Biography Of Malladi Subbamma Who Is Famous Feminist writer | Women Empowerment

Malladi subbamma biography famous feminist writer

Malladi Subbamma news, Malladi Subbamma biography, Malladi Subbamma history, Malladi Subbamma life story, Malladi Subbamma wikipedia, Malladi Subbamma telugu wiki, Malladi Subbamma photos, indian famous women, telugu feminists

Malladi Subbamma Biography Famous Feminist writer : Biography Of Malladi Subbamma Who Is Famous Feminist writer. She Fought For Women Empowerment whole life.

మహిళా స్వేచ్ఛకోసం ఉద్యమాలు చేసిన స్త్రీవాద రచయిత్రి

Posted: 05/15/2015 04:46 PM IST
Malladi subbamma biography famous feminist writer

అమ్మాయిలను ‘లక్ష్మీ’తో పోల్చుతారు. ఎందుకంటే.. ఆమె ఓ కుటుంబ గౌరవాన్ని నిలబెడుతుంది. కష్టాలు ఎక్కువగా వున్న సమయంలో ధైర్యం నింపుతుంది. తన కన్నీటిని దిగమింగుకుని ఇతరులకు సంతోషాలను పంచుతుంది. చీకటిలో మునిగిన జీవితాల్లో వెలుగులా భరోసా కల్పిస్తుంది. తన ఆశలను, ఆశయాలను, కోర్కెలను చివరికీ తన జీవితాన్నే త్యాగం చేసి నలుగురికీ ఆదర్శంగా నిలుస్తుంది. అటువంటి స్త్రీలకు సమాజంలో ఏమాత్రం గౌరవం లభించడం లేదు. పురుషులకు రాజ్యాధికారం అధిష్టించేలా చేసి, మహిళల్ని వంటగదులకే పరిమితం చేస్తోందీ సమాజం! వారి స్వేచ్ఛను ‘ఇల్లాలి’ అనే బానిస సంకెళ్లతో హరిస్తుంది. ఇది నాటికి, నేటికీ జరుగుతూనే వుంది.

ముఖ్యంగా 20వ శతాబ్దంలో అయితే మహిళల పరిస్థితి మరీ దారుణంగా వుండేది. అలాంటి సమయంలో కొందరు మహిళా ప్రతిభావంతులు తమ స్వేచ్ఛాహక్కును పొందడం కోసం బానిస సంకెళ్లను చీల్చుకుంటూ గొంతెత్తారు. పురుషులతోపాటు తమకూ సమాన హక్కులు కల్పించాలంటూ పోరాటం కొనసాగించారు. మహిళా అభ్యుదయాన్ని చాటిచెప్పేందుకు, అందరిలోనూ చైతన్యం నింపేందుకు ఉద్యమాలు చేపట్టారు.. రాబోయే తరాలవారికి ఆదర్శంగా నిలిచారు. అటువంటి వారిలో ‘మల్లాది సుబ్బమ్మ’ ఒకరు. ‘కేవలం పిల్లల్ని కంటూ, ఇంటి పనులు చేసుకొంటూ, అత్తమామల అదుపాజ్ఞలలో జీవించడమే మహిళల కర్తవ్యమా?’ అని ప్రశ్నించిన ప్రముఖ స్త్రీవాద రచయిత్రి.

జీవిత చరిత్ర :

1924 ఆగస్టు 2వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకలో సుబ్బమ్మ జన్మించారు. ఈమెకి చిన్న వయస్సులోనే బాపట్ల వాస్తవ్యులైన మల్లాది వెంకట రామమూర్తితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. అయితే.. జీవితంలో ఏదో సాధించాలన్న ఈమె కాంక్ష.. సమస్త స్త్రీలకు ఆదర్శంగా నిలిచేలా చేసింది. ఈమె చదువుకోవాలన్న పట్టుదల కలిగి వుండేది. కానీ.. అత్తమామలు అందుకు వ్యతిరేకించారు. కానీ, భర్త సహకారంతో ఇంట్లోనే విద్య నేర్చి మెట్రిక్‌కి కట్టారు. వరుసగా పి.యు.సి., బి.ఎ., కూడా చదివి, కుటుంబ నియంత్రణ ప్రచారకురాలిగా కొన్నేళ్లు ఉద్యోగం చేశారు.

బాపట్లలో అయిదేళ్లు స్త్రీ హితైషిణీ మండలి కార్యదర్శిగా, బాలికా పాఠశాలకు మేనేజరుగా, శారదా మహిళా విజ్ఞాన సమితికి అధ్యక్షురాలిగా పనిచేస్తూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో దిగారు. 1970లో విజయవాడలో వికాసం అనే పత్రిక స్థాపించి పదేళ్లు నడిపారు. 1978లో లండన్ లో జరిగిన ప్రపంచ హ్యూమనిస్టు సభల్లో పాల్గొన్నారు. 1980లో మహిళాభ్యుదయం అనే సంస్థను స్థాపించారు. అభ్యుదయ వివాహ వేదిక ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఆదర్శ వివాహాలు జరిపించారు. కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢవిశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్యకోసం కృషి చేశారు.

మహిళాభ్యుదయ గ్రంథాలయం, కుటుంబ సలహా కేంద్రం, స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం, వరకట్న హింసల దర్యాప్తు సంఘం, స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రం, శ్రామిక మహిళాసేవ, సుబ్బమ్మ షెల్టర్, మల్లాది సుబ్బమ్మ ట్రస్టు ద్వారా మహిళలకు సేవ చేశారు. ‘వికాసం’, ‘స్త్రీ స్వేచ్ఛ’ అనే మాస పత్రికకు సంపాదకురాలిగా ఉన్నారు. 1979 నుంచీ ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికీ, 1989 నుంచీ అఖిలభారత హేతువాద సంఘానికీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. 2000లో మహిళా ఒకేషనల్ జూనియర్ కళాశాలను ఈమె ప్రారంభించారు. ఆమె తన యావదాస్తిని ‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’కి రిజిస్టరు చేసారు.

ఈమె మహిళా జీవన విధానంపై ఎన్నో రచనలు చేశారు. బాల్యం, దాంపత్య జీవితం, మహిళలపై జరిగే అన్యాయాలు.. ఇంకా ఎన్నో రచనలు చేశారు. మహిళల్లో చైతన్యం కలిగేలా ఎంతో కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళోద్యమం - మహిళా సంఘాలు 1960-1993 అనే పుస్తకం.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథం అవార్డు పొందింది. సంఘసేవకు గాను ఎమ్.ఎ.థావుస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డుపొందారు. ఈమె 2014 మే 15న మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malladi Subbamma  Telugu Women Feminists  Indian Famous writer  

Other Articles