WFI Wants CBI To Investigate Narsingh Yadav Doping Fiasco After He Was Banned For 4 Years

Wrestler narsingh yadav calls for cbi inquiry

Olympics 2016, India, Narsingh Yadav, NADA, WADA, CBI inquiry, conspiracy, Rio Olympics, Rio 2016, Rio Olympics 2016, olympics news

WFI President Brij Bhushan Sharan Singh demanded a CBI probe into the "alleged conspiracy" against Narsingh Yadav, which led to a four-year ban on the grappler.

సీబీఐ విచారణ కావాలంటూ నర్సింగ్ యాదవ్ డిమాండ్

Posted: 08/22/2016 06:20 PM IST
Wrestler narsingh yadav calls for cbi inquiry

భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై డోపింగ్ కుట్ర జరిగిందని బలంగా వాదిస్తున్న డబ్యూఎఫ్ఐ(రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా).. ఈ వివాదానికి సంబంధించి సీబీఐ విచారణ జరగాల్సేందనని డిమాండ్ చేస్తోంది. ఇందులో నిజానిజాలు వెలికి రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని  డబ్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్లో పాల్గొనడానికి వెళ్లిన నర్సింగ్ యాదవ్ ఆశలకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పుతో బ్రేక్ పడింది. దాంతో పాటు అతనిపై నాలుగేళ్ల నిషేధం కూడా విధించింది. నర్సింగ్ పై డోపింగ్ కుట్ర జరిగిందనడానికి బలమైన ఆధారాలు లేనందును అతనిపై సస్పెన్షన్ వేటూ వేస్తూ తీర్పు వెలువరించింది.

జూన్ 25వ తేదీన నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నర్సింగ్ యాదవ్ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత నర్సింగ్ కు రెండోసారి పరీక్షలు నిర్వహించిన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా).. రెండు సార్లు తీర్పును వాయిదా వేసిన అనంతరం ఆగస్టు 1వ తేదీన అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో నర్సింగ్ యాదవ్ ఎన్నో ఆశలతో రియోలో అడుగుపెట్టాడు.  కాగా, నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో వాడా(వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) తన అధికారం మేరకు  సీఏఎస్ లో సవాల్ చేసింది. దీనిపై విచారణకు స్వీకరించిన సీఏఎస్.. నర్సింగ్ కుట్ర కారణంగానే  డోపింగ్ లో ఇరుక్కున్నాడన్న వాదనను  అంగీకరించలేదు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నర్సింగ్ పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ఉదంతం డోపింగ్ కుట్రలో భాగమేనని డబ్యూఎఫ్ఐ భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WFI  CBI  Narsingh Yadav  Wrestler  doping case  rio olympics  

Other Articles