లానింగ్‌ కమీషన్‌ మెంబరుగా, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్‌గా, బ్లైండ్‌ రిలీఫ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంటుగా పనిచేశారు. నెహ్రూ, అంబేద్కర్‌వంటి నాయకులతో కలిసి పనిచేసిన ఆమె స్త్రీలకు న్యాయపరమైన హక్కుల సాధన కొరకు తీవ్రంగా కృషిచేశారు.

భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పని చేసిన తరువాత 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పని చేశారు. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్ తో కలిగిన పరిచయం ఏర్పడి ఆయనను వివాహం చేసుకున్నారు. 1953 ఆగష్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పని చేశారు. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పని చేసారు. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. వీరి స్వీయచరిత్ర భాషించిన శిలలు అన్న పేరుతో వెలువడింది. ఈమె చిత్రంతో భారతప్రభుత్వం ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.1981లో మే9న పరమపదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Durgabai Deshmukh  Indian Freedom Fighter  feminist  AMS institutions founder  

Other Articles

Today on Telugu Wishesh