India first woman photojournalist homai vyarawalla

The First Lady of Indian Press Photography' on Yahoo!. India’s first woman press photographer Homai Vyarawalla, who passed away January 15, 2012, captured the last days of the British Empire in India. Her work also traces the birth and growth of a new nation. The story of Homai’s life and her professional career spans an entire century of Indian history. Exclusive photos

The First Lady of Indian Press Photography' on Yahoo!. India’s first woman press photographer Homai Vyarawalla, who passed away January 15, 2012, captured the last days of the British Empire in India. Her work also traces the birth and growth of a new nation. The story of Homai’s life and her professional career spans an entire century of Indian history. Exclusive photos

India first woman photo journalist.GIF

Posted: 01/23/2012 01:49 PM IST
India first woman photojournalist homai vyarawalla

India_first_woman_photo_journalist2

1947 ఆగస్టు 15న రెడ్ ఫోర్ట్‌ లో తొలిసారి భారతీయ త్రివర్ణ పతాకం రెపరెపలాడినప్పుడు ఆమె అక్కడుంది. ఆమె స్వతంత్ర భారత చిత్రాన్ని ఒక దేశంగా చిత్రీకరించింది. . ఆమె తన ఫొటోగ్రఫీలో భారతదేశ అసలు రంగులను బ్లాక్‌ అండ్ వైట్‌లో అందించారు. అప్పుడే అభివృద్ధి చెందుతున్న భారత దేశాన్ని ఆమె తన కెమెరా కళ్లతో చూశారు. వారసత్వంగా వాటిని భారతదేశానికి అందించారు.హోమై వైరవల్లా మనదేశానికి చెందిన తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్‌ గా చరిత్ర సృష్టించారు.

ప్రొఫైల్‌ :Homai-Vyarawala_2

పూర్తి పేరు   : హోమై వైరవల్లా
పుట్టిన తేది  : 1913 డిసెంబర్‌ 13
జన్మస్థలం    : నవ్‌సారి, గుజరాత్‌
భర్త           : మాణిక్‌ షా వైరావల్లా
సంతానం     : ఫారుఖ్‌
వృత్తి          : ఫోటో జర్నలిస్ట్‌ తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్‌ :

హోమై ఫోటో జర్నలిస్ట్‌ గా తన కెరీర్‌ను 1930లో ప్రారంభించారు. తరువాత జాతీయ వ్యాప్తంగా మంచి ఫోటో జర్నలిస్ట్‌గా గుర్తింపు పొందారు. 1942లో ఆమె తన కుటుంబంతో సహా ముంబైకు మకాం మార్చారు.తరువాత ఢిల్లీకి మారారు. ముప్సై సంవత్సరాల పాటు ఢిల్లీలోనే ఉంటూ ఆమె అనేక మంది ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకుల చిత్రాలను క్లిక్‌మని పించారు. మహాత్మా గాంధీ, జవహార్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, నెహ్రూ-గాంధీ కుటుంబం చిత్రాలను తీశారు.

ఆణిముత్యాలు....ఆమె చిత్రాలు :
హోమై క్లిక్‌ మనిపించిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలను 2010లో కొత్త ఢిల్లీలోని ‘నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌’లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు అల్కాజీ ఫౌండేషన్‌ సహకరించింది. హోమై తన కెరీర్‌లో ఆణిముత్యాల్లాంటి ఎన్నో ఫోటోలను తీసింది. జవహార్‌లాల్‌ నెహ్రూ ఫోటోలను తీయడం అంటే ఆమె చాలా ఇష్టమని ఒక సందర్భంలో తెలిపారు. అందుకే ఇతర ఏ ఫోటోగ్రాఫర్‌ తీయలేని నెహ్రూ చిత్రాలను ఆమె తీసింది. నెహ్రూ సిగరెట్‌ తాగుతూ, ఆకాశంలో శాంతి కపోతాన్ని ఎగురవేస్తూ, ఫోటోగ్రఫీ అను మతి లేదు అనే బోర్డు పక్కన నెహ్రూ ఉన్న సమయంలో ఇలా ఎన్నో చిత్రాలను తీసింది హోమై.

