Tips to relief from obesity fat body

obesity, fat problems, peoples having fat problems, tips to relief from obesity, fat peoples, tips to relief from fat body, obesity problems, health tips, health tips to relief from obesity

obesity, fat problems, peoples having fat problems, tips to relief from obesity, fat peoples, tips to relief from fat body, obesity problems, health tips, health tips to relief from obesity

బొజ్జను తగ్గించుకునే చిట్కాలు

Posted: 03/10/2014 12:18 PM IST
Tips to relief from obesity fat body

వయసు పెరుగుతున్న మన శరీరంలో జీవన ప్రక్రియలు కూడా మారుతుంటాయి. ఇటువంటి సమయంలో కొన్ని హానికరమైన రోగాలు సంభవించే అవకాశాలు చాలానే వుంటాయి. 

ప్రస్తుతకాలంలో చాలామంది బొజ్జ సమస్యతో బాధపడుతున్నారు. ఇవి మన శరీరాకృతిని వికృతంగా మార్చడమే కాక, అనేక రోగాలను దారితీస్తుంది. ముఖ్యంగా మనలో వుండే జీవక్రియలు మందగించడం మొదలవుతాయి. దీంతో శరీరంలో అధికమొత్తంలో కొవ్వు పదార్థాలు పెరగడం ప్రారంభం అవుతాయి. 

ఇలా విడుదలైన కొవ్వు పదార్థాలు ఎంతో హానికరంగా తయారవుతాయి. దీంతో గుండెజబ్బులు, మధుమేహం, రొమ్ము క్యాన్సర్, పిత్తాశయ సమస్యలు, అధిక రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్ వంటి అనేక రోగాలు సంభవిస్తాయి. 

బొజ్జను తగ్గించుకునే చిట్కాలు : 

1. చాలామంది బరువు ఎక్కువ వున్నారని తెలియగానే ఆహారం తీసుకోవడం మానేస్తారు. బొజ్జను తగ్గించుకోవాలని, బరువు పెరగకుండా వుండాలని డైటింగ్ లేదా కేవలం ఒకపూట తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు. ఇది ఎంతో ప్రమాదకరం. అలాకాకుండా మూడుపూటలా భోజనం తీసుకోవచ్చు. అయితే వాటిని తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తపడాలి. 

2. ప్రతిరోజూ తక్కువ మోతాదులో శక్తినిచ్చే ఆహారపదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. ఇలా అల్పాహారం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాక, శరీరాకృతి కూడా అదుపులో వుంటాయి. 

3. సాధ్యమైనంతవరకు ఉప్పువుండే పదార్థాలను తీసుకోవడం మానేయాలి. ఉప్పు శరీరంలో నీటిని, కొవ్వును నిల్వవుండే గుణాన్ని కలిగివుంటుంది. దీంతో బరువు పెరగడమే కాకుండా, చురుకుగా వుండలేకపోతారు. కాబట్టి ఉప్పు వాడకం తగ్గించుకోవాలి. 

4. లావుగా వున్నవారు జిమ్ కు వెళ్లడం, ఇతర వ్యాయామాలు చేయడం చేస్తుంటారు. అయితే వాటితోపాటు ప్రతిరోజు నడక చాలా అవసరం. సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ప్రతిరోజూ నడిస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు. అలాగే పరిగెత్తడం వల్ల శరీరంలో వుండే కొవ్వు చాలావరకు తగ్గిపోతుంది. 

5. ఆహారపదార్థారాలలో రుచికరమైన వేపుడు కూరలు తీసుకోవడం చాలా ప్రమాదం. అలాకాకుండా ఉడికించిన కూరలు తింటే ఎంతో మేలైనది. దీంతో బొజ్జ తగ్గి, ఆరోగ్యంగా వుంటారు. 

6. ప్రతిరోజూ సాయంత్రం తాజాగా వుండే ఏదో ఒక ఆహారపదార్థాలను అంటే యాపిల్, అరటిపండు ఇంకా ఇతర పండ్లను తీసుకోవాలి. 

7. నీరు.. దీనిని ప్రతిరోజు చాలా ఎక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. ఇలా తీసుకోవడం వల్ల ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. దీంతో జీవప్రక్రియ మెరుగవుతుంది. దీంతో బరువు తగ్గి, ఆరోగ్యంగా వుండొచ్చు. 

8. నిద్రవల్ల కూడా బరువు తగ్గే అవకాశాలు వున్నాయి. ఎలా అంటే.. నిద్రపోవడం వల్ల కండరాలు అలసటపడి తేరుకుంటాయి. అలాగే శరీరంలో ఎక్కువ కాలరీలు కరుగుతాయి. దీంతో కొవ్వు పదార్థాలు తగ్గి, ఆరోగ్యంగా వుంటారు. 

ఇలా ప్రతిరోజూ పాటిస్తే.. బరువు చాలావరకు తగ్గే అవకాశం వుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more