Healthy food to gain weight

healthy food, healthy food to gain weight, weight gain process, weight gain procedure, healthy foods, weight gain tips, tips for weight gain, health tips, love tips, romance tips, organising tips

healthy food, healthy food to gain weight, weight gain process, weight gain procedure, healthy foods, weight gain tips, tips for weight gain, health tips, love tips, romance tips, organising tips

లావు పెరగడానికి కావలసిన అత్యుత్తమ ఆహారాలు

Posted: 03/05/2014 07:01 PM IST
Healthy food to gain weight

ప్రపంచంలో వున్న ప్రతిఒక్కరూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతుంటారు. కొందరు లావుగా వున్నారని, మరికొందరు సన్నగా వున్నారని ఫీల్ అవుతుంటారు. అయితే లావుగా వున్నవారికంటే.. సన్నగా వున్నవారే ఎక్కువగా బాధపడుతుంటారు. సన్నగా వున్నవారు లావుగా మారడానికి పడరానిపాట్లు పడుతుంటారు.

సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో వుండే కేలరీలు.. మనం పనిచేసి ఖర్చుపెట్టే కేలరీలు సమానంగా వుంటే బరువుగానీ, శరీరాకృతిలోగానీ ఎటువంటిమార్పు వుండదంటున్నారు నిపుణులు. మనం నిర్వహించుకునే విధులకు అనుగుణంగా ఆహారాన్ని తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా వుండొచ్చని సలహాలు ఇస్తున్నారు నిపుణులు. అలాగే సన్నగా వున్నవారు లావు పెరగడానికి కొన్ని చిట్కాలు.....

మాంసాహారాలు : 

ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో కనీసం రెండు సాల్మన్ చేపలను తీసుకుంటే మంచిదంటున్నారు. ఎందుకంటే.. ఇందులో వున్న మాంసకృతులు సరిగ్గా వంటబట్టి క్రమంగా బరువు పెరుగుతారు. అంతేకాదు.. అత్యవసర తైలాలు శారీరక తరుగుదలను అదుపులో వుంచి, శరీరంలో వుండే కొవ్వు పదార్థాలను సరైన రీతిలో అదుపు చేస్తాయి. 

అలాగే ట్యూనా ఫిష్ లో కూడా శరీరానికి సంబంధించిన ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాలు కలిగి వుంటాయి. మధ్యాహ్న భోజనంలో వీటిని తీసుకోవడంవల్ల లావు పెరగడమే కాకుండా, ఆరోగ్యకరంగా వుండడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. 

రొయ్యలలో వుండే పుష్కలమైన పోషకాలు, అత్యవసరమైన ఆమ్లం మన శరీర శక్తిని పెంచి, అనతికాలంలోనే త్వరగా బరుగు పెరిగేలా చేస్తుంది. 

గ్రిల్ చేసిన కోడిరొమ్ములు కూడా బరువు పెరగడానికి సహకరిస్తాయి. 

ముఖ్యంగా సన్నగా తరిమిన మాంసాన్ని తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతారు. ఎందుకంటే.. అందులో వుండే ఏకైక లక్షణం.. కొవ్వును తేలిగ్గా అరిగేటట్లు చేస్తుంది. 

ఇవికాకుండా మనకు సాధారణంగా దొరికే ఆహారపదార్థాలలో కోడిగుడ్డు శ్రేష్ఠమైనది చెబుతున్నారు. ఈ గుడ్డులో కొలెస్టిరాల్, కేలరీలు పుష్కలంగా వుంటాయి. రోజుకు కనీసం రెండుగుడ్లు తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతారు. 

ఎర్రమాంసం తీసుకోవడం వల్ల అది చాలాసేపు కడుపులో నిండుగా వుండడమే కాకుండా, బరువు పెరగడంలో ఉపయోగపడుతుంది. 

ఓట్ మీల్... ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇందులో వుండే పీచుపదార్థం.. శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. 

ముడిబియ్యంలో కూడా ఎక్కువ పరిమానంలో పీచు పదార్థం వుంటుంది. దీనిని నిత్యం తీసుకుంటే.. పిండిపదార్థాల నిల్వలు పెరిగుతాయి. దీంతో మీరు బరువు కూడా పెరుగుతారు. 

సింపుల్ గా గోధుమరొట్టెలను తీసుకోవడం చాలా మంచిది. బాగా కాల్చిన గోధుమ రొట్టెలో అధికమొత్తంలో కేలరీలను కలిగివుంటుంది. దీనిని రోజు కడుపునిండా సేవిస్తే.. బరువు పెరగడం చాలా సులభం. 

శాకాహారాలు : 

శాకాహారులకు ముఖ్యంగా కావల్సింది బీన్స్. ఒక గిన్నెడు బీన్స్ లో దాదాపు 300 కేలరీల దాకా శక్తి లభిస్తుంది. దీనిని బ్రౌన్ బ్రెడ్ తో తీసుకుంటే పోషకాలతో పాటు బరువు పెరగడానికి ఆస్కారం వుంటుంది. 

మనం రోజువారి తీనే ఆహారపదార్థాలో తగిన పరిమాణంలో కాల్చిన బంగాళదుంపలను తీసుకుంటే బరువు త్వరగా పెరగవచ్చు. 

అలాగే కందగడ్లలో 150 కేలరీల శక్తి నిల్వ వుంటుంది. దీనిని నిత్యం తీసుకుంటే చెప్పుకోదగ్గ రీతిలో బరువు పెరగొచ్చు. 

బాదం వెన్నను సలాడ్ లేదా టోస్ట్ లతో తీసుకోవచ్చు. దీంతో చర్మసౌందర్యం పెరగడమే కాక బరువు కూడా పెరగవచ్చు. 

ఆలివ్ ఆయిల్ వుండే లినోలిక్ ఆమ్లం బరువు పెరుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. అంతేకాక గుండెజబ్బులను నివారించడంలో ఇది ముఖ్యపాత్ర వహిస్తుంది. 

ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకుంటే మంచి శరీరాకృతి లభిస్తుంది. ఇది చర్మం మృదువుగా, జుట్టు ఎత్తుగా, బరువు పెరగడంలో తనదైన పాత్ర వహిస్తుంది. 

సహజసిద్ధంగా మనకు దొరికేవాటిలో అరటిపళ్లు ఎంతో మేలయినవి. ఇందులో చక్కెర మిశ్రమం, పండిపదార్థాలు పుష్కలంగా వుంటాయి. వీటిద్వారా తక్షణ శక్తి రావడమే కాక.. ఆరోగ్యకరంగా బరువు కూడా పెరుగుతుంది. 

కొబ్బరిపాలలో ఆహారపు తైలాలు పుష్కలంగా వుంటాయి. నిత్యం వీటిని తీసుకోవడం వల్ల కేలరీల పరిమాణం పెరిగి, బరువు పెరుగుదలకు తోడ్పడుతుంది. 

ఇక చివరగా కిస్మిస్ పళ్లు.. ఒక్క పండులో 99 కేలరీల వరకు శక్తి నిల్వ వుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో వుండే కొవ్వును కరిగించి, ఆరోగ్యంగా కేలరీలను నింపుతుంది. దీంతో బరువు కూడా పెరగవచ్చు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more