Siva Balaji Turned As Producer | Siva Balaji Production Movie | Actor Ajay Movies | Tollywood

Siva balaji turned as producer actor ajay tollywood news

siva balaji, siva balaji productions, telugu actor ajay, ajay telugu movies, paddanandi premalo mari movie, gagan musical frames, siva balaji gagan musical frames

Siva Balaji Turned As Producer Actor Ajay Tollywood News : Telugu Actor Siva Balaji Turned As Producer. He Is Producing A Movie In Mahesh Upputuri Direction.

నిర్మాతగా అవతారమెత్తిన నటుడు శివబాలాజీ

Posted: 09/02/2015 03:09 PM IST
Siva balaji turned as producer actor ajay tollywood news

శివబాలాజీ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు. ‘ఇది అశోక్‌గాడి ల‌వ్‌స్టోరీ’ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ యాక్టర్.. ‘ఆర్య, సంక్రాంతి, పోతేపోనీ, శంభో శివ శంభో’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఆ సినిమాలు మంచి విజయం సాధించిన నేపథ్యంలో.. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ప్రేక్షకుల మదిలో తనదైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించాడు. అయితే.. ఇంతలోనే కొన్ని సమస్యలు ఏర్పడటంతో అతడు కొన్నాళ్లు కనిపించలేదు కానీ.. తాజాగా మరో కొత్త రూపంతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పుడు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే తలంపుతో నిర్మాతగా మారారు.

శివబాలాజీ ‘గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్’ అనే బ్యానర్ ను స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా ‘పడ్డానండీ ప్రేమలో మరి’ వంటి క్యూట్ లవ్ స్టోరీని రూపొందించిన దర్శకుడు మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ఓ సినిమాని రూపొందించేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో శివబాలాజీతోపాటు ఇటు విలన్ గా, అటు క్యారెక్టర్ ఆరిస్ట్ గా రాణిస్తున్న అజయ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తోరూపొందనున్న ఈ చిత్రం సెప్టెంబర్ 23న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇద్దరు స్నేహితుల కథను 1980 బ్యాక్ డ్రాప్ పై, ఓ నిజ ఘటన ఆధారంగా దర్శకుడు మహేష్ ఉప్పుటూరి తెరకెక్కిస్తున్నారు. శివబాలాజీ, అజయ్ ఈ చిత్రంలో క్యారెక్టర్స్ చాలా హైలైట్ గా ఉంటాయి. ప్రేక్షకులు కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ తో సినిమా ఉంటుందని దర్శకుడు మహేష్ ఉప్పుటూరి అన్నారు.

ఇక ఈ సినిమాను నిర్మిస్తున్న నటుడు శివబాలాజీ కూడా.. ఈ చిత్రంపై నమ్మకంతో వున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా వియం సాధిస్తుందని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇదిలావుండగా.. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాతగా తొలిచిత్రం నిర్మిస్తున్న ఈ తొలి సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : siva balaji  actor ajay  gagan musical frames  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more

Today on Telugu Wishesh