Playback singer s janaki

S.Janaki Biography, S.Janaki Profile, Janaki, Padma Bhushan, PTI, Murali Krishna, Ottappalam, Palakkad, Kannada, Telugu, India

S. Janaki is one of the most important playback singers of South India. She has sung in more than 13 languages. To know more about her

సుస్వర సుధామయి ఎస్. జానకి

Posted: 04/16/2013 06:29 PM IST
Playback singer s janaki

సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా అంటూ పదహారేళ్ల అమ్మాయి ఊసులను చెప్పింది ఆ కంఠం. గోవులున్న తెల్లన... గోదూళి ఎరన్ర... అంటూ అమాయక చిన్నారి ప్రశ్నలను పలికించింది ఆ గాత్రం. వెన్నల్లో గోదారి అందం అంటూ నిర్బంధంలో ఉన్న స్ర్తీ వేదనను రాగయుక్తంగా ఆలపించింది. ఆమె గాత్రం ఏడిచే పిల్లాడికి జోలపాట, శ్రామికుడికి పనిలో అలసటను మరిపించే పాట, పోరాట మహిళలకు ఉత్సాహాన్నిచ్చే పాట ఇలా ఆమె గాత్రం దక్షిణ భారతాన సుపరిచితం. దాదాపు 55 సంవత్సరాలకు పైగా చిత్ర పరిశ్రమకు ఆమె తన సేవలను అందించారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆమె ఎవరో కాదు.. 20,000లకు పైగా పాటలను పాడి లక్షలాది మందిని తన గాత్రంతో ఓలలాడించిన ప్రముఖ గాయిని జానకి.

55 ఏళ్లకు పైగా చిత్ర రంగంలో సేవలు అందించి, లక్షల మంది అభిమానులను సంపాదించుకొని,‘విధిరున్‌ విలాయట్టు ’ చిత్రం నుండి తన గాత్రాన్ని వినిపించి, దక్షిణ భారత భాషల్లో పాటలు పాడి,  ఉత్తమ గాయినిగా పలు అవార్డులు సొంతం చేసుకున్న జానకి, ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్‌ను సున్నితంగా తిరస్కరించింది.

పగలే వెన్నెల జగమే ఊయాల... అంటూ ప్రేక్షుల మనసుల్లో పాతుకుపోయిన జానకి స్వరానికి ఎందరో అభిమానులు. అ మధుర స్వరాన్ని ఇప్పటికి మరచిపోలేని వారు ఉన్నారు. తియ్యటి స్వరాలను అందించిన జానకి గురించి ఎంత చెప్పిన తక్కువే. మన రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల్లో తన స్వరాన్ని వినిపించి స్రోతల మనసులో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అనేక భాషల్లో తెలుగు వారి గళ మాధుర్య రుచిని చూపి మన కీర్తి పతాకను ఎగుర వేసిన స్వరసుధామయి.దక్షిణ భారత నేపథ్య గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న జానకిది గుంటూరు జిల్లాలోని రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామం. శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులు తల్లిదండ్రులు. ఈమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా అనేక భారతీయ భాషల్లో తన గాత్రంతో మరిపింపజేసింది.

పాడడమే కాదు పాటల రచయిత, కర్నాటక గాత్ర సంగీత విధ్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుని, సాయిబాబా భక్తురాలైన ఈమె ఎక్కువ సమయం పూజల్లో గడుపుతుంటారు. అంతేకాక మీరాపై అనేక భక్తిగీతాల క్యాసెట్ల రికార్డు చేసి విడుదల చేశారు. జానకి కొంతకాలం సిరిసిల్లలో, రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుడి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఫన్‌డాక్టర్‌ చంద్రశేఖర్‌ కుమారుడు వి. రాంపస్రాద్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. లతామంగేష్కర్‌, పి.సుశీల, జిక్కీ, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది.

