Rio Olympics: Another Way of Looking at Shaunae Miller's Diving Win

Shaunae miller dives across line to win 400m gold

shaunae miller, allyson felix, photo finish olympics, shaunae miller dive finish line, shaunae miller bahamas, photo finish athletics, rio 2016 olympics, olympics athletics, olympics

Shaunae Miller of Bahamas won the women's 400m final in dramatic style with a diving finish across the line, preventing USA's Allyson Felix from winning a fifth Olympic gold medal.

ఒలంపిక్స్ లో తెలివైన ఆటతో స్వర్ణం గెలించింది..

Posted: 08/16/2016 07:46 PM IST
Shaunae miller dives across line to win 400m gold

రియో ఒలింపిక్స్లో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. బహమాయికి చెందిన స్ప్రింటర్ షాన్ మిల్లర్ ఊహించని విధంగా తలను ముందుగా లైన్పై పెట్టి పసిడిని సొంతం చేసుకుంది. ఇవాళ జరిగిన 400 మీటర్ల రేసులో మిల్లర్ అందరికంటే ముందు లైన్పై డైవ్ కొట్టి మరీ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ రేసు మొదలయ్యాక అమెరికా స్ప్రింటర్ అలైసన్ ఫెలిక్స్, మిల్లర్లు హోరీహోరీగా తలపడ్డారు. అయితే 398 మీటర్ల వరకూ ఈ ఇద్దరూ సరిసమానం పరుగెత్తగా, చివర్లో మిల్లర్ డైవ్ చేసి తన తలను ముందు లైన్పై ఉంచి విజేతగా నిలిచింది.

దీంతో ఒలింపిక్స్ లో ఐదో స్వర్ణం సాధించాలనుకున్న అలైస్ ఫెలిక్స్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  వీరిద్దరూ రేసును పూర్తి చేసే క్రమంలో వారి మధ్య వ్యవధి 0.07 సెకండ్లుగా నమోదు కావడం గమనార్హం. అయితే  మిల్లర్ ఇలా డైవ్ కొట్టి స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం రియో ఒలింపిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు ఇలా తల ముందుకు పెట్టి గెలిచిన వాళ్లు ఎవరూ లేరని.. ఈ తరహాలో గెలవడం ఇదే మొదటిసారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shaunae miller  allyson felix  sprinter  athlete  rio olympics  

Other Articles