సరికొత్త కథాంశాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తున్న హీరో నిఖిల్.. ‘సూర్య వర్సెస్ సూర్య’ మూవీతో మరో ప్రయోగం చేయనున్నాడనే విషయం తెలిసిందే! ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ లాంటి కొత్త కాన్సెప్ట్ మూవీలతో భారీ హిట్స్ సాధించిన ఈ యువనటుడు.. ఆ తరహాలోనే తెరకెక్కుతున్న ఈ సూర్య మూవీతోనూ మరో సంచలన విజయం సాధించడం ఖాయమని అంటున్నారు. ఇక ఇటీవలే ఈ మూవీలోని ఓ పూర్తి పాట కూడా విడుదలయ్యింది. మూవీ ప్రచారం కోసమే ఇలా ఒక్కొక్కటి విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా.. తాజాగా సమాచారం ప్రకారం ఈ మూవీ ఆడియోని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ చేయనున్నారని తెలిసింది. అలాగే మూవీని ఫిబ్రవరి చివర్లో రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పెద్ద మూవీలో ఏవీ లేని సమయంలో మూవీని విడుదల చేస్తే హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు భారీ వసూళ్లను రాబడుతుందనే ఉద్దేశంతోనే ఫిబ్రవరి చివరివారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే.. ఈ మూవీలో అలనాటి హీరోయిన్ మధుబాల ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుంది. ఈ మూవీతో ఆమె రీఎంట్రీ గ్రాండ్’గా వుంటుందని యూనిట్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక ఇందులో నిఖిల్ సరసన త్రిదా చౌదరి హీరోయిన్’గా నటిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో తదితర కార్యక్రమాలను శరవేగంగా ముగిస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఏదేమైనా.. మరో కొత్త కాన్సెప్ట్’తో కథతో వస్తున్నందుకు ఈ మూవీపై హైప్ బాగానే పెరిగింది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more