సాధారణంగా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు.. తమతమ ఆచారాలను, శాస్త్రాల ప్రకారం మంత్రాలను జపించి నిద్రపోతారు. ఇలా ప్రతిఒక్కరు తమ దైవానికి సంబంధించి తమతమ ఆచారవ్యవహారాలను పాటిస్తారు.
కొంతమంది ఉదయాన్నే లేవగానే తమ అరచేతులు చూసుకుంటారు. అలాగే అద్దంలో చూసుకొని తెగ మురిసిపోతుంటారు. అయితే శాస్త్రాల ప్రకారం ఇలా చేయడంకంటే.. పచ్చని చెట్లతో కూడా ప్రకృతిని ఆస్వాదించడం లేదా ఫోటోలను చూడడం చాలా మంచిది అంటున్నారు. శాస్త్రీయపరంగా గమనించినా.. ఇలా చేయడం ద్వారా మనం ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా వుంటామని కూడా రుజువైంది.
అలాగే తమతమ దైవాలకు సంబంధించిన ఫోటోలను, కార్యకలాపాలను నిర్వహించుకోవడం చాలా మంచిది. ఉదాహరణకు హిందువులు ఉదయాన్నే లేచి, పరిశుభ్రంగా తయారయి దైవపూజలతో ఇంటిని అలంకరిస్తారు. ఇంటిముందు ముగ్గులు వేయడం, సూర్యుడిని పూజించడం తదితర కార్యకలాపాలు చేసుకుంటారు. ఇలా చేయడం పుణ్యం లభిస్తుందని చాలామంది విశ్వసిస్తారు.
అలాగే ముస్లిములు కూడా ఉదయాన్నే లేవగానే, పరిశుభ్రంగా తయారు అయి నమాజులకు వెళతారు. ఇలా ప్రతిరోజు నమాజులో పాల్గొనడం వల్ల ఆరోగ్యంగా వుంటారని శాస్త్రజ్ఞులు వెల్లడిచేశారు.
ఇదేవిధంగా ప్రతిఒక్కరు తమతమ ఆరాధ్యదైవాలను ప్రతిరోజు ఉదయం లేవగానే పూజలు నిర్వహించుకుంటారు. ఇది ఎంతో శ్రేయస్కరమైంది, ఉత్తమమైంది, ఆరోగ్యకరమైంది.
అలాగే ఇంకొన్ని వాస్తుకు సంబంధించిన చిట్కాలు...
పిల్లలు చదువుకునే గదికి ద్వారం ఈశాన్యంలో వుంటే చాలా మంచిది.
ఇల్లు నిర్మాణానికి ముందు ఏదైనా బావిగానీ, బోర్ గానీ తవ్వి... ఆ నీటినే నిర్మాణం కోసం ఉపయోగించడం ఎంతో శ్రేయస్కరం.
అలాగే ఇంటి నిర్మాణానికి ముందు కొన్ని వాస్తులను సరిచూసుకోవడం చాలా మంచింది.
కారును పార్క్ చేసేటప్పుడు మీ ఇంటివద్ద తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం వుండేటట్లు పార్కింగ్ చూసుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Jun 11 | గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.... Read more
May 13 | సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను... Read more
May 01 | ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు... Read more
Apr 28 | సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి.... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన... Read more