A biography of mamata banerjee

A biography of Trinamool Congress chief Mamata Banerjee. west bengal election 2011, west bengal election 2011 update, assembly election 2011 results, West Bengal

A biography of Trinamool Congress chief Mamata Banerjee. west bengal election 2011, west bengal election 2011 update, assembly election 2011 results, West Bengal

A biography of Mamata Banerjee.GIF

Posted: 01/27/2012 04:08 PM IST
A biography of mamata banerjee

A_biography_of_Mamata_Banerjee13

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఒంటి చేతితో అధికారంలోకి తెచ్చారు మమతా బెనర్జీ. తనదైన శైలిలో ప్రభుత్వాన్ని నడిపించే మమత ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఇటీవలే విడుదలైన ఆమె ఆటోబయోగ్రఫీ ‘మై అన్‌ఫర్గబుల్‌ మెమెురీస్‌’ దేశవ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. అందులో ఆమె వివరించిన కొన్ని సంఘటనలు మీ కోసం....

ప్రొఫైల్‌...Mamatha-Benarji

పూర్తిపేరు                  : మమతా బెనర్జీ
పుట్టిన తేది                : 1955 జనవరి 5 
                              (అధికారికంగా),          
                              1960 అకో్టబర్‌ 5 
                             (ఆమె పుస్తకం ప్రకారం)
జన్మస్థలం                 : కలకత్తా, పశ్చిమ బెంగాల్‌
వృత్తి                       : రాజకీయ నాయకురాలు
పార్టీ                        : భారత జాతీయ కాంగ్రెస్‌
                                (1970-1997)
                             తృణమూల్‌ కాంగ్రెస్‌  (1997)
ప్రస్తుత ెదా                : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి
ఆటో బయోగ్రఫీ             : మై అనఫర్గటెబల్‌ మెమోరీస్‌

బెంగాల్‌ శివంగి, ఫైర్‌ బ్రాండ్‌గా ప్రఖ్యాతి గాంచిన మమతా బెనర్జీ జీవిత చరిత్ర ఇటీవలే పుస్తక రూపంలో విడుదలైంది.తన జ్ఞాపకాలు నెమరువేసుకునేంత మధురంగా, వదిలి వేసేంతగా చేదుగా కూడా లేవని తెలిపింది. జీవితం నేర్పిన పాఠాలు ఎంతో అమూల్యమైనవని, అనుభవాలు నేర్పిన పాఠాలు మరింత ప్రత్యేకం అని వివరించారు.అదేలాగో ముందు ముందు మీరే చదివి తెలుసుకోవచ్చు.

పువ్వులు- బొమ్మలు...
మిగతా పిల్లల కన్నా విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న మమత చిన్ననాటి నుంచి చాలా మంది అవహేళనలను కూడా భరించింది. ఆమె తండ్రి మమతను మోనాబాబా అనే పేరుతో పిలిచేవారు. ఆయన మమతను చాలాసార్లు తల్లి క్లాసులు తీసుకుంటుండగా కాపాడారట. మమత బొమ్మలు చేసుకోవడానికి ఇతర ఆటలకోసం పిండిని, బంగాళ దుంపలను తీసుకొనేది. బిల్లులో భారీ తేడా ఉండటంతో ఈ విషయాన్ని చాలాసార్లు ఆమె తండ్రి గమనించాడట. నది దగ్గర ఉన్న బంగళా నుంచి మమత తన ఇతర మిత్రులతో కలిసి పూజకని పూవులు కోసేవారు. ఎవ్వరికీ తెలీయకూడదని వారు తెల్లవారుజామునే బయలుదేరేవారట. కొన్ని సంవత్సరాల తరువాత ఆమె అదే బంగళాకు పార్లమెంటు సభ్యురాలిగా తిరిగి వచ్చారు.

