PV Sindhu suffers shock defeat in China Open చైనా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరు..

Pv sindhu bows out of china open with a quarter final loss

badminton, China super series, PV Sindhu, Gao Fangjie, China Open Superseries, Badminton, sports

PV Sindhu went down rather tamely to World No.19 Gao Fangjie, going down 21-11, 21-10 in the quarter-finals of the China Open Super Series Premier.

చైనా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరు..

Posted: 11/17/2017 04:53 PM IST
Pv sindhu bows out of china open with a quarter final loss

భారత స్టార్ షట్లర్, రియో ఒలంపిక్ రజత పతక విజేత పివీ సింధూ కూడా సైనా బాటలోనే నడిచింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ లో అమైనా ముందుకు దూసుకెళ్తుందని అశించిన బ్యాడ్మింటన్ క్రీడాభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. మహిళల విభాగంతో స్టార్ గా వెలుగోందుతున్న సిందూ కూడా చైనా ఓపెన్ నుంచి నిష్క్రమించింది. దీంతో చైనా ఓపెన్‌ సూపర్ సిరీస్ లో భారత తన పోరు ముగించేసింది.

భారత్‌ తరఫున పోరులో ఉన్న పీవీ సింధు కూడా క్వార్టర్స్‌ నుంచే వెనుదిరిగడంతో అభిమానులకు నిరాశే మిగిలింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ లో రెండో సీడ్ సింధు 11-21, 10-21తో గావొ ఫాంగ్‌జీ(చైనా) చేతిలో ఓటమిపాలైంది. 38 నిమిషాల పాటు జరిగిన మ్యాచులో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. క్వార్టర్స్ నుంచే సింధు కూడా నిష్క్రమించడంతో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత పోరుకు తెరపడినట్లయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badminton  China super series  PV Sindhu  Gao Fangjie  China Open Superseries  Badminton  sports  

Other Articles