Prannoy climbs to 17th spot in BWF rankings వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో మనోళ్ల హవా

Indian men s singles shuttlers take the spotlight away from china

hs prannoy, us open grand prix gold, bwf world rankings, kidambi srikanth, ajay jayaram, sports news, badminton news, sports news, spots, latest sports news, badminton

ndian shuttler HS Pranoy, sho emerged victorious in US grand prix gold title beating parupalli kashyap, climbed to 17th position in latest BWF world rankings

వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో మనోళ్ల హవా

Posted: 07/28/2017 08:39 PM IST
Indian men s singles shuttlers take the spotlight away from china

వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ విడుదల చేసిన తాజా ప్రపంచ ర్యాకింగ్స్ లో భారత షట్లర్లు తమ సత్తాను చాటుకున్నారు. అమరికా ఓపెన్ గ్రాండ్ ఫ్రీ టోర్నీ టైటిల్ ను సాధించిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ముందంజ వేశాడు. తాజాగా విడుదలైన ప్రపంచ ర్యాకింగ్స్ లో ప్రణయ్ ఒకేసారి ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకులో నిలిచాడు. గాయాల పాలై రెండేళ్ల తర్వాత తొలిసారి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన పారుపల్లి కశ్యప్ 12 ర్యాంకులు ఎగబాకి 47వ స్థానం దక్కించుకున్నాడు.

ప్రపంచ ఛాంపియన్ షిప్‌కు అర్హత సాధించిన యువ ఆటగాడు సమీర్ వర్మ 28వ స్థానంలో ఉన్నాడు. ప్రణయ్ తన ర్యాంకు మెరుగు పరుచుకోవడంతో టాప్‌-20లో నలుగురు భారతీయులు ఉన్నట్టైంది. వరుసగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ లు గెలిచిన కిదాంబి శ్రీకాంత్ ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. మహిళల విభాగంలో పీవీ సింధు 5, సైనా నెహ్వాల్‌ 16వ స్థానాల్లో ఉన్నారు. టాప్‌-25లో భారత్‌ నుంచి ఇద్దరు మహిళలేకే స్థానం దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles