‘ఈరోజుల్లో’ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన మారుతి.. మొదటి సినిమాతోనే హిట్ సాధించి యూత్ లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. యూత్ ని దృష్టిలో పెట్టుకుని ఆ తరహాలోనే మరిన్ని సినిమాలను రూపొందించి.. డైరెక్టర్ గా తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు.. తాజాగా ఓ భారీ అవకాశాన్ని దక్కించుకున్నాడని సమాచారం.
మారుతి వినిపించిన ఒక కథ విక్టరీ వెంకటేష్ కి బాగా నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. నిజానికి గతంలోనే వెంకటేష్ కి మారుతి ఓ కథ వినిపించాడు. ఆ కథ వెంకీకి నచ్చింది కూడా! త్వరలోనే ఆ సినిమాకి సంబంధించి కార్యక్రమాలు కూడా మొదలవుతాయని వార్తలొచ్చాయి. అయితే.. ఇంతలోనే ఏమైందో తెలీదు కానీ.. కొన్ని కారణాల వలన వెంకీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో ఆ ప్రాజెక్ట్ అర్థంతరంగా ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోవడంతో మారుతి ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించాడు.
కానీ.. వెంకీతో ఓ ఫ్యామిలీ చిత్రాన్ని రూపొందించాలని ఫిక్సైన మారుతీ, పట్టు వదలకుండా మరో కొత్త కథని సిద్ధం చేస్తూ వచ్చాడు. అప్పటి నుంచి కథని సిద్ధం చేస్తూ వచ్చిన మారుతి.. దానిని వెంకటేష్ కి తాజాగా వినిపించాడు. ఆ కథ ఆయనకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇక ఈ సినిమాను నిర్మించేందుకు ముగ్గురు ప్రముఖ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. మొత్తానికి మారుతి అనుకున్నది సాధించాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
ఇదిలావుండగా.. క్రాంతిమాధవ్ కథపట్ల ఆసక్తిని చూపిన వెంకటేష్, ఆ తరువాత చంద్రశేఖర్ యేలేటిని లైన్లో వుంచినట్టుగా సమాచారం. బహుశా ఆ రెండు సినిమాల తరువాత వెంకీతో మారుతి సినిమా పట్టాలెక్కవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక వార్తలు వెలువడాల్సి వుంది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more