Writer and poet infosys chairman narayana murthi wife sudhamurthi special story for yashodhara

sudha murthi, infosys sudha murthi, infosys, infosys hyderabad, infosys narayana murthi, infosys foundation, infosys banglore, infosys sudha murthi, padmasri sudha murthi

as a writer as a computer engineer, as a poet, played key roles in her life she is none other than sudha murthi infosys chairman narayana murthi wife

ఒక కంప్యూటర్ ఇంజనీర్ గా.... ఒక గొప్ప కవయిత్రి గా.... సుధా మూర్తి

Posted: 12/12/2014 09:47 AM IST
Writer and poet infosys chairman narayana murthi wife sudhamurthi special story for yashodhara

పద్మశ్రీ సుధా మూర్తి దేశ సంఘ సేవకురాలు, మరియు రచయిత్రి. అంతే కాదు దేశ ప్రతిష్టాత్మక సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు అయిన నారాయణ మూర్తి అర్దాంగి కూడా.  కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్ మరియు గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.. ఈవిడ పలు అనాధాశ్రమాలను ప్రారంభించింది. అలాగే గ్రామీణాభివృద్దికి సహకరించింది. కర్ణాటక లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడింది.

హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంధాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంచించింది.. తన వృత్తి జీవితంతో బాటు ఈవిడ ఒక మంచి కంప్యూటర్ సైన్స్ఉపాధ్యాయురాలు మరియు కాల్పనిక రచనలు కూడా చేస్తుంది. ఈమె రచించిన కన్నడ నవల డాలర్ సొసే (డాలర్ కోడలు) ఆంగ్లములోడాలర్ బహు గా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001 లో జీ టీవీ లో ధారావాహికగా ప్రసారమైనది.

వ్యక్తిగత జీవితం:

ఆగస్టు 19, 1950 వ సంవత్సరము శనివారం నాడు కర్ణాటక రాష్ట్రం హావేరీ జిల్లా షిగ్గాన్ లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఎస్. ఆర్. కులకర్ణి వైద్యుడు. బాల్యమంతా తల్లి తండ్రులు, తాతయ్య మరియు నానమ్మ ల మధ్య గడిచింది..

విద్యాభ్యాసం పూర్తి చేసుకొని భారతదేశ అతిపెద్ద ఆటో పరిశ్రమ ఐన టెల్కో లో మొట్టమొదటి మహిళా ఇంజనీర్ గా ఉద్యోగం సాధించింది. అప్పటికి ఈ సంస్థలో కేవలము పురుషులకే స్థానం కల్పించేవారు. దీనిని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి ఒక పోస్టుకార్డు రాసింది. దీనిని స్పందించిన ఆయన ఆవిడకు ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి, అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించాడు. ఆ సంస్థ పూనా శాఖలో పనిచేస్తున్నపుడే ఆవిడకు ఎన్.ఆర్.నారాయణ మూర్తి తో పరిచయమై తర్వాతి కాలంలో వారిద్దరు వివాహం చేసుకోవడానికి దారితీసింది.

భారత ప్రభుత్వము నుండి అత్యుత్తమ పద్మశ్రీ పురస్కారము 2006 వ సంవత్సరంలో అందుకున్నారు. ఈవిడ మంచి రచయిత్రి కూడా. కాల్పనిక సాహిత్యంపై పలు రచనలు కూడా చేశారు. పెంగ్విన్ ముద్రణా సంస్థద్వారా దాతృత్వం, ఆతిధ్యం మరియు స్వీయ పరిపూర్ణత లపై కాల్పనిక పాత్రల ద్వారా ఆమె రచించిన పలు పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. ఈమె రచించిన How I Taught My Grandmother to Read & Other Stories అనే పుస్తకము దాదాపు పదిహేను భాషలలో తర్జుమా చేయబడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sudha murthi  infosys  narayana murthi  padmasri sudha murthi  

Other Articles