The Biography Of British Woman Mira Ben Who Follows Gandhi Principles | Indian Activists | Indian Freedom Fighters

Mira ben biography british woman follow gandhi principles

Mira Ben biography, Mira Ben history, Mira Ben historical stories, Mira Ben updates, Mira Ben biography, Mira Ben Life Story, Mira Ben with gandhi, mahatma gandhi history, gandhi Mira Ben, india independence, indian activisits, india freedom fighters

Mira Ben Biography British Woman Follow Gandhi Principles : The Biography Of British Woman Mira Ben daughter of the British Rear-Admiral Sir Edmond Slade. She left her home in Britain to live and work with Mohandas Gandhi.

స్వాతంత్ర్యపోరాటంలో గాంధీతో కలిసి పనిచేసిన బ్రిటీష్ వనిత

Posted: 09/05/2015 03:54 PM IST
Mira ben biography british woman follow gandhi principles

బ్రిటీష్ అరాచక పరిపాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో గాంధీతోపాటు స్వాతంత్ర్యోద్యమంలో పోరాడిన ప్రముఖుల్లో మీరాబెన్ ఒకరు. ఆనాటి బ్రిటీష్ సైన్యాధిపతి సర్.ఎడ్మిరల్ స్లేజ్ కుమార్తె అయిన ఈమె.. గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంది. ఈమె అసలు పేరు మెడిలియన్ స్లేడ్. గాంధీ సిద్ధాంతాలని ఆచరిస్తూ.. దేశస్వాతంత్ర్యానికి ఉద్యమించిన ఈమెకు మహాత్మాగాంధీ ‘మీరా బాయ్‌’ అని పేరు పెట్టారు.

జీవిత విశేషాలు :

1892లో బ్రిటీష్ కుటుంబంలో మీరాబెన్ జన్మించింది. ఆయన తండ్రి బ్రిటిష్ రాయల్ నావీలో అధికారిగా ఉండేవారు. ఆమె బాల్యంలో అధికభాగం ఆమె తాతగారి వద్దే గడిపారు. సంగీత ప్రేమికురాలైన ఈమె.. వియన్నా, జర్మనీ దేశాలలో ప్రముఖ సంగీతకారుడు బీతోవన్ స్వరపరచిన సంగీతం గూర్చి తెలుసుకోవడానికి వెళ్ళింది. ఆ సమయంలోనే ఆమె బీతోవన్ గురించి అనేక పుస్తకాలను చదివింది. తరువాత ఆమె బీతోవన్ ను విల్లేనెయువెలో కలిసింది. ఆ సమావేశంలో మహాత్మా గాంధీపై రోలాండ్ వ్రాసిన కొత్త పుస్తకం గూర్చి ఆమెకు వివరించాడు. ఆ పుస్తకంలో ఆయన గాంధీని 20 వశతాబ్దపు ప్రముఖుడని, మరొక క్రీస్తు అని వ్యాఖ్యానించాడు. అది విన్న ఆమె.. గాంధీ జీవిత చరిత్ర ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి నెలకొంది.

ఆమె తన తిరుగు ప్రయాణంలో రోలాండ్ వ్రాసిన గాంధీజీ జీవిత చరిత్రను చదివింది. ఆ పుస్తకం చదివిన తరువాత ఆమె గాంధీగారి ఆరాధకురాలైనది. గాంధీజీ విధానాలకు, స్వాతంత్ర్యం కోసం ఆయన చేస్తున్న పోరాటాలకు ఆరాధురాలైన మీరాబెన్.. ఆ వెంటనే ఆయన్ను కలవాలని నిర్ణయించుకుంది. అప్పుడు ఆమె మహాత్మాగాంధీకి ఒక లేఖ వ్రాసింది. దానిలో గాంధీజీ అనుచరురాలిగా చేరి సబర్మతీ ఆశ్రమంలో నివసించాలని కోరింది. గాంధీజీ ఆ లేఖ చదివిన అనంతరం ఆశ్రమంలో క్రమశిక్షణాయుత జివితం గురించి తెలియజేస్తూ ప్రత్యుత్తరం యిచ్చాడు. గాంధీ పంపిన లేఖను చదివిన ఆమె... సన్యాసి జీవితం గురించి స్వయంగా శిక్షణ పొంది, దేశంలో ఉండటానికి నిర్ణయించింది. శాకాహారం తీసుకోవడం, నూలు వడకడం, మధ్యపానాన్ని విసర్జించడం వంటి నియమాలను అలవర్చుకుంది.

