ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి జనరేషన్ కి తగ్గట్టుగా ఉర్రూతలూగించే సాంగ్స్ కే ఓటేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు.. ఆ తరహాలో పాటలు అందించేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటివారిలో మ్యూజిక్ డైరెక్టర్ మహ్మద్ గిబ్రాన్ ఒకరు. ఇప్పటివరకు ఈయన అందించిన పాటలు ఇతర సినిమా పాటలతో చాలా డిఫరెంట్ స్టైల్లో వుండటంతో.. కేవలం నాలుగైదు సినిమాలకే స్టార్ స్టేటస్ కి కైవసం చేసుకున్నాడు. అందుకే.. ఇతని కోసం దక్షిణాది దర్శకనిర్మాతలు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతనికి ఓ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకి మ్యూజిక్ అందించే అవకాశం వరించింది.
నిన్నటిదాకా బూతు సినిమాల దర్శకుడిగా పేరుగాంచిన డైరెక్టర్ మారుతి.. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ఆ ఇమేజ్ ని నుంచి బయటపడ్డాడు. అంతేకాదు.. ఆచిత్రం భారీ విజయం సాధించడంతో స్టార్ స్టేటస్‌ను కొట్టేశాడు. ఆ స్టేటస్ ని కంటన్యూ చేయడం కోసమే మారుతి.. ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌తో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి.. వీరిద్దరి కాంబినేషన్లో చాలాకాలం క్రితమే ఒక సినిమా మొదలైనా, చివరి నిమిషంలో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే.. వెంకీకి మంచి హిట్ దక్కకపోవడం, మారుతి భారీ విజయం సాధించి స్టార్ స్టేటస్ కైవసం చేసుకోవడంతో వీరిద్దరూ మళ్ళీ కలిశారు. దీంతో.. ఈ సినిమా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని సమాచారం. ‘తులసి’ తర్వాత మళ్ళీ వెంకీ సరసన నయనతార హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమా డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్ళనుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అయిన గిబ్రాన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఇప్పటికే రన్ రాజా రన్, జిల్, ఉత్తమ విలన్, చీకటి రాజ్యం తదితర సినిమాల్లో తనదైన మ్యూజిక్ మ్యాజిక్ చేసి లేటెస్ట్ సెన్సేషన్‌గా నిలిచిన గిబ్రాన్.. వెంకీ-మారుతిల సినిమాకు పనిచేయనుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక గిబ్రాన్ వెరైటీ ట్యూన్స్ కి పెట్టింది పేరు కాబట్టి.. ఈ సినిమాకి అతను ఎలాంటి సాంగ్స్ అందిస్తాడోనని ఆసక్తి నెలకొంది. సితార క్రియేషన్స్‌తో కలిపి సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 16వ తేదీన మొదటి షెడ్యూల్ మొదలుపెట్టనుంది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more
Nov 17 | తమిళ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో అజిత్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హీరో అనే గర్వం ఏమాత్రం లేకుండా సాధారణ ప్రజలతో సహా మమేకమయ్యే మంచి మనస్తత్వం కలిగిలిన... Read more