Easy Way to Weight Loss Tip in Natural Method

Easy way to weight loss

Weight Loss Tip, Weight Loss Tip, Natural Method Weight Loss, Weight Loss Taking Foof, Taking Favorite Food Weight Loss, Weight Loss Way

Health Tip of the Day. Easy Way to Weight Loss Tip in Natural Method

చాలా ఈజీగా బరువు తగ్గేయండి

Posted: 07/15/2017 02:22 PM IST
Easy way to weight loss

బరువు తగ్గాలంటే అందుకు ఇదీ అంటూ ప్రత్యేకంగా ఓ నియమం ఏమీ లేదు. బరువు తగ్గేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎవరికి అనువైనది వారు ఫాలో అయిపోతే చాలు. బరువు తగ్గాలనుకుంటూ ఏమీ చేయలేకపోతున్న వారు పోషకాహార నిపుణులు చెబుతున్న ఈ చిట్కాల గురించి తెలుసుకోండి.

కార్బో హైడ్రేట్లను తగ్గించటం

కార్బోహైడ్రేట్లు, ఫాట్స్ బరువు పెరడానికి దోహదం చేస్తాయి. అందుకని వీటి మోతాదును తగ్గించి ప్రొటీన్ తో కూడిన ఆహారాన్ని పెంచాలి. పాలల్లో ప్రొటీన్ పొడి వేసుకుని తాగినా సరే. ప్రొటీన్ షేక్స్ అయినా ఓకే. వీటివల్ల కడుపు నిండినట్టు ఉంటుంది.

కేలరీలను కరిగించాలి

రోజువారీ శారీరక వ్యాయామాన్ని మించింది లేదు. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది కదలకుండా కూర్చుని పనిచేయడం ఎక్కువైపోయింది. ఇలా అయితే ఆరోగ్యానికి మహా ముప్పే. శారీరక వ్యాయామం చేయమన్నారుగా అని వ్యాయామశాల కోసం వెతకాల్సిన పనేమీ లేదు. రోజూ నిర్ణీత సమయం పాటు వేగంగా నడిచినా సరిపోతుంది.

మెటబాలిజం రేటు

మెటబాలిజం వేగం పుంజుకుంటే మరిన్ని కేలరీలు ఖర్చయిపోతాయి. రోజువారీ వ్యాయామంతోపాటు మెటబాలిజం రేటును పెంచే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, గార్సినియా, అకాయ్ బెర్రీ ల్లాంటివి.

మధ్య మధ్యలో బరువును చూసుకుంటూ ఉండాలి. చిట్కాలు పాటించక ముందు, పాటించిన తర్వాత వచ్చిన మార్పులను గమనించాలి. ఫలితాలను బట్టి ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాలా? అనే విషయం స్పష్టమవుతుంది.

 

బరువు తగ్గాలంటే చాలు... అందరూ మొదటిగా చెప్పే మాట 'డైట్‌ కంట్రోల్‌ చేయండి' అని. డైట్‌ కంట్రోల్‌ చేస్తే నిజంగానే బరువు తగ్గుతారా? పుల్కాలు, పండ్లవంటి తేలిక ఆహారం తింటే బరువు తగ్గిపోతామా? తగ్గనే తగ్గరు అంటున్నారు పరిశోధకులు. అందుకు కారణమేంటో కూడా వాళ్లే చెబుతున్నారు. అదేంటో చూడండి. జీర్ణవ్యవస్థలో కీలకంగా పనిచేసే బ్యాక్టీరియా ఒక్కో మనిషిలో ఒక్కోరకంగా ఉంటుంది.

అందుకే బరువు తగ్గాలన్నా? ఇంకేదైనా సమస్య వచ్చినా... అందరూ ఒకే విధమైన ఆహారం తీసుకునే అలవాటు చేసుకుంటే సరిపోదు. ఎవరి శరీరం పనితీరుకు తగినట్టు... వాళ్లు తమ డైట్‌ని ప్లాన్‌ చేసుకోవాలి. అందుకు వైద్యుల అవసరం తప్పనిసరి. కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకుని గుడ్డిగా ఫాలో అవ్వకుండా మీ శరీరానికి సరిపోయే సిస్టమ్‌ను డెవలప్‌ చేసుకోండి. ఆనందంగా బరువు తగ్గండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Health Tip  Weight Loss  Top Of The Day  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more

Today on Telugu Wishesh