19 ఏట నుంచి చిత్ర రంగంలో అడుగుపెట్టి మద్రాసుకు మారింది. తొలినాళ్లలో ఏవీయం స్టూడియో గాయినిగా ఉండి 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియిన్‌ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రహసనం మొదలయ్యింది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగువారికి దగ్గరయింది. ఈ చిత్రంలో తన పాట ఎంతో పేరు తెచ్చిపెట్టింది.అలా మొదలైన ఈమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాలగోపాలాన్నీ అలరింపజేసింది. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, హిందీ మొదలైన భారతీయ భాషలన్నింటిలోనూ పాడటమే కాకుండా, సింహళ, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీష్‌, సంస్కృతం, కొంకణి, తులు, సౌరాష్ట్ర, బదుగ, జపనీస్‌, జర్మన్‌ భాషల్లో కూడా గాత్రాన్ని వినిపించి అందరి ప్రశంసల్నీ అందుకుని లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది. అనేక పురస్కారాలు, సత్కారాలు అందుకుంది.

ప్రమాదం

2012లో తిరుపతిలో జరుగుతున్న అన్నమయ్య సంకీర్తనా యజ్ఞంలో పాల్గొనేందుకు జానంకి తిరుపతి వెళ్లారు. తిరుపతిలోని భీమాస్‌ హోటల్‌లో బస చేసిన జానకి బాత్‌ రూమ్‌లో కాలు జారీ పడ్డారు. ఈ ఘటనలో ఆమె తలకు బలమైన గాయం తగలడంతో, కాలు కూడా బెణికింది. స్విమ్స్‌ ఆసుపత్రికి చికిత్స అనంతరం కోలుకున్నారు.

పద్మభూషణ్‌ తిరష్కరణ

ఈమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2013 సంవత్సరానికి పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. అయితే సుమారుగా 55 సంవత్సరాలకు పైగా సినీ రంగంలోనేకాక అనేక ప్రతిష్టాత్మకమైన వేదికల మీద కూడా పాడుతూ ఎందరో ప్రముఖులతో అనేక సన్మాన పురస్కారాలు అందుకుని అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న జానకి పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకోవడానికి ఇష్టపడలేదు. పురస్కారాలకు ఎంపిక చేసేవారు ఆంధ్ర రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని, ఉత్తర భారత దేశ వారు భారత రత్న, పద్మశ్రీలకు ఎంపివుతుంటే దక్షిణ భారత దేశం వారికి మాత్రం ఏదో చిన్న చిన్న పురస్కారాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగా ఈ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించారు. భారతరత్న పురస్కారం ఇస్తేనే అంగీకరిస్తానని, లేనిపక్షంలో ఇటువంటి పురస్కారాలు తనకు అవసరం లేదని చెప్పడం ఈమె ధీరత్వానికి నిదర్శనం. అభిమానుల గుండెల్లో నేను ఎక్కడో ఎత్తున ఉన్నాను. ఈ అవార్డు ఇవ్వడం పట్ల ప్రభుత్వాన్ని తప్పుబట్టను గానీ, ఇన్నాళ్లకు గుర్తించడం బాధగా ఉందని ఆమె ఈ సందర్భంగా అన్నారు.

ఇతర పుపస్కారాలు

ఉత్తమ నేపథ్య గాయనిగా 1977, 1981, 1984, 1992 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

1986లో కలైమామణి

1997లో ఫిలింఫేర్‌ దక్షిణ భారత సాహిత్య అవార్డు 2002లో ఎచీవర్‌ అవార్డు

2005లో స్వరాలయ జేసుదాసు ప్రత్యేక పురస్కారం 2009లో గౌరవ డాక్టరేట్‌

2011లో కర్నాటక బసవభూషణ్‌ అవార్డు

2012లో నిత్యనూతన గాత్రంగా విజయా మ్యూజికల్‌ అవార్డు

2013లో మా మ్యూజిక్‌ జీవిత సాఫల్య అవార్డులే

రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు 10 సార్లు అందుకుంది.

వీటితోపాటు తమిళనాడు సినీ అవార్డులు 7, ఒరియా సినీ అవార్డుల్లో బెస్‌‌ట ప్లేబాక్‌ సింగర్‌గా, కేరళా రాష్ర్ట ఉత్తమ గాయిని 11 అవార్డులు సాధించింది.

జానకి గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని లీటర్ల తెనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles