నేటి ఆధునిక కాలంలో గుండెపోటు బారిన పడుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అంతేకాదు.. ఈ సమస్యతో మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే నమోదవుతోంది. అందుకే.. గుండెపోటు బారిన పడకుండా నిత్యం జాగ్రత్తగా వుండాలంటూ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇందుకు కొన్ని ఆహార చిట్కాలు పాటిస్తే సరిపోతుందని, దాంతో ఆ సమస్య నుంచి దూరంగా వుండటమే కాకుండా నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చునని చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన జీవన విధానం, చక్కని ఆహార అలవాట్లు, నిత్యం శారీరకవ్యాయామం చేయడం, ప్రశాంతంగా ఉండటం వంటి అలవాట్లను రెగ్యులర్ గా పాటిస్తే.. గుండెజబ్బులు రాకుండా నిరోధించవచ్చని చెపుతున్నారు. అలాగే, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌తో పాటు, టోటల్ బ్లడ్ పిక్చర్ కూడా తగిన మోతాదుల్లో ఉండేలా జాగ్రత్తపడాలి. ఎక్కువగా కూర్చొని పనిచేసేవారు.. గంటకోసారి కుర్చీలోంచి లేచి తిరగాలి. భోజనం తర్వాత కాసేపు బయట తిరగాలి. ఆహారంలో వేపుళ్లు, నూనెలు తగ్గించుకోవాలి. రోజులో ఎక్కువ సార్లు పండ్లు, కూరగాయలు, పీచు పదార్థంతో కూడిన ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. బయటి భోజనాలు, హోటల్, చిరుతిళ్లు తగ్గిస్తేనే ఎంతో మంచిది. అధికంగా ఇంటి భోజనాకికే ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో వీలైనంతగా ఉప్పు శాతాన్ని తగ్గించుకోవాలి. అలాగే కారపు వస్తువులు, పచ్చళ్లు ఎక్కువ తినకూడదు. నెయ్యి, వెన్న, పామాయిల్ వాడకం తగ్గించాలి. గుడ్డులో పచ్చసొన తీనకూడదు. చిరుతిళ్లను పూర్తిగా దూరం చేయాలి. రోజూ వ్యాయామం చెయ్యాలి. ఇందుకు రన్నింగ్, ఈత వంటివి మంచి ప్రయోజనాలు కలిగిస్తాయి.
మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి సాధన చేయాలి. చక్కెర వ్యాధి బారినపడకుండా జాగ్రత్త పడాలి. సాధ్యమైనంత వరకూ మద్యం, ధూమపానాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య అలవాట్లతోపాటు, చెడు అలవాట్లకు దూరంగా ఉండేవారిలో ఎక్కువ మందికి గుండెజబ్బులే దరిచేరడం లేదని తేలింది. రోజుకు కనీసం ఆరు నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఇవన్నీ విధిగా పాటించడంతోపాటు, ప్రశాంతమైన జీవనం గడపడం ద్వారా కూడా గుండె జబ్బుల్ని నివారించుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more