Surfer Katherine Diaz killed by lightning while training ఒలంపిక్స్ కల తీరకుండానే.. కన్నుమూసిన సర్పర్..

Surfer katherine diaz killed by lightning while training in el salvador

katherine díaz hernández, el salvador, olympics, lighting, El Tunco beach, surfing, International surfing Assn, World Surf games, Tokyo Olympics, surfing news, sports news, sports

Katherine Diaz, a 22-year-old surfer from El Salvador, died Friday after being struck by lightning. She was surfing near her home in the El Tunco neighborhood, about an hour south of San Salvador, in preparation for the International Surfing Assn.'s World Surf Games, a qualifying event for this summer’s Toyko Olympics.

విషాదం: ఒలంపిక్స్ కల తీరకుండానే.. కన్నుమూసిన సర్పర్..

Posted: 03/23/2021 08:50 PM IST
Surfer katherine diaz killed by lightning while training in el salvador

టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్‌ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని ఆ క్రీడాకారిణి సంతోషంలో మునిగిపోయింది. ఎలాగైనా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలతో సాధన మొదలెట్టింది. నీటి అలలపై రయ్‌మని దూసుకెళ్లడంలో ఆరితేరేందుకు తీవ్రంగా శ్రమించింది. కానీ నీళ్లే ప్రాణంగా బతికిన ఆ అమ్మాయి.. చివరికి నీటిలోనే ప్రాణాలు వదిలింది. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల తీరకుండానే దురదృష్టవశాత్తూ పిడుగుపాటుకు గురై కన్నుమూసింది. ఆమే.. సాల్వడోర్‌కు చెందిన 22 ఏళ్ల కేథరిన్‌ డియాజ్‌.

ఆ దేశంలోని అగ్రశ్రేణి సర్ఫర్‌ అయిన తను ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ కోసం సిద్ధమవుతోంది. ఆ ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ సర్ఫ్‌ క్రీడల కోసం సాధన చేసేందుకు సముద్రంలోకి వెళ్లిన తను.. అక్కడే పిడుగుపాటుకు గురై కిందపడిపోయింది. వెంటనే అత్యవసర సహాయక సిబ్బంది ఆమెను ఒడ్డుకు చేర్చినప్పటికీ టుంకో బీచ్‌లోనే తుదిశ్వాస విడిచింది. ‘‘మా దేశానికి ప్రాతినిథ్యం వహించిన గొప్ప అథ్లెట్‌ మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె గొప్ప యోధురాలు. దేశం బాధతో కన్నీళ్లు పెడుతోంది’’ అని ఆ దేశ సర్ఫ్‌ సమాఖ్య సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles