Lemon Remedy For Yellowish Teeth Health Tips Homemade Remedies

Lemon remedy for yellowish teeth health tips homemade remedies

yellowish teeth problems, lemon remedies, lemon recipes, lemon benefits, lemon health benefits, lemon remedy for teeth, yellowish teeth remedies, yellow teeth home tips

Lemon Remedy For Yellowish Teeth Health Tips Homemade Remedies : Experts Giving Advice To Use Lemon Remedy To Get From Yellowish Teeth Problem.

నిమ్మతో పసుపుపచ్చ పళ్లు మటుమాయం

Posted: 09/07/2015 01:27 PM IST
Lemon remedy for yellowish teeth health tips homemade remedies

ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరు పోషకాహారాలు మానేసి.. పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ కు అలవాటు పడ్డారు. దీంతో రకరకాల ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చిపడుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పసుపుపచ్చ పళ్ల గురించి! ఆ ఫాస్ట్ ఫుడ్స్ తిన్నప్పుడు అందుకే వుండే హానికారకాలు పళ్లపై నేరుగా ప్రభావం చూపడంతో.. కాలక్రమంలో తెల్లగా వుండే పళ్లు పసుపుపచ్చ రంగులోకి మారుతాయి. ఇదొక్కటే కారణం కాదు.. ఇంకా చాలానే వున్నాయి. ఏదేమైనా.. నేటి జనరేషన్ లో ఈ సమస్య బారిన చాలామంది పడుతున్నారు.

తమకు పసుపుపచ్చ పచ్చ పళ్లు వుండటం కారణంగా వారు స్వేచ్ఛగా నోరు తెరవాలంటే బిడియపడుతుంటారు. నలుగురిలో నవ్వేందుకు ఇబ్బందిపడుతుంటారు. లోలోపలే మానసిక ఆవేదనకు గురవుతుంటారు. తమ పళ్ళను తెల్లగా మార్చుకోవడం ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ.. అంతగా ఫలితం దక్కపోవడం వారిని మరింత బాధిస్తుంది. ఇటువంటి వారికి నిపుణులు ఓ సింపుల్ చిట్కా అందిస్తున్నారు. ఏవేవో రసాయనాలు వాడి మరిన్ని సమస్యల్ని కొనితెచ్చుకోవడం కంటే.. పిసిరంత నిమ్మకాయతో తళతళలాడే పళ్ళను తెచ్చుకోవచ్చని వారంటున్నారు.

ఒక గిన్నెలో తాజా నిమ్మకాయను పిండి రసాన్ని తీయాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి కలబెట్టాలి. బ్రషింగ్ చేయడం పూర్తి అయ్యాక ఆ రసాన్ని రెండు సార్లు నోట్లో పోసుకొని.. రెండు నిమిషాలపాటు పుక్కిలించి ఊమ్మేయాలి. ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే చాలు.. పళ్ళపై ఉన్న గార లేదా పాచితో ఉప్పు, నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్‌లు రసాయన చర్యలు జరుపుతాయి. వాటిపై గార లేదా పసుపు పచ్చటి పొర తొలగిస్తాయట. ఇలా చేస్తే వారానికి పళ్లు తళతళా మెరవడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yellowish teeth remedy  lemon remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more