Information about jayamalini

Jayamalini, Biography, Jayamalini Photos, Movie Stills, Fan Club, Latest News, Jayamalini Wallpapers, Videos, Photo Gallery, Filmography

information about Jayamalini including upcoming movies, biography, filmography, Jayamalini photos, videos, wallpapers, movie releases. Join Jayamalini fan club watch trailers, upload photos, videos and read the latest news

Information about Jayamalini.GIF

Posted: 02/07/2012 01:38 PM IST
Information about jayamalini

Jayamalini_Information

Jayamalini‘పట్టుకుంటే పదారేళ్లురా నా సామి... కట్టుకథలూ చెప్పమాకురా’
అనంటే... ఈ హెవీ బ్యూటీ వయసు స్వీట్ ‘సిక్స్‌టీ న్’మాత్రమేనా
అనుకోలేదెవరూ! ‘గుడివాడ వెళ్లాను... గుంటూరు పొయ్యాను... ఏడ చూసినా నేనే కావాలంటారూ సచ్చినోళ్లు... ఆటకి వచ్చినోళ్లు’ అని ఆమె నోరు పారేసుకున్నా నోళ్లు వెళ్లబె ట్టేసి చూస్తూండిపోయారంతే. అతిశయోక్తులు పలికినా అతిశయంతో ఆడిపోసుకున్నా... ఆమె ఏం చేసినా అందమే. ఎంత చేసినా అందమే. ఒక ఆటకో ఒక పాటకో కాదు... అది టూరింగ్ టాకీసో, ఏసీ హాలో తేడా లేదు. ‘ఎ’ క్లాసా ‘సి’ క్లాసా డిఫెరెన్సూ లేదు. ఆమె కనపడితే నోరెళ్లబెట్టాల్సిందే, ఆ నోట్లోకి రెండు వేళ్లూ వెళ్లాల్సిందే... వి‘జయమాలిని’ని చూస్తూ ఆపుకోలేని ఆనందంతో విజిలేయడానికి!

ఆనాటి ఆ ఆంధ్రా సోడాబుడ్డి ఏది? మన అచ్చతెలుగు చిచ్చుబుడ్డి జయమాలిని ఇప్పుడు ఎక్కడుంది?తాతల్నీ, మనవళ్లనీ తనతో తాన తందాన అనిపించిన నాట్యరాణి... తళుక్కుమంటూ తెరమీద సందడి సృష్టించిన తెరవేల్పు ఏదీ? ‘తారా’జువ్వలా...

సూళ్లూరుపేట మన రాష్ట్రంలో ఉందని తెలుసా? నెల్లూరు జిల్లాలో అంతరిక్ష ప్రయోగశాల కేంద్రం ‘షార్’ ఉన్న శ్రీహరికోటకు గేట్‌వే ఈ ఊరని తెలుసా? అందుకే ఈ సూలూరు ఉరఫ్ సూళ్లూరు పేటను రాకెట్ టౌన్ అంటారని కూడా తెలుసా? ఇవన్నీ తెలిసుండొచ్చు కాని... దాదాపు 35 ఏళ్ల క్రితమే ఆ ప్రాంతం నుంచి ఒక రాకెట్ ప్రయోగం జరిగిందనీ, అది తెలుగు తెరపై ‘ఐటమ్ బాంబ్’గా అవతరించిందని, దశాబ్దాల పాటు చిత్రసీమను ఓ కుదుపు కుదిపిందని మాత్రం తక్కువ మందికి మాత్రమే తెలుసు. వినోదాల ఆకాశంలో మెరుపులు మెరిపించిన ఆ ‘తారా’జువ్వ జయమాలిని!

