Posted: 04/03/2010 06:08 PM IST
విజయవాడ, మేజర్‌న్యూస్ : సమాజంలో వున్న కుల వివక్షతను రూపుమాపేందుకు ప్రభుత్వం దళిత గోవిందాన్ని ప్రొత్సహిస్తుంటే, ఇంద్రకీలాద్రిపై వేంచ ేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో కుల వివక్షతను ప్రొత్సహించే విధంగా అధికారులు వ్యవహరించడం సిగ్గు చేటని కుల వివక్ష వ్యతిరేక ప్రచార చైతన్య సంఘం జిల్లా కన్వీనర్ పరిశపోగు లాజరస్(రాజేష్) అన్నారు.
కులవివక్షతను కొనసాగించే 1060 జీఓను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుతూ గురువారం ఉదయం శ్రీ కన కదుర్గ అమ్మవారి ఘాట్‌రోడ్డు కుల వివక్ష వ్యతిరేక ప్రచార చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడుతూ అమ్మవారి దేవస్థానంలో లడ్డుల తయారీ బ్రాహ్మణులు మాత్ర మే తయారు చేయాలని 1060జీఓను అమలు చేయడం సిగ్గుచేటన్నారు. బిసి ఐక్యవేదిక నాయ కులు బుద్దా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు వ్యతిరేకంగా ఈ జీఓను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేరుపోగు వెంక టేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ కులవివక్షతను, అంటరానితనాన్ని నిర్మూలించడానికి పాలకులు చట్టాలను సక్రమంగా అమలు చేయకుండా బ్రాహ్మ ణులకు పెద్ద పీటను వేసి బ్రాహ్మణేతర కులాలను పనిలోంచి తొలగించి రాజ్యాంగ విరుద్ధమైన జీఓను అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ జీఓను తక్షణం రద్దు చేయకపోతే ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద యెత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దాసరి జైరాజ్, సువ్వారి రాంబాబు, ద్రవిడ సత్తా నాయకులు పాకలపాటి రత్నరాజు, ఎంఆర్‌పిఎస్ నగర నాయకులు మానికొండ శ్రీధర్ మాదిగ, కామెళ్ళ దేవమణి, భూతపాటి ఫిల్‌మెన్ కుమార్, బిఎస్‌పి నాయకులు బండ్లమూడి సూర్యప్రకాశరావు, కెవి కోటేశ్వరరావు తదితర దళిత, బిసి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వామపక్షాల మనుగడ కోసమే... వామపక్షాల మనుగడ కోసమే దుర్గగుడిలో రెండు రోజుల నుంచి నానాయాగి చేస్తున్నారని పిసిసి ప్రధా నకార్యదర్శి కొలను కొండ శివాజీ ఆరోపించారు. గురువారం జిల్లా మంత్రి పార్థసారధి,జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను కలిసి పరిస్థి తిని వివరించినట్లు ఆయన తెలిపారు. దళితుల వద్దకే భగవంతుడు, భజగోవిందం వంటి కార్య క్రమాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం దుర్గగుడిపై అన్యులు ప్రసాదం తయారీలో పాల్గొన కూడదంటూ జారీ చేసిన జీఓను రద్దు చేయాలని మంత్రులకు వివరించినట్లు ఆయన తెలిపారు.దీనిపై స్పందిం చిన మంత్రులు సంబంధిత మంత్రితో, అధికా రులతో చర్చించి జీఓ రద్దుకు కృషిచేస్తామని చెప్పారని కొలనుకొండ శివాజీ తెలిపారు.
లడ్డు తయారీలో కుల వివక్షత తగదు : ఒపిడిఆర్ గత 12 సంవత్సరాలుగా శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలోత లడ్డు, ప్రసాదాల తయారీలో పని చేస్తున్న బ్రాహ్మణేతర వారిని తొలగించి, బ్రాహ్మ ణులను మాత్రమే తీసుకుంటామంటూ కులవివక్షత చూపించడాన్ని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపిడిఆర్) నాయకులు కె.ఎస్ తీవ్రంగా ఖం డించారు. బిసి కార్మికులను లడ్డు తయారీ నుంచి తొలగించడమంటే రాజ్యాంగం పొందుపరిచిన ఆదేశిక సూత్రాలను ఉల్లంఘించడమేనన్నారు. తక్షణమే ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని,జీఓ రద్దు చేసే వరకు కార్మికులకు మద్ద తుగా ఉద్యమం చేపడతామని ఆయన పేర్కొన్నారు.