భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య శతజయంతి ఉత్సవాల ముగింపు, 28వ వర్థంతి సందర్భంగా ఈనెల 19వ తేదీన లెనిన్ సెంటరులో బహిరంగ సభ జరుగుతుందని సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్.బాబూరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపి తమ్మినేని వీరభద్రం ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
బహిరంగ సభ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుండి ప్రదర్శనలు, విచిత్ర వేషాలతో కూడిన కళానృత్యాలు ప్రారంభమై లెనిన్ సెంటర్కు చేరుకుంటాయని పేర్కొన్నారు. అనంతరం సభ జరుగుతుందని తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లు, ముఖ్య సెంటర్లలోనూ వర్థంతి సభలు, పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సుందరయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా గత ఏడాది మే 1 నుండి ఈ ఏడాది మే ఒకటో తేదీ వరకూ నగరంలో అనేకచోట్ల పలు కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు.
వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటుచేసి ప్రజలకు మంచినీరు అందించినట్లు తెలిపారు. అంతేగాక సుందరయ్య పోరాట స్ఫూర్తితో తమ పార్టీ పేదలకోసం అలుపెరగని పోరాటాలు చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 19న లెనిన్ సెంటరులో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని బాబూరావు కోరారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more