ఎగిరే పళ్లాలు...
నా జీవితంలో కొన్ని హస్యాస్పద సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. 1998లో యూఎన్‌ డెలిగేషన్‌లో భాగంగా నేను ఆమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లాను. అమెరికన్‌ బాత్‌రూమ్‌కు భారతీయ బాత్‌రూమ్‌కు చాలా తేడా ఉందనే విషయాన్ని నేను అప్పుడే తెలుసుకున్నాను. అక్కడి బాత్‌రూమ్‌లో మగ్‌లు కానీ, బకెట్‌లు కానీ ఉండవు దాంతో నేను కిచిన్‌లో ఉన్న సామగ్రితో స్నానం కానిచ్చాను. కొంత సమయం తరువాత వచ్చిన క్లీనర్‌ ఎగిరే పళ్లాలు బాత్‌రూమ్‌లోకి ఎలా వచ్చాయి అనుకుంటూ నా వైపు ఓరగా చూసింది. నేటికీ ఆ సంఘటన తలుచుకుంటే నాకు నవ్వు ఆగదు’ అని తన జీవితంలో జరిగిన ఒక ఫన్నీ సంఘటనను తెలిపారు. ‘మరోసారి నా కుబుంబసభ్యులతో కలసి న్యూయార్క్‌లో షాపింగ్‌కు వెళ్లాను. లిప్‌స్టిక్స్‌ అనుకొని చాప్‌స్టిక్స్‌ కొన్నాను’ ఇలా ఆమె జీవితంలో ఎన్నొ చిరుదరహాసాల సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Mamatha-with-others

వయసు తికమక - రాజకీయ లుకలుక..
ఆత్మకథలు నిజాలను వెళ్లడిస్తాయని అందరికీ తెలుసు. నిప్పులాంటి నిజాలుంటే ఆత్మకథలు చాలా మంది జీవితంలో సెగలు కూడా పుట్టిస్తాయి. వివాదాస్పదమైన ఆత్మకథా పుస్తకాలలో మమత పుస్తకం కూడా చేరింది. ఆమె తన పుస్తకంలోని వివరాల ప్రకారం.. ఆమె పదవ తరగతి చదివే సమయంలో ఆమె వయసు పదిహేను కన్నా తక్కువట. దీంతో ఆమె తండ్రి ఐదు సంవత్సరాలను కలిపి ఒక నకిలీ తేదీని తయారు చేశాడు. పుస్తకం ప్రకారం ఆమె పుట్టినతేది 1960 అక్టోబర్‌ 5, లోక్‌సభ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం ఆమె పుట్టిన తేది 1955 జనవరి 5. దీంతో 1984లో లోక్‌సభకు పోటి చేసిన మమత భారత రాజ్యాంగ నియమాలను బేఖాతరు చేసినట్టు అవుతుంది. అప్పట్లో అందించిన వివరాల ప్రకారం ఆమె వయసు ఐదు సంవత్సరాలు తక్కువ.

సోనియాతో...
‘1998 సమయంలో సాధారణ ఎన్నికలలో విపక్షాల ప్రచారం మంచి ఊపులో ఉంది. నాకు పార్టీ భవితవ్యం గురించి దిగులు పట్టుకుంది. వెంటనే 1997 డిసెంబర్‌ 12న సోనియా గాంధితో కలిసి పార్టీకి పెద్దదిక్కు (అధిష్టానం) అవ్వాల్సిందిగా కోరాను. వెంటనే సోనియా మాట్లాడుతూ ‘నన్ను ఎవరు ఒప్పుకోరు. ఇంకా నన్ను విదేశీ వ్యక్తిగా చూస్తున్నారు. ఎవ్వరూ సమ్మతించరు’ అని తెలిపారు.