Vyarawala-Ghandi-photoమహాత్ముడి చిత్రాలు :
మహత్మా గాంధీ చిత్రాలను భావితరాలకు అందించడంలో హోమై కీలమైన పాత్ర పోషించారు. మహాత్ముడు రైలు దిగుతుండగా, జనంలో నడుస్తుండగా వంటి అనేక ఫోటోలను తీశారు హోమై. అంతేకాకుండా నాటి ఆమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడి భార్య జాకీ కెన్నడి భారతదేశా నికి విచ్చేసినప్పుడు నెహ్రూ స్వయంగా ఆమెకు తిలకం పెట్టి స్వాగతం పలికే చిత్రం, జాకీ కెన్నడి ఇందిరా గాంధీలో సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భం, దలైలామా వంటి ప్రముఖులు చిత్రాలను బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీశారు. ఇంకా అనేక చారిత్రాత్మక ఘట్టాలను చిత్రరూపంలో సజీవంగా ఉంచారు.

కళలపై ఆసక్తి :
హోహై 1913 డిసెంబర్‌ 9న గుజరాత్‌లోని నవసారిలో జన్మించారు. ఆమె ముంబాయి విశ్వవిద్యాలయం నుంచి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. సర్‌.జె.జె. అర్ట్స్  స్కూల్‌ నుంచి ఆర్ట్స్ లో ప్రావీణ్యం గడించారు. హోమైకు చిన్న నాటి నుంచే కళలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ప్రతి విష యాన్ని ఆమె కళాత్మకమైన దృష్టితో చూసేవారు. ప్రతి దృశ్యానికి ఒక ప్రత్యేకత ఉంటుందని దాన్ని చూసే కళ్ళపై దాని విలువ ఆదారపడి ఉంటుందని ఆమె నమ్మే వారు.ఆమె గాంధీయిజ మ్‌పై అపా రమైన నమ్మ కాన్ని ఉంచే వారు. అప్పట్లో మహాత్మా గాంధీ చెప్పే ప్రతి మాట ఆమెను ప్రభావితం చేసింది. ఆమె తన జీవితాన్ని సాధారణంగా, ఆడంబరాలకు దూరంగా గడిపారంటే ఆమెపై ఆ మహాత్ముడి ప్రభావం ఎలా ఉందో గమనించవచ్చు.

బ్లాక్‌ అండ్ వైట్‌ :Nehuru
గత కాలాన్ని చాలా మంది బ్లాక్‌ అండ్‌ వైట్‌గానే ఊహించుకుంటారు. ఆ బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే కోటి రంగుల జ్ఞాపకాలను ఆవిష్ర్కతం చేశారు హోమై. ఆమె తన చిత్రాలను ఎప్పుడూ బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే తీసేవారు. ‘ రెండురంగులతో ఎన్నో భావాలను పలికించడం నాకిష్టం. నాకు ఫోటోగ్రఫీ అంటే బ్లాక్‌ అండ్‌ వైట్‌ మాత్రమే’ అని ఒక సందర్భంలో ఆమె తెలిపారు. ఆమె సేవను గుర్తించి భారత ప్రభుత్వం భారత పౌరులకు అందించే రెండవ అత్యున్నత పురస్కారం ‘పద్మవిభూషణ్‌’తో సత్కరించింది. ఆమె ఇటీవలే ఊపితిత్తుల సంబంధిత వ్యాధితో ఇటీవలే కన్నుమూశారు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో :
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె ‘ది ఇల్లస్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా’అనే మ్యాగజైన్‌కు పని చేయడం ప్రారంభించారు.1970 వరకూ ఆమె అందులోనే పని చేశారు. ఆ మధ్య కాలంలో ఆమె అనేక బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలను తీసి ముద్రణకు ఇచ్చారు. అవి మంచి గుర్తింపును సాధించాయి.1973లో ఆమె తన భర్తను కోల్పోయింది. దాంతో ఆమె వడోదరకు మకాం మార్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A biography of mamata banerjee
Profile and biography of usha uthup  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles