Political mla kannababu comment on chanra babu naidu

mla kannababu, congress party, tdp, chandra babu naidu, chandrababu padayatra, cm kiran kumar reddy, yalamanchi municipality,

mla kannababu comment on chandra babu naidu

ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబు

Posted: 05/17/2013 08:03 PM IST
Political mla kannababu comment on chanra babu naidu

ఎమ్మెల్యే కన్నబాబు చంద్రబాబును విమర్శించారు. అమలుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇటీవల పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రిని తానేనని పగటికలలు కంటున్నాడని దెప్పిపొడిచారు. అనంతరం డ్వాక్రా సంఘం సభ్యుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.

జనశ్రీ బీమా యోజన పథకం కింద 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ అభ్యసించే 216మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1200 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఆమ్‌ఆద్మీ పథకం కింద ఆరుగురికి రూ.30వేలు చొప్పున చెక్కులు అందజేశారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో 838 స్వయం సేవా సంఘాలు నడుస్తున్నాయని తెలిపారు. వీరిలో కొంతమంది తీసుకున్న రుణాలకు వడ్డీలు కూడా చెల్లించకపోవడం వల్ల జనశ్రీ యోజన పథకానికి అర్హులు కాలేకపోయారన్నారు. యలమంచిలి మున్సిపాలిటీని అన్ని రకాల అభివృద్ధి చేసి ప్రగతిపథంలో నడిపిస్తామన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more