The Biography Arunima Sinha Who Claimed Mount Everest With Artificial Leg | Famous Women

Arunima sinha biography mount everest artificial leg

Arunima Sinha, Arunima Sinha biography, Arunima Sinha history, Arunima Sinha life story, Arunima Sinha mount everest, Arunima Sinha artificial leg, Arunima Sinha wikipedia, Arunima Sinha wiki, Arunima Sinha story, mount everest

Arunima Sinha Biography Mount Everest Artificial Leg : The Biography Arunima Sinha Who Claimed Mount Everest With Artificial Leg And Create New Record.

ఒంటికాలితో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ

Posted: 07/31/2015 04:53 PM IST
Arunima sinha biography mount everest artificial leg

అరుణిమ.. క్రీడారంగంలో అద్భుతంగా రాణిస్తున్న ఈమె జీవితంలో అనుకోకుండా ఓ ప్రమాదం ఎదురైంది. ఆ ప్రమాదం కారణంగా ఆమె నరాలు తెగిపోయి, వెన్నుపూసకు తీవ్ర గాయం కావడంతో ఒక కాలు పోయింది. తన జీవిత లక్ష్యాలను నెరవేర్చుకుందామని ఆశించిన ఆమెకు ఈ ప్రమాదం అడ్డుపడింది. అయినప్పటికీ తన మనస్థైర్యాన్ని కోల్పోకుండా జీవితంలో ఏదోఒకటి సాధించాలనే దృఢసంకల్పంతో ముందుకు నడిచింది. కేవలం ఒక్క కాలితోనే ఎవరెస్ట్ శిఖరాన్నిఅధిరోహించింది. ఆ ఘనత సాధించిన మొదటి మహిళగా ప్రపంచ రికార్డుల్లోకెక్కింది.

జీవిత విశేషాలు :

1988లె ఉత్తర ప్రదేశ్ లోని అంబేద్కర్ జిల్లాలోని ఒక గ్రామంలో అరుణిమ జన్మించింది. ఈమెకు తన బాల్యం నుంచి ఫుట్ బాల్ ఆట అంటే ఇష్టం. ఆ ఆట పట్ల ఈమెకున్న ఆసక్తిని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు, స్కూల్లో పీ.టీ సార్ ఆమెను ప్రోత్సహించారు. దీంతో ఆమె వాలీబాల్, ఫుట్‌బాల్ ఆటల్లో ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది. ఆటలో కొనసాగుతూనే ఆమె ఎం.ఎ. చేసింది. ఎల్.ఎల్.బి చేస్తున్న రోజుల్లో అర్మీ రిక్రూట్ మెంట్ ప్రకటన పత్రికలో చూసి దరఖాస్తు చేసింది. అయితే.. దరఖాస్తులో పుట్టిన తేదీ వివరాలు తప్పుగా పడ్డాయి. ఆ వివరాలను బరేలీలోని ఆర్మీ రిక్రూట్ మెంట్ అధికారులు సవరిస్తారని తెలుసుకున్న ఆమె.. 2011 ఏప్రిల్ 11న లక్నోలో రైలు ఎక్కింది. ఆ ప్రయాణమే ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసింది. అది బరేలీ చేరుకునేలోగా అంతా తల క్రిందులయ్యింది. ప్రమాదం జరిగింది.

అరుణిమ రైలు ప్రమాదం :

లక్నో నుంచి ఢిల్లీకి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో జనరల్‌ కంపార్టుమెంట్‌లో అరుణిమ తన ప్రయాణం కొనసాగించింది. అదే కంపార్ట్ మెంటులో కూర్చున్న మరో ముగ్గురు వ్యక్తులు.. బరేలీ సమీపంలో ఆమె మెడలోని బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దుండగలు రైలు నుంచి ఆమెను కిందకు తోసేశారు. అలా కిందపడిపోయిన ఆమె అపస్మారక స్థితిలో వెళ్లిపోయింది. తిరిగి ఆమె కళ్లు తెరిచి చూడగా.. పక్కనే ఓ ట్రాక్ పై తాను పడివున్నట్లుగా గుర్తించింది. పైకి లేచేందుకు ఎంతో ప్రయత్నించింది కానీ.. లేవలేకపోయింది.

ఇంతలోనే ఆ ట్రాక్ పై ట్రైన్ రావడంతో.. అది ఆమె కుడి కాలుపై నుండి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆమె ఎడమకాలు, తొడ ఎముక తీవ్రంగా దెబ్బతిన్నాయి. రక్తపుమడుగల్లో పడివున్న ఆమెను గమనించిన గ్రామస్తులు.. దగ్గరలో వున్న ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు ఆమె మోకాలు కింది భాగాన్ని తొలగించారు. ఆమె తిరిగి కోలుకోవడానికి చాలాకాలం సమయం పట్టింది. మరోవైపు ఈ ప్రమాదాన్ని పోలీసుశాఖ ఆత్మహత్య గా అనుమానించగా.. అరుణిమ ఆ వాదనలను ఖండించింది.

arunima-sinha-latest-photos

చికిత్స అనంతరం జీవితం :

బరేలీ హాస్పిటల్ లో అరుణిమకు చికిత్స నిమిత్త ఒక కాలును తీసేసి, ఇంకో కాలికి రాడ్ బిగించారు. శారీరకంగా కోలుకున్నప్పటికీ అరుణిమ మానసికంగా లోలోపలే కుంగిపోయింది. తాను జీవితంలో ఏమీ సాధించలేననంటూ ఆవేదన చెందుతూ వుండేది. ఆ సమయంలో ఈమెకు తన సోదరుడు ఓంప్రకాశ్ ఆమెను ధైర్యంగా నిలిచాడు. ‘రెండుకాళ్లు లేని మార్క్ ఇన్ గ్లిస్ ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించినప్పుడు దాన్ని నువ్వు కూడా సాధించగలవు’ అంటూ ఆమెలో బలాన్ని పెంచాడు. ఆమెను తనకు తెలిసిన ఓ కోచ్ దగ్గర చేర్చాడు. అరుణిమకు శిక్షణలో భాగంగా 21,725 అడుగుల ఎత్తున్న చమ్సేర్ కంగ్రి శిఖరానికి ఎక్కేసింది. అప్పుడు కోచ్ ఈమెను హత్తుకుని.. నువ్వు ఎవరెస్ట్ శిఖరాన్ని సునాయాసంగా ఎక్కేయగలవంటూ చెప్పడంతో.. ఆమెలో సంకల్పం మరింత పెరిగింది.

టాటాస్టీల్, అడ్వెంచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎవరెస్టు పర్వతారోహణ బృందం బయలుదేరింది. ఆ బృందంలో ఈమె కూడా వుంది. అందులో భాగంగానే 2013 మొదటివారంలో 20,283 అడుగుల ఎత్తైన సమిట్ ఐలాండ్ శిఖరాన్ని ఈ బృందం అవరోధించింది. దాంతో అరుణిమకు ఆత్మవిశ్వాసం రెట్టిప్పైంది. 29వేల అడుగుల ఎత్తులో వున్న ఎవరెస్టును ఎక్కగలనన్న నమ్మకంతో 2013 ఏప్రిల్ లో ఎవరెస్టు యాత్రను ప్రారంభించింది. పైపైకి సాగిపోయిన అరుణిమ తన ఆశయ శిఖరాన్ని అవరోధించడంలో విజయం సాధించింది. వైకల్యాన్ని అధిగమించి అత్యున్నత శిఖరాన్ని చేరుకున్న తొలిమహిళగా చరిత్ర సృష్టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arunima Sinha  Mount Everest  

Other Articles