1925 నవంబర్‌ 7న ఈమె దేశంలో అడుగు పెట్టింది. ఆనాడు ఈమెని మహదేవ్‌ దేశాయ్‌, వల్లభాయ్‌ పటేల్‌, స్వామీ ఆనంద్‌ రిసీవ్‌ చేసుకున్నారు. ఈ విధంగా వచ్చిన స్లేడ్‌ 34 సంవత్స రాలుగా భారతదేశంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుంది. 1931లో లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమవేశంలో గాంధీ, ఇతర ప్రముఖులతోపాటు మీరా కూడా పాల్గొంది. లండన్ నుండి తిరిగి వచ్చే ముందు ఆమె, గాంధీజీతో కలసి రోలాండ్ ను సందర్శించింది. 1931లో తరిగి ప్రారంభమైన సహాయ నిరాకరణోద్యమం కారణంగా 1932-33లో ఈమె జైలు జీవితం గడపవలసి వచ్చింది. 1942లో జపాన్‌ దాడిని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఎదుర్కునేందుకు ఒరిస్సా ప్రజలతో మమేకమై చేసిన పోరాటం సాగించింది.

మీరా గాంధీతోపాటు 1942 నుండి 1944 వరకు పూణేలోని ఆగాఖాన్‌ పేలస్‌లో నిర్భధంలో ఉంది. అప్పుడే, ఈమె మహాదేవ్‌ దేశాయ్‌, కస్తూరీబాయ్‌ మరణాలు చూసి చలించిపోయింది. అంతేకాకుండా ఈరోజుల్లో జరిగిన ప్రతి సన్నివేశాన్నీ కళ్ళారా చూసిన ప్రత్యక్షసాక్షి మీరాయే. చివరికి గాంధీగారి అంతిమ యాత్రలో కూడా మీరా సాక్షీభూతురాలై నిలిచింది.

స్వాతంత్ర్యం తర్వాత జీవితం :

ఆగాఖాన్‌ పేలస్‌ నుండి విడుదలైన తర్వాత మీరాబెన్ రూర్కీలో కిసాన్‌ ఆశ్రమాన్ని స్థాపించింది. ఈ ఆశ్రమ నిర్మాణానికి గ్రామీణులు పెద్ద ఎత్తులో స్థలాన్ని సమకూర్చారు. ఋషికేశ్‌లో పశులోక్‌ ఆశ్రమాన్ని స్థాపించి, ఆ ప్రాంతానికి బాపూ గ్రామ్‌ అనే పేరుని సార్థకం చేసింది. 1952లో భిలాంగనలో గోపాల్‌ ఆశ్రమం కూడా స్థాపించింది. ఒకొక్కసారి కాశ్మీరు వెళ్ళి కొంతకాలం గడుపుతూ ఉండేది. ఆ సమయంలో అక్కడ అడవులు నరికి వేయడం, వాటివల్ల విశాల భూముల్లో వరదలు ముంచుకురావడం వంటిని పరిశీలించి.. ఆ రోజుల్లోనే ‘సమ్‌థింగ్‌ రాంగ్‌ ఇన్‌ ది హిమాలయా’ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించింది.

దేశానికి ఎన్నో సేవలు చేసిన ఈమె.. 1959లో ఇంగ్లాండ్‌కి తిరిగి వెళ్ళిపోయింది. 1960లో ఆమె ఆస్ట్రేలియాలో 22 సంవత్సరాలపాటు వియన్నాలో గడిపారు. 1982లో మరణించారు. ఈమెకి మన భారత ప్రభుత్వం 1981లో భారతదేశ రెండవ పౌరురాలుగా ప్రకటించి, అత్యంత ప్రతిష్ఠాత్మక మైన పద్మవిభూషన్‌ బిరుదుతో ఘనంగా సత్కరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mira Ben  Mahatma Gandhi  Indian Freedom Fighters  

Other Articles