Gabriela Mistral The Famous Spanish Poet | Noble Prize Winner

Gabriela mistral biography famous spanish poet noble prize

Gabriela Mistral life story, Gabriela Mistral biography, Gabriela Mistral history, Gabriela Mistral wiki telugu, Gabriela Mistral wikipedia, Gabriela Mistral life, Gabriela Mistral poets, Gabriela Mistral quotes, Gabriela Mistral photos, noble prize, Gabriela Mistral noble prize, noble prize winners list

Gabriela Mistral biography famous Spanish poet noble prize : The Biography of Famous spanish poet Gabriela Mistral who creates sensation by getting the first noble prize.

తొలి నోబెల్ బహుమతి పొందిన సుప్రసిద్ధ స్పానిష్ కవయిత్రి

Posted: 04/08/2015 06:09 PM IST
Gabriela mistral biography famous spanish poet noble prize

తమ కవిత్వాలతో ప్రజలను ఉత్తేజపరిచి, వారికి మార్గదర్శకులుగా నిలిచిన కవులు, కవయిత్రిలు ఎందరో వున్నారు. అలాంటి వారిలో గబ్రియేలా మిస్ట్రాల్ ఒకరు. సుప్రసిద్ధ స్పానిష్ కవయిత్రి అయిన ఈమె సాహిత్యంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన తొలి నోబెల్ బహుమతిని పొంది చరిత్ర సృష్టించారు.

జీవిత చరిత్ర :

1885 ఏప్రిల్ 7వ తేదీన లాటిన్ అమెరికా ప్రాంతానికి చెందిన చిలీ దేశంలో గబ్రియేలా జన్మించారు. నిజానికి ఈమె అసలు పేరు లుసిల గొడొయ్ అల్చయాగ. కవయిత్రిగా అవతారమెత్తిన తర్వాత ఈమె ‘గబ్రియేలా మిస్ట్రాల్’ అనే తన కలంపేరుతో ప్రసిద్ధి పొందారు. తండ్రి జూఅన్ గెరొనిమొ గొడొయ్ విల్లన్యువ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాగా.. తల్లి పెట్రొనిల అల్చయగ దర్జీగా పనిచేస్తూ దేశదిమ్మరి కవిత్వాన్ని రచించారు. గబ్రియేలా మూడేళ్ళ ప్రాయంలో వుండగానే ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలిపెట్టేశారు. దాంతో ఈమె వ్యక్తిగత జీవితం కష్టాలమయంగా మారింది. పదహారేళ్ళ వయసులోనే వున్నప్పుడు కుటుంబ కష్టాల కారణంగా ఆమె పల్లెటూరిలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు.

వ్యక్తిగత జీవితం :

ఈమె ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సమయంలో రైల్వేలో ఉద్యోగిగా పనిచేసే రోమెలియో ఉరేటాని ప్రేమించింది. అయితే అతను కొద్దికాలంలోనే ఆత్మహత్య చేసుకుని మృతిచెందారు. మరణించినప్పుడు అతని జేబులో మిస్ట్రాల్ రాసిన లేఖ మాత్రమే దొరికింది. ఆ ఘటనకు కలతచెందిన ఆమె జీవితాంతం అవివాహితగానే ఉండిపోయింది. దీంతో ఆమె ఒక కొడుకును దత్తత తీసుకుని పెంచుకుంది. అయితే అతడు కూడా యుక్త వయసులో మరణించాడు. ఈ విషాదాలు ఆమె వ్యక్తిత్వంపై, తద్వారా కవిత్వంపై ముద్రవేశాయి. వివిధ ఉద్యోగాలు నిర్వహించి, పలు పదవులు చేపట్టిన గబ్రియేలా జీవితమంతా కవిత్వాన్ని రచించారు.

రచయిత్రిగా :

బాల్యం, ప్రేమ, ప్రకృతి, క్రైస్తవ మత విశ్వాసాలు, మరణం వంటివి ఎక్కువగా గబ్రియేలా సాహిత్యంలో కవితా వస్తువులు అయ్యాయి. కవిత్వాన్ని సూటిగా, సుస్పష్టంగా, తేలికైన పదాలతో రచించడం ఆమె శైలి. 1914లో ఆమె తొలి సంకలనాన్ని ప్రచురించారు. మృతుల జ్ఞాపకాలు అన్న అర్థంతో ఉండే శీర్షికతో ఆ పుస్తకం రూపొందింది. ఆ పుస్తకంలోని ప్రేమ కవితలు ఆమెకు గుర్తింపు తీసుకువచ్చాయి. 1922, 1924, 1938ల్లో ఆమె కవితా సంకలనాలను వివిధ కవితావస్తువులతో వెలువరించారు.

ప్రకృతిని, బాల్యాన్ని ప్రేమించడం ఆమె వ్యక్తిత్వంలోని రెండు ప్రధానమైన అంశాలుగా కనిపిస్తాయి. బాల్యం జీవితానికే ఊటలాంటిదంటూ, దాన్ని నిర్లక్ష్యం చెయ్యడం అత్యంత ఘోరమైన నేరంగా ఆమె పేర్కొన్న వాక్యాలు సుప్రసిద్ధాలు. కవిత్వం సమాజానికి ఎంతగానో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఇలా ఈ విధంగా రచయిత్రిగా తన ప్రస్థానాన్ని కొనసాగించి, ఇతరులకు ఆదర్శంగా నిలిచిన ఈమె.. 1957 జనవరి 10న అమెరికాలో కాన్సర్ వ్యాధి కారణంగా మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gabriela Mistral  Famous poets in world  Noble prize winners list  

Other Articles