Yusuf jahi malala won the nobel piece prize special story

yusuf jahi malala, nobel prize, nobel piece prize, pakisthan nobel prize winner, nobel prize winner from pakisthan

yusuf jhai malala from pakistan won the nobel prize special story

పిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్నపాకిస్థాన్ సాహస బాలిక

Posted: 12/16/2014 10:03 AM IST
Yusuf jahi malala won the nobel piece prize special story

అత్యంత పిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ చరిత్ర సృష్టించారు. భారతీయుడు కైలాశ్ సత్యార్థితో పాటు 17 ఏళ్ల మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు మహిళా విద్యకు తన మద్దతును ప్రకటించడమే కాకుండా, పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తిన మలాలా యూసుఫ్ జాయ్ అలా ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతే కాదు చంపుతామని బెదిరించారు కూడా కాని ఆమె ధైర్యం ముందు ఆ బెదిరింపులు చిన్నబోయాయి.

ఈ యువతి సాహసంపై ప్రపంచ ప్రముఖులు మాట్లాడుతూ మలాలా ఒక వ్యక్తికాదని ఓ శక్తి అని చెప్పుకొచ్చారు. ఆమె ధైర్యం, తెగింపును ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలన్నారు. ఉగ్రవాదంపై పోరాడి గెలుపు సాధిస్తామని చెప్పారు.

మలాలా అంటే అర్థం - బాధాసర్పద్రష్ట. ఆమె బాధంతా చదువుకునే హక్కు కోసమే. మలాలా ఆశయం వైద్యవృత్తి. కానీ తండ్రి ప్రోత్సాహం మేరకు రాజకీయాలలో చేరాలని నిర్ణయిం చుకుంది. ఇద్దరు తమ్ముళ్లు నిద్రపోతున్నా, అర్థరాత్రి దాటే వరకు మలాలా తండ్రితో రాజకీయాల గురించి చర్చిస్తూనే ఉండేది. ఆ చైతన్యం ఫలితమే 2008 సెప్టెంబర్‌లో పెషావర్ ప్రెస్‌క్లబ్‌లో ఇచ్చిన ఉపన్యాసం. అక్కడే మలాలా వేసిన ప్రశ్న ‘చదువుకోవడానికి నాకు ఉన్న హక్కుని లాక్కోవడానికి తాలిబన్లు ఎవరు?’ ఇదే ప్రశ్న చానెళ్ల ద్వారా స్వాత్ లోయ మొత్తం ప్రతిధ్వనిం చింది. అప్పటి నుంచే ఆమె, ఆమె కుటుంబ సభ్యులు తాలిబన్లకు శత్రువులయ్యారు.

యుద్ధవాతావరణానికి ఏ మాత్రం తీసిపోని స్వాత్ లోయలో సాధారణ ప్రజల జీవితం ఎలా ఉన్నదో ప్రపంచానికి తెలియచేసేందుకు బీబీసీ పూనుకున్నది. స్వాత్‌లోయ అనుభవాలను మలాలా ‘గుల్ మకాయ్’ (జొన్న పువ్వు అని అర్థం) అనే మారుపేరుతో డైరీ రూపంలో బీబీసీ కోసం ఉర్దూలో రాసింది. అది తాలిబన్ల నెత్తుటి చరిత్రే. ‘తూటాలతో మనలని మౌనంగా ఉండేటట్టు చేయగలమని ఉగ్రవాదుల ఆలోచన.

అందులో వాళ్లు విఫలమయ్యారు. ఆ మౌనం నుంచి వేల గొంతులు వినిపించాయి’ అంటూ సమితి సభలో మలాలా చెప్పిన మాట అక్షరాలా నిజం. మలాలా మీద కాల్పులు జరగగానే పాకిస్థాన్ ప్రజలతోపాటు, ప్రపంచంలో చాలామంది ఆ బాలికకు సంఘీభావం ప్రకటించారు. మలాలా మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపిన (అక్టోబర్ 9, 2012) వార్త పెనుగాలిలా ప్రపంచాన్ని తాకగానే నోబెల్ శాంతి బహుమతి గ్ర హీత డెస్మాండ్ టుటు అదే బహుమతికి మలాలా పేరును సిఫారసు చేశారు. అంతటి పురస్కారం పరిశీలనకు ఎంపికైన పిన్న వయస్కురాలు మలాలాయే. నాటికి ఆమె వయసు పదిహేనేళ్లు. అప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఆ ప్రయాణం ఎంత స్ఫూర్తిదాయకమో, అంత విప్లవాత్మకం కూడా.

‘ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవడం గురించి మాట్లాడటానికి రాలేద’ని సమితి సభలో మలాలా చెప్పింది. ‘ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు ఉంది. అది మాట్లాడేందుకు ఇక్కడ నిలబడ్డాను’ అని ప్రకటించింది. నిజానికి ఆ ఆశయాన్నే పాకిస్థాన్‌లో, స్వాత్ లోయలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించింది. కానీ స్వాత్ లోయ ఒక యుద్ధభూమి. మత ఛాందసవాదుల స్థావరం. 2007-2008 విద్యాసంవత్సరంలో తాలిబన్లు అక్కడ యుద్ధం మొదలుపెట్టారు. తాలిబన్ల సమాంతర ప్రభుత్వంతో లోయ నలిగిపోతోంది.

సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం. నా మీద తూటాలు కురిపించిన తాలిబన్ వచ్చి నా ఎదురుగా నిలిచినా అతడిని నేను క్షమిస్తాను. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ థెరిసాలే నాకు ఆదర్శ’మని మలాలా చెప్పింది. తాలిబన్లకు చదువు లేదు, అందుకే ఇలాంటి దుష్టకార్యాలకు పాల్పడుతున్నారని నిష్కర్షగానే చెప్పింది. కానీ ఆ ఉపన్యాసంలో ఆమె ప్రపంచ పెద్దలను ఉద్దేశించి పలికిన మాట చరిత్రాత్మకం.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles