మానవుడు తన దైనందిన జీవితంలో చేస్తున్న కార్యకలాపాల వల్ల నీరసాన్ని పొందుతాడు. దీంతోపాటు తన ఆరోగ్యానికి సంబంధించి అనేక రోగాలకు బారినపడతాడు. అటువంటి సమయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోకపోతే.. మానసిక క్షోభను కోల్పోవాల్సి వస్తుంది.
కానీ ఇటువంటి వాటి నుండి రక్షణ పొందడానికి మన హిందూ ధర్మాలలో కొన్ని సూత్రాలను పాటిస్తే సరిపోతుంది. అదే విధంగా నవరత్నాల్లో ఒకటైన నీలరత్నాన్ని ధరిస్తే మానసికక్షోభ చాలావరకు తగ్గిపోతుంది. అంతేకాకుండా దారిద్రబాధ, చోరబాధ, అస్థిరత్వము వంటివికూడా ఈ నీలరత్నం ధరించడం వల్ల దూరమవుతాయి.
ఇలాగే మన హిందూ సంప్రదాయాల ప్రకారం అనేక రత్నాలు, ముత్యాలు, పగడాలు వంటివి మనలో వున్న అనేక రోగాలను దూరం చేస్తాయి. అందులో భాగంగా... కెంపును ధరించడం ద్వారా అతిసారము, జ్వరము, అగ్నిరోగము, మనోవ్యసనములు దూరమవుతాయి.
అలాగే స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, పాండు, కామెర్లు, నీరసము తగ్గిపోవాలంటే ముత్యము ధరిస్తే చాలామంచిది. వ్రణములు, శస్త్రబాధ, మశూచి, శ్లేషకఫములు తగ్గిపోవాలంటే పగడాన్ని ధరించడం ఉత్తమం. ఉదర బాధ, కుష్టు, అగ్నిమాంద్యము, నొప్పులు, మర్మావయవబాధలు తొలగిపోవాలంటే జాతిపచ్చను ధరించడం శ్రేయస్కరం.
దీర్ఘ శుక్లనష్టవ్యాధులు, కాళ్ళు మంటలు తగ్గిపోవాలంటే కనకపుష్యరాగాన్ని, మేహరోగము, మూత్ర రోగము, కామవికారములు వంటివి తగ్గిపోవాలంటే వజ్రము ధరించడం శ్రేయస్కరము.
ఇంకా దురద, శతృపీడ, నీచసాంగత్యము, రహస్య వ్యాధులు దూరం కావాలంటే వైఢూర్యమును, క్రిమిరోగము, పిచ్చిపిశాచముల బాధల నుంచి విముక్తి కలగాలంటే గోమేధికాన్ని ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 11 | గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.... Read more
May 13 | సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను... Read more
May 01 | ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు... Read more
Apr 28 | సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి.... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన... Read more