రాజీవ్‌గాంధితో...
Rajiv-Ghandiమాజీ భారత ప్రధాని రాజీవ్‌గాంధి మమతను చాలా ప్రభావితం చేశారు. రాజీవ్‌గాంధి తనకు ఒక మార్గదర్శిగా సహాయపడ్డారని, రాజీవ్‌ గాంధిని తన పెద్దన్నగా భావించే వారని తెలిపారు. ‘పార్లమెంటులో నేను కాలు మోపగానే, నా విద్యార్హత గురించి అనేక ప్రశ్నలు విపక్షం వారు లేవనెత్తే వారు. వాటికి ఎదుర్కోవడంలో రాజీవ్‌జీ నాకు అండగా నిలిచారు, ఒకసారి పార్లమెంటులో విపక్షాలు నన్ను విమర్శిస్తున్నప్పుడు నేను నిస్సత్తువతో కుర్చికే పరిమితం అయ్యాను ఇంతలోనే ఒక వ్యక్తి వచ్చి ప్రధాని రాజీవ్‌గాంధి నాతో ఎదో మాట్లాడాలనుకుంటున్నారని తెలిపాడు. నేను సభలోంచి బయటికి వచ్చి రాజీవ్‌గాంధి ఉన్న హాలులోకి ప్రవేశించగానే ఆయన ఔదార్యాన్ని చూసి చలించిపోయాను. కొంత మంది స్వార్థపరులు నీ వ్యక్తిత్వాన్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కంగారు పడకు నేను నీకు సహాయపడతాను. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నాకు చెప్పు. ఇంకో విషయం నిన్ను ఆఖిల భారత యువజన కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా నియమిస్తున్నాను అని తెలిపారు. పెద్దన్న సహాయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను’ అని మమతా తెలిపారు. రాజీవ్‌ గాంధి హత్యతో మమత హతాశులయ్యారు. ‘మా నాన్న చనిపోయాక నేను అంతలా బాధ పడింది రాజీవ్‌గాంధి హత్య తరువాతే. దాదాపు ఏడు రోజుల పాటు నేను ఎవ్వరితో మాట్లాడలేదు. తిండి తినలేదు. ఒక చీకటి గదిలో నన్ను నేను బంధించుకుని ఏడ్చాను. నేటికీ ఏదైనా సమస్య ఎదురైతే నేను వెంటనే గోడపై ఉన్న రాజీవ్‌జీ ఫోటోను చూస్తాను. ఆయన నాతో ‘మమత ఎలా ఉన్నావు. అంతా బాగానే ఉంది కదా? సమస్యలేమీ లేవు కదా’ అని అడుగుతున్నట్లు ఉంటుంది’ అని వివరించారు.

నాకంటూ కలలు లేవు...
మమత చిన్న నాటినుంచే తనను తాను మిగతా వ్యక్తులు, ప్రపంచం కంటే వైవిధ్యంగా ఊహంచుకునేవారు. రాజకీయంలోనూ అదే పంథాను పాటిస్తారని చాలా మంది అపవాదు. ఈ విషయానికి సంబంధించిన చిన్న నాటి సంఘటన ఈ పుస్తకంలో ఉంది. ‘ఒక  రోజు స్కూలు ముగిసాక మా స్నేహితురాళ్లు ఇంటికి వెళ్లడానికి ముందు కొంత మంది అబ్బాయిలను కలవాలనుకున్నారు. ఆ అబ్బాయిలు తమ ఇంటి పక్కన ఉండే వాళ్లని నాకు తెలుసు. నా స్నేహితులు అబ్బాయిలతో కలవడానికి వెళ్తున్నారు అనగానే నాకు చాలా కంగారుగా అనిపించింది. నేను వెంటనే ఇంటికి పరిగెత్తాను. తరువాత ఆ సంఘటన గురించి నాకు తెలుసుకోవాలినిపించ లేదు. పెద్దతరగతికి వెళ్లినప్పుడు నా తోటి విద్యార్థులు బయటి ప్రపంచం గురించి మాట్లాడే వారు. వారి చర్చల్లో నేనెప్పుడూ అసక్తి చూపించలేదు. ఒక మూలన కూర్చుని ఇతర విషయాల గురించి ఆలోచించేదాన్ని. స్కూల్‌లో చివరి తరగతిలో చదువుతున్నప్పుడు వేరే విద్యార్థులు కాలేజీలో ఏ కోర్సు తీసుకోవాలో, ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలో ఆలోచించే వారు. వారు అలా మాట్లాడుతున్పప్పుడు వారిని నేను విచిత్రంగా చూసేదాన్ని. వాళ్లు వేరే గ్రహం నుంచి వచ్చారా అనిపించేది. నాకు కలలు కనడం అంటే ఆసక్తి ఉండేది కాదు’ అని వివరించింది.

మరపురాని జ్ఞాపకాలు...
మమతా బెనర్జీ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలను ఆమె ‘మై అన్‌ ఫర్గటబుల్‌ మెమొరీస్‌’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. పార్లమెంటు రాజకీయ వనంలో ఆమె ఒక పచ్చని, ఎలాంటి కలుపు లేని తోట అని తెలిపారు. రాజకీయంలో ద్వంద వైఖరి, ద్వంద వ్యక్తిత్వ చిత్రీకరణ ఆమెకు చాలా దిగులు పుట్టించాయి. బెంగాల్‌లో ఆమె రాసిన అనేక రచనలను కూడా ఇందులో చేర్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Wing commander asha jyothirmai
India first woman photojournalist homai vyarawalla  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles