The healthy foods which control high blood pressure | bp control foods | home remedies | health tips

Healthy foods control high blood pressure home remedies medicines

health tips, healthy foods, healthy food items, healthy tips, bp tip, high blood pressure tips, blood pressure healthy tips, blood pressure foods, healthy home remedies, healthy medicines, bp control tips, bp control foods

Healthy foods control high blood pressure home remedies medicines : There are some healthy foods are available which control blood pressure.

బీపీని తగ్గించే ఉత్తమ ఆహారాలు

Posted: 07/03/2015 11:54 AM IST
Healthy foods control high blood pressure home remedies medicines

మారుతున్న జీవన విధానం, పోషకాహారలోపం, ఒత్తిడి కారణంగా చాలామంది రక్తపోటు (బి.పి) బారిన పడుతున్నారు. ఒకప్పుడు చాలాకొద్దిమందిలో మాత్రమే వుండే ఈ వ్యాధి.. ప్రస్తుతకాలంలో వైరస్ లా పాకుతోంది. ప్రతి ముగ్గురిలోనూ ఒకరు రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారని పరిశోధనలో వెల్లడైంది. ఈ బీపీ వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుంది. దాని ప్రభావం గుండె, కిడ్నీలపైనే మొదటగా పడుతుంది. బీపీని కంట్రోల్ లో వుంచుకోకపోతే.. గుండెపోటు వచ్చే అవకాశముంది. కాబట్టి.. బీపీని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే.. ఆ ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా వుండొచ్చు.

బీపీని అదుపులో లేదో పూర్తిగా తగ్గించడానికి కొన్ని పోషకాహారాలు వున్నాయి. వాటిలో వుండే పోషక విలువలు బీపీని పూర్తిగా తగ్గించడంతోపాటు నిత్యం ఆరోగ్యంగా వుండేలా దోహదపడుతాయి. అంతేకాదు.. రకరకాల వ్యాధులు దరిచేరకుండా తాజాదనాన్ని అందిస్తాయి. మరి.. బీపీని పూర్తిగా తగ్గించి ఆరోగ్యంగా వుంచే ఆ ఆహారాలేంటో తెలుసుకుందామా..

*  పుచ్చకాయ : ఇందులో నియాసిన్‌, పాంటోథోనిక్‌ ఆమ్లం, విటమిన్‌ సి, మాంగనీస్‌లు పుష్కలంగా వుంటాయి. ఇవి బీపీని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఖర్బూజా గింజలను రోస్ట్ చేసి లేదా ఎండబెట్టి తినడం వల్ల రక్త నాళాల్లో ఉన్న ప్రెజర్ తగ్గి బి.పి. కంట్రోల్ లో ఉంటుంది.

* అరటి పండ్లు : ఈ పండ్లలో పొటాషియం అధిక మోతాదులో నిల్వవుంటుంది. ఈ మూలకం.. శరీరంలో ద్రవాల సంతులనం చేసి తక్కువ రక్తపోటుకు సహాయపడుతుంది. కాబట్టి.. ప్రతిరోజూ ఐదు లేదా అంతకంటే ఎక్కువ అరటిపండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

* విటమిన్ సి ఉండే పండ్లు : ఆరెంజ్, కివి, క్రాన్ బెర్రీ, జామ, ద్రాక్ష, స్ట్రాబెర్రీలలో విటమిన్ సి అధికంగా వుంటుంది. ‘విటమిన్-సి’ క్రమం తప్పకుండా తీసుకుంటే.. అధిక రక్తపోటు తగ్గుతుందని చాలా పరిశోధనల్లో నిరూపించబడింది. కాబట్టి.. ఆ విటమిన్ కల్గిన పండ్లు పచ్చివిగా లేదా రసాలుగా తీసుకుంటే మంచిది.

* పెరుగు : ప్రతిరోజూ ఒక చిన్న కుండలో మూడో వంతు పెరుగు తీసుకుంటే.. ద్వారా అధిక రక్తపోటును తగ్గించవచ్చు. ప్రతి రోజు 120 గ్రాముల పెరుగును 15 సంవత్సరాలపాటు తిన్న వారిలో అధిక రక్తపోటు అభివృద్ధి 31 శాతం తగ్గిందనట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది.

* నిమ్మకాయ : ఇందులో విటమిన్ సి ఎక్కువ మోతాదులో వుంటుంది. అది బిపిని కంట్రోల్ చేసి, రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది. అలాగే తాజాదనాన్ని అందిస్తుంది. కాబట్టి.. ప్రతిరోజూ నిమ్మరసం తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కేవలం ఇంతేకాదు.. బిపిని కంట్రోల్ చేసే ఆహారాలు ఇంకా చాలా వున్నాయి. వాటిల్లో వెల్లుల్లి, బ్రౌన్ రైస్, కొత్తిమీర, కూరగాయలు, పచ్చని ఆకుకూరలు, టమోటాలు, బంగాళదుంపలు, ఉసిరికాయ, డైరీ ప్రోడక్ట్స్, సోయా మిల్క్, గుమ్మడికాయ తదితరలు వున్నాయి. ఈ ఆహారాల్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే అధిక రక్తపోటును పూర్తిగా తగ్గించుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  bp control foods  healthy foods  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more