Mass Maharaja Raviteja Comments On Kick 2 Movie Length | Director Surender Reddy | Kalyan Ram

Mass maharaja raviteja on kick 2 movie length director surender reddy

raviteja news, raviteja updates, kick 2 movie, director surender reddy, kalyan ram, rakul preet singh, kick 2 collections, kick 2 movie updates, kick 2 controversies

Mass Maharaja Raviteja On Kick 2 Movie Length Director Surender Reddy : Mass Maharaja Said Kick 2 Movie Is Lesson To Him And Director Raviteja.

‘కిక్-3’లో ఆ పొరపాటు దొర్లదంటున్న రవి

Posted: 08/27/2015 02:53 PM IST
Mass maharaja raviteja on kick 2 movie length director surender reddy

రవితేజ.. తెలుగు ఇండస్ట్రీలో ‘మాస్’ అన్న పదానికి సరికొత్త వన్నె తెచ్చిన ‘పవర్’ఫుల్ హీరో. అందుకే.. ఈయనకు ‘మాస్ మహారాజా’ అనే పేరు కూడా వుంది. ఆయనలో కేవలం ఆ ఒక్క యాంగిల్ మాత్రమే కాదు.. కామెడీ కోణం కూడా దాగి వుంది. ఆ రెండు కలగలసిన నటుడు కావడంతో రవితేజకి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ దక్కింది. ఏ వారసత్వం లేకుండానే స్టార్ హీరో హోదాకి ఎదిగిపోయాడు. ఆమధ్య వరుసగా పరాజయాలు వచ్చినప్పటికీ.. ఆయనకు ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ తర్వాత నుంచి మంచి సినిమాలను ఎంచుకుంటూ మళ్లీ తన వేగాన్ని పుంజుకున్నాడు. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ హీరోకి ఓ సినిమా బాగానే గుణపాఠం నేర్పించిందని అంటున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అని అనుకుంటున్నారా..! మరేదో కాదు.. ‘కిక్’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘కిక్-2’ చిత్రం.

దర్శకుడు సురేందర్ రెడ్డి, రవి కాంబినేషనల్ లో వచ్చిన ‘కిక్-2’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. అంతగా ‘కిక్’ ఇవ్వలేదని మొదటి రోజే టాక్ బయటికొచ్చింది. అలాగే.. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగానే వున్నాయని కామెంట్లు వచ్చాయి. నిజానికి స్టోరీలైన్ అందరినీ ఆకట్టుకునేలా వున్నప్పటికీ.. దానిని మరింత సాగదీయడంతో బోరింగ్ గా అనిపించింది. ఈ విషయంపై వెంటనే స్పందించిన సినిమా టీమ్.. దాదాపు 20 నిముషాల పాటు నిడివిని తగ్గించింది. సినిమాలో ఎక్కడా బోర్ కొట్టకుండా స్పీడ్ పెంచింది. ఈ నిడివి తగ్గినప్పటి నుంచి సినిమా కలెక్షన్లు మళ్లీ జోరందుకున్నాయని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వెల్లడించాయి. అయినప్పటికీ.. ‘ఈ సినిమా అంతగా కంఫర్ట్’గా లేదని, యావరేజ్ గానే వుందని సినీ జనాల నుంచి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కాస్త లెంగ్తీగా, బోరింగ్ గానే వుందని చెప్పుకుంటుననారు.

ఇదే విషయంపై రవితేజ స్పందిస్తూ.. రిలీజ్ కి ముందే తనకి అక్కడక్కడా కాస్త లెంగ్త్ గా అనిపించిందని చెప్పాడు. ఆ విషయాన్ని తాను దర్శకుడికి చెప్పినా.. ఆయన కాన్ఫిడెంట్ గా వున్నాడని అన్నాడు. ఏదేమైనా.. ఈ సినిమా తనకి, దర్శకుడికి ఇద్దరికీ గుణపాఠం వంటిదని పేర్కొన్నాడు. ఇటువంటి పొరపాటు ‘కిక్-3’ దొర్లదని స్పష్టం చేశాడు. అన్నట్టు.. ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు రవితేజ కెరీర్ లోనే హైయ్యెస్ట్ అని ట్రేడ్ టాక్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raviteja  kick 3  surender reddy  kalyan ram  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more