రాకెట్ స్పీడ్‌తో...
సూళ్లూరు పేట వంటి చిన్న టౌన్‌లో పుట్టి పెరిగిన అలివేలు మంగ తాయారు అనే సగటు ఆడపిల్ల... జయమాలినిగా మారి దాదాపు 500 సినిమాల్లో నర్తించి-నటించిందనంటే ఇప్పటి ఐటమ్ గాళ్స్ అదిరి పడాల్సిందే. ఎక్స్‌ పోజింగ్‌కు ఎంత తెగించినా అరకొర సినిమాల తర్వాత అ‘డ్రస్’ లేకుండా పోతున్న వ్యాంప్ భామలకు ‘జయమాలిని’ ఒక చదివి తీరాల్సిన చరిత్ర. అన్నదమ్ముల అనుబంధంలో బాలకృష్ణ పక్కన కధానాయికగా చేసిన అమాయకపు చూపుల టీనేజీ గాళ్... ఆ తర్వాత ‘‘గుడివాడ ఎల్లాను, గుంటూరు ఎల్లాను’’ అంటూ అన్నగారితో కల్సి ‘యమగోల’ చేసిందంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం. దయ్యాలు భయపెడతాయని మాత్రమే తెలిసిన వారి చేత ప్రేతాత్మల్ని సైతం ప్రేమించడం నేర్పిన జగన్మోహిని ఈమె. ఆ తర్వాత ప్రేక్షకలోకాన్ని ఒక ఊపు ఊపింది. ఆమె ఆటతో థియేటర్లు దద్దరిల్లాయి. పాటతో బాక్సులు బద్దలయ్యాయి. ‘పుట్టింటోళ్లు తరిమేశారు... కట్టుకున్నోడు వదిలేశాడు’ అంటూ ఆమె వేటగాడుతో మొరపెట్టుకుంటే ప్రతి ప్రేక్షకుడూ ‘నీ కెందుకు నేనున్నా’ననేయాలనేంత ఉద్రేకపడిపోయాడు. ‘ఓ సుబ్బారావో ఓ అప్పారావో’, ‘గుగుగుగూ గుడిసుంది మమమమ మంచముంది’, ‘మా అమ్మ చింతామణీ నా పేరు సౌదామినీ’, ‘నీ ఇల్లు బంగారం కానూ... నా ఒళ్లు సింగారం కానూ’... ఒకటా, రెండా, పదా, వందా... జయమాలిని వరుసగా పేల్చిన ఆట-పాటల టపాసులతో ప్రేక్షకులు ఉర్రూతలూగి ఊగి అలసిపోవడం కూడా మరచిపోయారు.ఎన్టీయార్‌కు హిట్‌పెయిర్ అనే పేరు సాధించి నటరత్న నుంచి యువరత్న దాకా తరాల కతీతంగా జట్టుకట్టిన ఆమె సయ్యాటలకు వయోభేదం మరచి ప్రేక్షక ప్రపంచం చిందేసింది. హిందీ, కన్నడ, తమిళ, మలయాళ సినిమాల్లోనూ ‘రాణిం’ చిన వ్యాంప్‌క్వీన్... ఎక్కడ?

పోలీసుభార్య...
ఇదేదో సినిమా పేరనుకుంటే టైటిల్లో కాలేసినట్టే. ఒకనాటి వినోద సామ్రాజ్ఞికి ఇప్పటి కేరాఫ్ ఇది. నాలుగు పదుల వయసులో సినిమాల నుంచి నిష్ర్కమించిన జయమాలిని, తల్లిదండ్రుల కోరిక మేరకు ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను తిరుమల వెంకన్న సాక్షిగా పెళ్లాడారు. హాఫ్ థౌజండ్ సినిమాలు చేసినా, సాటిలేని స్టార్‌డమ్ సాధించినా... పెద్దగా ‘డబ్బు’చేయని ఈ ఐటమ్‌స్టార్‌కు... కెరీర్ ప్రారంభంలో కొన్న ఇల్లు, ఎస్‌ఐగా పనిచేస్తూన్న భర్త, ఇద్దరు పిల్లలు... ఇదే ఇప్పటి ఆస్తి. ప్రస్తుతం చెన్నై, టీనగర్‌లోని చారి స్ట్రీట్‌లో ఉన్న ఆమె ఇంటికి వెళితే 53 ఏళ్ల సాధారణ గృహిణిగా కనిపిస్తారు. ఇంటర్వ్యూలంటే ఇష్టం లేదంటూ తిరస్కరిస్తారు. స్కూల్లో చదువుతున్న కూతురు, కొడుకుల సినీ వారసత్వం గురించి ప్రస్తావించడం ఆమెకు నచ్చదు. వారిని ఆ ‘రొంపి’కి దూరంగా ఉంచాలనే అనుకుంటున్నారామె. ఆమె ఇద్దరు సోదరులు, తల్లి కూడా చెన్నైలోనే ఉంటున్నారు. మరి... ఈ సినీ జగన్మోహిని తెర జీవితానికి తెరపడినట్టేనా అంటే... అవుననేదే సమాధానం! ఒకటీ అరా సినిమాలతో, సెలెబ్రిటీలైపోయి ప్రారంభోత్సవాలనీ, మరొకటనీ ప్రతి జేబుకీ, దుకాణానికీ కత్తెర్లేస్తూ ఎడా పెడా సంపాదించే అవకాశాల్లేని రోజుల్లో... వ్యాంప్ అంటే కనీస గౌరవం కూడా కరువైన ఆనాటి ‘చిత్ర’సీమలో... ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మరీ మనకు ఆనందాన్ని పంచిన ఈ వినోదనాయిక జీవితం వెలుగులోకి రావాలంటే ఈసారి మరే ‘డర్టీపిక్చర్’ తెరకెక్కాలో! బయోగ్రఫీ తయారీ పనిలో జయమాలిని రహస్యంగా నిమగ్నమయ్యార ని వినవస్తోంది. తగిన రచయిత కోసం ఆమె గాలిస్తున్నారట. అది నిజమైతే... ఆమె కథ ఈ రోజు కాకపోయినా, రేపటి సినిమా కథను నడిపిస్తుందనడంలో సందేహం లేదు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Uma krishnan trisha special interview
Thailands first female prime minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles