Thailands first female prime minister

Thailand,World news,Thaksin Shinawatra,Indira Gandhi,Benazir Bhutto,Aung San Suu Kyi,Women in politics,Gender,Women,Politics,Asia Pacific,World news

It's unlikely Yingluck Shinawatra, set to be Thailand's first female prime minister, would be in her job if it weren't for her powerful brother Thaksin. But for women in Asian politics, family can be everything

Thailands New Leader Yingluck.GIF

Posted: 02/03/2012 04:00 PM IST
Thailands first female prime minister

456

Yingluck_Shinawatraఆసియా ఖండంలో రాజకీయాల్లో అతివల పాత్ర క్రమంగా పెరిగిపోతున్నది. చట్టసభలకు అధినేత్రులుగా, మంత్రులుగా, వివిధ రాజ్యాంగ పదవుల్లో, ప్రధానమంత్రులుగా ఎంపికవుతున్న, ఎన్నికవుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఆసియా మహిళల్లో వస్తున్న చైతన్యానికి దీన్ని నిదర్శనంగా చెప్పవచ్చు. తాజాగా థాయ్‌లాండ్గలో ప్రధానిగా ఇంగిలక్‌ షినావత్ర ఎన్నికయ్యారు. 44 ఏళ్ళ వయస్సులోనే ఆమె ఈ అత్యున్నత పదవి చేపట్టడం విశేషం. వ్యాపారంతో పాటు రాజకీయ రంగంలోనూ ఆమె విశేషంగా రాణిస్తున్నారు.2011 ఆగస్టు 5 పదవీబాధ్యతలు స్వీకరించారు. ఇటీవల మన రిపబ్లిక్‌ వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా కూడా హాజరయ్యారు. మచ్చ లేని రాజకీయాలను అందిస్తానన్న షినావ్రత తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. అమెరికా ఆంక్షలకు గురైన వ్యక్తిని, ఉగ్రవాదం సహా ఇతర నేరారోపణలు ఉన్న వ్యక్తులను ఆమె ఇటీవల మంత్రివర్గంలో చేర్చుకున్నారు. దీనిపై ప్రస్తుతం అంబుడ్గ్సమన్‌ విచారణ జరుగుతోంది. 15 రోజుల్లోగా ఆమె తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.

సోదరుడికి జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్యబద్దంగా ప్రతీకారం తీర్చుకున్న మహిళ వాస్తవగాధ ఇది. ఇంగిలక్‌ మొదట తన సోదరుడు ప్రారంభించిన సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. ఆ తరువాత ఓ రియల్‌ఎస్టేట్‌ సంస్థకు ప్రెసిడెంట్‌గా, ఆ తరువాత అడ్వాన్స్‌డ్‌ ఇన్ఫో సర్వీస్‌కు ఎండీగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ఆమె సోదరుడు తక్‌సిన్‌ ప్రధాని అయ్యారు. సైనిక కుట్రలో పదవి కోల్పోయారు. స్థానిక న్యాయస్థానం ఆయన తన పదవిని దుర్వినియోగపర్చినట్లు నిర్ధారించడంతో స్వీయప్రవాసం లోకి వెళ్ళిపోయారు. ఆయన ప్రవాసంలోకి వెళ్ళిపోయినా, పార్టీతో తన అనుబంధాన్ని కొనసాగించారు. 2011 మే నెలలో పార్టీ ఇంగిలక్‌ను తమ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టింది. 500 మంది సభ్యులు గల చట్టసభలో ఇంగిలక్‌ 265 మంది సభ్యుల మద్దతు పొందగలిగారు. ఇక్కడ రెండు విశేషాలున్నాయి. ఆమె థాయ్‌లాండ్‌కి మొదటి మహిళాప్రధాని కావడం ఓ విశేషమైతే, ఓ రాజకీయపార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించడం మరో విశేషం. ఇంగిలక్‌ ముత్తాత చైనా నుంచి 1860 ప్రాంతంలో సియామ్‌కు వచ్చి చియాంగ్‌ మై లో స్థిరపడ్డారు. ఆయన పెద్ద కుమారుడు చియాంగ్‌ సాకు థాయ్‌ యువతిని వివాహం చేసుకొని థాయ్‌ ఇంటిపేరు షినావత్ర అనే పేరును స్వీకరించారు. ఎప్పుడూ సరైన చర్య చేపట్టేవాడు అని ఈ పేరుకు అర్థం. ఈ కుటుంబం సిల్క్‌ వ్యాపారం నుంచి ఫైనాన్స్‌, నిర్మాణ రంగం, రియల్‌ఎస్టేట్‌లలోకి ప్రవేశించింది. ఈ కుటుంబ పరంపరకు చెందిదే ఇంగిలక్‌. ఆమె తండ్రి లెర్ట్‌ 1968లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎంపీ కూడా అయ్యారు. నాటి లిబరల్‌ పార్టీలో డిప్యూటీ నేత స్థాయికి ఎదిగారు. 1976లో ఆయన రాజకీయాల్లోంచి వైదొలిగారు. ఆయనకు తొమ్మిది మంది సంతానం.

అందరిలోకి చిన్న ఇంగిలక్‌. 1991లో ఆమె యూనివర్సిటీ చదువు ముగించుకుంది. 2008 డిసెంబర్‌లో నాటి రాజ్యాంగ న్యాయస్థానం పాలకపార్టీ పీపుల్‌ పవర్‌ పార్టీని రద్దు చేసింది. కార్యవర్గ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉంచిం ది. దీంతో ఆ పార్టీ వారంతా కలసి పె థాయ్‌ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా ఇంగిలక్‌ను వారు కోరారు. అందుకు ఆమె తిరస్కరిం చింది. ప్రధాని పదవి తనకు వద్దని, వ్యాపారం చూసుకుంటానని చెప్పింది. పార్టీలో ఆధిపత్యంలో కోసం రకరకాల పోరాటాలు సాగాయి. చివరకు 2011 మే 16న ప్రధాని అభ్యర్థిగా ఇంగ్‌లక్‌ పేరును ప్రకటించారు. ప్రవాసంలో ఉన్న ఆమె సోదరుడు ఇందులో కీలకపాత్ర వహించారు. 2008-10 మధ్య కాలంలో దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని చక్కదిద్దడం తన లక్ష్యమని ఇంగ్‌లక్‌ ప్రకటించారు. సైన్యం చేసిన అరాచకాలపై ఆమె విరుచుకుపడ్డారు. అప్పట్లో ఓ నిరసన ప్రదర్శనపై సైన్యం విరుచుకుపడగా, సుమారు వందమంది ప్రదర్శకులు మరణించారు. వేలమంది గాయపడ్డారు. తాను అధికారం లోకి వస్తే ట్రుత్‌ అండ్‌ రికన్సిలియేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తానని ఇంగ్‌లిక్‌ ప్రకటించారు. 2006లో కుట్రకు పాల్పడిన సైనికాధికారులతో పాటు సైన్యం చేతిలో తప్పుడు ఆరోపణలకు గురైన రాజకీయనేతలందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తానని చెప్పారు. తన సోదరుడిని దృష్టిలో ఉంచుకొని మాత్రమే తాను ఈ ప్రకటన చేయలేదని ఇంగ్‌లిక్‌ స్పష్టం చేశారు.

ఊహించని విజయం....

విపక్షానికి చెందిన ఇంగ్‌లక్‌ విజయం సాధించగలదని అధికారపక్షం ఊహించలేకపోయింది. ఆమె చూసేందుకు అందంగా ఉంటుందని అధికారపక్ష నేత ఒకరు వ్యాఖ్యానిం చారు. ఎన్నికల సర్వేలన్నీ కూడా ఇంగ్‌లక్‌ విజయం ఖాయమని స్పష్టం చేశాయి. ఎన్నికల్లో నెగ్గిన వెంటనే ఆమె చిన్నా చితక పార్టీలతో ఓ కూటమిని ఏర్పాటు చేశారు. తద్వారా తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇటీవల ఆమె భారత రిపబ్లిక్‌ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాజాగా ఆమె ఓ రాజకీయ వివాదంలో చిక్కుకు న్నారు. ఆమె మం త్రులుగా ఎంపిక చేసు కున్న ఇద్దరు వ్యక్తులపై గ్రీన్‌ ఇన్షియేటివ్‌ అనే సంస్థ ఆరోపణలు చేసిం ది. ఆమెరికా వాణిజ్య ఆం క్షలకు గురైన వ్యక్తిని, క్రిమినల్‌ ఆరోపణ లున్న మరో వ్యక్తిని మంత్రివర్గంలో చేర్చుకోవ డాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు.

ప్రొఫైల్‌
పేరు                  : ఇంగిలక్‌ షినావత్రYingluck_Shinawatra_manmohan
బాధ్యతల స్వీకారం    : 8 ఆగస్టు 2011
పుట్టిన తేది           : 21 జూన్‌ 1967
పార్టీ                   : పెవు థాయ్‌ పార్టీ
చదువు               : పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్‌ డిగ్రీ
భర్త                    :అనుసోర్న్‌ అమ్రోన్‌ చాట్‌
కుమారుడు            : సుపాసెక్‌
వృత్తి                   : వ్యాపారం
మతం                 : బుద్ధిజం
ముద్దుపేరు            : పు
విశేషం                 : థాయ్‌లాండ్గ మెుదటి మహిళా ప్రధానిసంక్షేమానికి పెద్దపీట

తాను అధికారంలోకి వస్తే 2020 కల్లా దారిద్య్రాన్ని నిర్మూలించడాన్ని ఆమె లక్ష్యంగా చేసుకున్నారు. కార్పొరేట్‌ పన్నును క్రమంగా 20 శాతానికి తగ్గిస్తానని చెప్పారు. కనీసవేతనాలను పెంచుతానని మాట ఇచ్చారు. రైతు సంక్షేమ చర్యలు తీసుకుంటానని వాగ్దానం చేశారు. కనీస మద్దతు ధరల విధానం ప్రకటిస్తానన్నారు. పాఠశాలకు వెళ్ళే ప్రతీ విద్యార్థికి కూడా ఉచితంగా ఇంటర్నెట్‌, లాప్‌టాప్‌ అందిస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Information about jayamalini
Wing commander asha jyothirmai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles