Indian actress Sujatha biography | Indian Film Industry

Indian actress sujatha biography

sujatha biography, actress sujatha news, actress sujatha, actress sujatha history, actress sujatha life story, actress sujatha indian actress, Indian film actress, indian film actors, indian film industry

Indian actress Sujatha biography : The biography of famous indian actress sujatha who born in srilanka. She acted in tamil, telugu, hindi, malayalam and kannada languages movies.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చెరగని ముద్రవేసిన శ్రీలంక నటి

Posted: 04/06/2015 05:40 PM IST
Indian actress sujatha biography

సాధారణ చిత్రపరిశ్రమ అన్న తర్వాత దానికి భాష, మత, ప్రాంతం వంటివి భేదాలుండవు. ఇతర రాష్ట్రాలు, దేశాలు, అంతర్జాతీయ ప్రాంతాల నుంచి దేశవిదేశాల్లో వున్న ప్రతి ఒక సినీ పరిశ్రమలోనూ నటీనటులు ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ అవుతుంటారు. ఇక ఇండియన్ పరిశ్రమలోనూ ఇప్పటికే ఎందరో నటీనటులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఇంపోర్ట్ అయి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారున్నారు. అటువంటివారిలో సుజాత ఒకరు. శ్రీలంక దేశంలో పుట్టిపెరిగిన ఈమె.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం, హిందీ భాషల చలనచిత్రాలలో నటించి, ప్రసిద్ధ నటిగా చెరగని ముద్ర వేసుకున్నారు.

జీవిత చరిత్ర :

1952 డిసెంబర్ 10వ తేదీన శ్రీలంకలో నివాసమున్న మలయాళి దంపతులకు సుజాత జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా శ్రీలంకలో స్థిరపడటంతో ఈమె అక్కడే జన్మించింది. బాల్య జీవితాన్ని ఇక్కడే గడిపింది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత తండ్రి పదవీ విరమణ చేయడంతో మళ్ళీ కేరళకు వచ్చేశారు. కేరళకు వచ్చిన అనంతరం ఈమెకు సినిమాల్లో నటించే అవకాశాలు వరించాయి.

సినీ జీవితం :

సుజాత పద్నాలుగేళ్ల వయస్సులోనే ‘తబస్విని’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఆ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించడంతో ఈమెకు మరిన్ని మూవీ అవకాశాలు చుట్టుముట్టాయి. దీంతో వచ్చిన ఆఫర్లు ఏమాత్రం తిరస్కరించకుండా వరుసగా నటిస్తూ తన ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఏడేళ్ల వ్యవధిలో ఈమె 40 చిత్రాలు చేసి తిరుగులేని నాయికగా ఎదిగింది. ప్రముఖ దర్శకుడు బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘అవళ్‌ ఒరు తొడర్‌ కథై’ (తెలుగులో ‘అంతులేనికథ’) మూవీతో నటిగా వెలిగిపోయింది.

సుజాతను దాసరి నారాయణరావు ‘గోరింటాకు’ (1979 సినిమా) చిత్రంద్వారా తెలుగులో పరిచయం చేశారు. ఆ చిత్రం విజయవంతంకావడంతో పలు చిత్రాలలో, అగ్రకథానాయలతో నటించే అవకాశాలు వచ్చాయి. ‘గోరింటాకు, సూత్రధారులు, శ్రీరామదాసు’ ఆమెకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు. 1997లో వచ్చిన పెళ్ళి (సినిమా) చిత్రానికిగాను ఈమెకు నంది అవార్డు వచ్చింది. అలాగే తమిళంలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘కలైమామణి’ అవార్డు అందుకున్నారు.

వ్యక్తిగత జీవితం :

సుజాతది ప్రేమ వివాహం. తమ ఇంటి యజమాని వాళ్లబ్బాయి జయకర్‌ హెన్రీని ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్లిచేసుకుంది. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయింది. అయితే అక్కడి సంప్రదాయాలు సుజాతకు నచ్చలేదు. కాన్పు కోసం ఇండియాకి వచ్చి మళ్లీ వెళ్లలేదు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress sujatha biography  indian film industry  indian actors  

Other Articles