మన గుండె ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన నియమాలు:
1. మీ గుండె ఆరోగ్యవంతంగా వుండాలంటే రోజులో 500 - 950 క్యాలోరీలు శరీరం నుండి ఖర్చు చేయబడాలి. గుండె సంబంధిత వ్యాయామాలు చేయటం వలన శ్వాస యొక్క రేటు పెరుగుతుంది. అలాగే శరీర రక్త పీడనం కూడా సాధారణ స్థితిలో ఉంటుంది. వ్యాయామాలు చేయడం వల్ల చెమట అధికంగా బయటకు వెళ్లిపోవడం అనేది మీ గుండెకు మంచి విషయంగా చెప్పవచ్చు.
2. తక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న ఆహరం తీసుకోవాలి. తీసుకునే ఆహరంలో చక్కెరలు మరియు ట్రాన్స్ ఫాట్'లు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గించబడతాయి మరియు గుండె కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలాగే వివిధ రకాల పండ్లు, మరియు కూరగాయలు తినటం వలన శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
3. దాదాపు 9 గంటల నిద్ర తప్పనిసరి. ఎవరైతే దాదాపు 8-9 గంటల సమయం పాటు నిద్రపోతారో వారి గుండె ఆరోగ్యంగా వుంటుందని వైద్యులు చెబుతున్నారు.
4. గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ముఖ్య కారణం ఒత్తిడి. ఏదైనా సమస్యల ఒత్తిడి వుండటం వల్ల టెన్షన్ మరింత పెరిగి మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. దీంతో రక్త పీడనం అధికం అవుతుంది. కావున ఎక్కువ శాతం సమస్యలకు దూరంగా వుండేలా చూసుకోవాలి. టెన్షన్ పెట్టే విషయాలను ఎక్కువ సమయం పాటు డిస్కస్ చేయకూడదు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి.
5. ఇక గుండె సంబంధిత వ్యాధులు రావడానికి మరో కారణం బరువు. వయసుకు తగిన విధంగా బరువు లేకపోవడంతో శరీరంలో కొవ్వు స్థాయిలు, రక్త పీడనం మరియు ఇన్సులిన్ స్థాయిలు పెరిగిపోయి గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ప్రేరేపిస్తుంటాయి. అలాగే శరీరంలో కొవ్వు స్థాయిలు అధికం అవటం వలన రక్త పీడనం పెరుగుతుంది, మధుమేహం, గుండెపోటు కూడా రావచ్చు. కాబట్టి వయసుకు తగ్గట్లుగా శరరీ బరువును మెయింటేన్ చేయడం మంచిది. వ్యాయామాలు చేయడం ఉత్తమం.
6. మోతాదుకు మించి మద్యం సేవించడం. అందువల్ల రక్తపీడనం మరియు గుండె ప్రెజర్ పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఎంత వీలైతే అంతగా మద్యానికి దూరంగా వుండటమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
7. గుండె సరిగ్గా పనిచేయడానికి విటమిన్ లు చాలా ముఖ్యం. విటమిన్ 'B6' మరియు 'B12' వంటివి గుండెకు చాలా ముఖ్యం కారణం ఇవి ధమనులలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. కాబట్టి మీరు రోజు తీసుకునే ఆహారంలో విటమిన్ లు వుండేలా చూసుకోండి.
8. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎలాగో అందరికి తెలిసిందే. హానికరం అని తెలిసి కూడా త్రాగడం తప్పే కదా! ధూమపానం వలన ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం వుంది. అందువల్ల అనారోగ్యం దెబ్బతినడం కూడా జరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి ధూమపానంకు దూరంగా వుండటం మంచిది.
9. ఇక చివరగా... వయసు పెరుగుతున్న కొద్ది ఒంట్లో శక్తి కాస్త తగ్గుతూ వుంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా బిపి, షుగర్ చెకప్ లను చేయించుకోండి. అందువల్ల మన ఆరోగ్య పరిస్థితి ఎలా వుందో ఎప్పటికప్పుడు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొనే అవకాశం వుంటుంది.
- Sandy
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more