The Biography Of Sadhana Shivdasani Who Is An Indian Actress | Bollywood Stars

Sadhana shivdasani biography bollywood actress

Sadhana Shivdasani history, Sadhana Shivdasani biography, Sadhana Shivdasani life story, Sadhana Shivdasani movies, Sadhana Shivdasani photos, Sadhana Shivdasani updates, Sadhana Shivdasani news, Sadhana Shivdasani photos, bollywood stars, bollywood old stars

Sadhana Shivdasani Biography Bollywood Actress : The Biography Of Sadhana Shivdasani who was one of the top stars in the 1960s and the early 1970s.

బాలీవుడ్ వెండితెరకు వన్నెతెచ్చిన అందాల ధృవతార

Posted: 09/08/2015 03:09 PM IST
Sadhana shivdasani biography bollywood actress

బాలీవుడ్ చిత్రరంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన నటీనటుల్లో సాధన ఒకరు. తన నటనాప్రతిభతో ప్రేక్షకుల్ని మైమరిపించడంతోపాటు తన అందంతో వెండితెరకు సరికొత్త రంగులు దిద్దింది. ఈమె అందానికి ప్రతి సినీప్రేమికుడు దాసోహం అయ్యేవారు. ఆనాటి నటీమణులతో పోలిస్తే.. ఈమె పలికే హావభావాలు అందరినీ పులకరించేస్తాయి.

జీవిత విశేషాలు :

1941 సెప్టెంబర్ 2వ తేదీన సింధ్‌లోని (బ్రిటీష్ ఇండియా) కరాచీ నగరంలో జన్మించింది. ఈ ప్రాంతం అప్పుడు దేశంలో భాగంగా వుండేది కానీ.. స్వాతంత్ర్యానంతరం పాకిస్థాన్ లో కలిసిపోయింది. ఈమె తండ్రి, నటుడు హరి శివదాసానీ అన్నదమ్ములు. సాధన తల్లి ఆమెకు 8 ఏళ్లు వయస్సు వచ్చే వరకు ఇంటిలోనే విద్యా బోధన చేశారు. దేశవిభజన సందర్భంగా జరిగిన అల్లర్లు కారణంగా ఆమె కుటుంబం పాకిస్థాన్‌లోని కరాచీ నగరాన్ని విడిచిపెట్టి వచ్చింది. ఆమె సాహిత్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ చేసింది.

15 ఏళ్ల వయస్సులో ఒక కళాశాల నాటకంలో కొందరు నిర్మాతలు ఆమెను గుర్తించారు. అప్పుడు దేశపు మొదటి సింధీ చలనచిత్రం ‘అబానా’ (1958)లో నటించే అవకాశాన్ని నిర్మాతలు ఆమెకు ఇచ్చారు. దీనిలో ఆమె చిత్ర కథానాయిక సోదరిగా నటించింది. ఈ చిత్ర ప్రచారానికి ఉపయోగించిన ఛాయాచిత్రం ద్వారా ఆమె ఒక చలనచిత్ర మేగజైన్‌లో కనిపించింది. ఆ సమయంలో ప్రముఖ చలనచిత్ర నిర్మాతల్లో ఒకరైన సుబోధ్ ముఖర్జీ ఈ మేగజైన్ లోని సాధన ఫోటో చూసి.. తన మొదటి హిందీ చలనచిత్రం ‘లవ్ ఇన్ సిమ్లా’ (1959)లో కొత్తగా తెరంగేట్రం చేస్తున్న తన కుమారుడు జోయ్ ముఖర్జీ సరసన ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఆమెకు ఇచ్చారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో సాధన రాత్రికిరాత్రే పెద్ద స్టార్‌గా అవతరించింది. అప్పటినుంచి ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తూ వచ్చాయి. ఆనాటి అలనాటి స్టార్ల సినిమాల్లోనూ ఈమె నటించింది.

1960వ దశకం చివరికాలంలో థైరాయిడ్ సమస్య కారణంగా ఆమె చికిత్స కోసం బోస్టన్ వెళ్లారు. ఈ ఆరోగ్య సమస్య నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె తరువాత కూడా సినిమాల్లో నటించింది. అయితే.. 1974లో ఆమె నటించిన ‘గీతా మేరా నామ్’ తరువాత నటనను విరమించుకోవాలని నిర్ణయించుకుంది. సాధన 1965లో ఆర్‌కే నాయర్‌ను వివాహం చేసుకుంది. 1990వ దశకంలో నాయర్ మరణించారు. ప్రస్తుతం ఈమె వివిధ ప్రాజెక్టులను చూసుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sadhana Shivdasani  bollywood stars  

Other Articles