గుడ్డులో ఎన్నో ఔషధగుణాలు దాగి వుంటాయి. ఇందులో శక్తి, ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలు పుష్కలంగా వుంటాయి. ఇవి.. శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేసేలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అందుకే.. కోడిగుడ్డును రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. అయితే.. ఇన్ని పోషకాలు కలిగిన ఈ గుడ్డు కంటే వేరుశెనక మరెంతో శ్రేయస్కరమని చెపుతున్నారు. ఎందుకంటే.. గుడ్డులోకంటే వేరుశెనగలో రెండున్నర రెట్లు ఎక్కువగాగానే మాంసకృత్తులు ఉంటాయట. ఒక కిలో మాంసంలో లభించే మాంసకృత్తులు.. అదే మోతాదు మాంసకృత్తులు వేరుశెనగలో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.
అంతేకాదు.. వేరుశెనగలో ప్రొటీన్, ఫాస్పరస్, థైమీన్, నియాసిన్‌తో పాటు శక్తినిచ్చే మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి.. అలాగే.. ‘ఏ, బి, బి, సి, ఇ’లతో కలిపి మొత్తం 13 రకాల విటమిన్లు... ఇంకా ఐరన్, కాల్షియం, జింక్, బోరాన్ వంటి 26 రకాల కీలక ఖనిజాలూ లభిస్తాయి. వేరుశెనగల్లోని ప్రోటీన్‌శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజా గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. హెపటైటిస్, ట్యుబర్క్యులోసిస్ వంటివి రాకుండా ఉంటాయని చెపుతున్నారు. అలాగే, నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు కొంచెం పల్లీలు నానబెట్టి బెల్లంతో కలిపితింటే ఐరన్‌తోపాటు అన్ని రకాల పోషకాలూ అందుతాయట. తాజా పచ్చి పల్లీలకు చిటికెడు ఉప్పురాసి తింటే చిగుళ్లు గట్టిపడి దంతాల్ని సంరక్షిస్తాయి.
అయితే.. కొంతమందికి వేరుశెనగ పల్లీలు ఆరగించడం వల్ల అలెర్జీ రావొచ్చు. అలాంటి వీటికి దూరంగా ఉండటం ఎంతో మంచిది. వేరుశెనగ విత్తనాల్లో గుండెకు మేలు చేసే వోనో అన్‌శాచ్యురేటెడ్ కొవ్వుల శాతమే ఎక్కువ. కాబట్టి.. వేరుశెనగల్ని రెగ్యులర్ గా తీసుకుంటే నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more