Lionel Messi reconsiders decision to leave Argentina's national team

Lionel messi reverses decision to quit argentina team

lionel messi, messi, argentina, lionel messi returns, lionel messi argentina, messi argentina, argentina national team, football news, football

Lionel Messi retired from Argentina's national team after the team lost to Chile in the Copa America final in the United States in June.

అర్జెంటీనా అభిమానులకు శుభవార్త అందించిన మెస్సీ

Posted: 08/13/2016 03:57 PM IST
Lionel messi reverses decision to quit argentina team

కోపా అమెరికా కప్ లో భాగంగా తమ జట్టు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడకు వీడ్కోలు పలికిన సాకర్ లెజెండ్, అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు లియోనాల్ మెస్సీ మనసు మార్చుకున్నాడు. అర్జెంటీనా తరఫున మరలా బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించాడు. కాగా గత జూన్ నెలలో జరిగిన కోపా అమెరికా కప్ లో భాగంగా చిలీతో మ్యాచ్ ఓటమి తర్వాత తాను రిటైరవుతున్నట్లు మెస్సీ ప్రకటించి తన అభిమానులను షాక్ కు గురిచేశారు.

దీంతో మెస్సీ రిటైర్మెంట్ పై పునరాలోచించుకోవాలని అతన్ని అభిమానులతో పాటు అర్జెంటినా ప్రజలు కూడా కోరతూ ర్యాలీలు కూడా నిర్శహించిన విషయం తెలిసిందే. అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విన్నపాలు రావడంతో ఎట్టకేలకు మెస్సీ తన నిర్ణయంపై పునరాలోచించుకునేలా చేశారు. అభిమానుల ఆశలు మళ్లీ ఫలించాయి. ఫుట్ బాల్ దేశాన్ని ముందుకు నడిపేందుకు మళ్లీ గ్రౌండ్ లోకి దిగబోతున్నట్టు మెస్సీ ప్రకటించాడు. ఇప్పటికే అర్జెంటీనా ఫుట్ బాల్ చాలా సమస్యలను ఎదుర్కొంటుందని తానో సమస్యను కాకూడదనే రీ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

2018 ఫుట్ బాల్ ప్రపంచకప్ టీమ్ లో మెస్సీ చేరనున్నాడు. ప్రపంచకప్ లీగ్ దశలో ఉరుగ్వే, వెనిజులాతో అర్జెంటీనా తలపడనుంది. మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా మొత్తం నాలుగు ఫైనల్లో పరాజయాన్ని చవిచూసింది. 2014 ప్రపంచకప్ తరువాత వరుసగా రెండు కోపా అమెరికా కప్ తుది పోరులో అర్జెంటీనా ఓడిపోవడంతో మెస్సీ తన ఉద్వేగాన్ని ఆపులేక కెరీర్ గుడ్ బై చెప్పాడు. మెస్సీలాంటి మెరుగైన ఆటగాడు మరలా తిరగి జట్టులోకి రావడం అర్జెంటీనాకు కొండత బలమే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lienel messi  re-entry  argentina team  2018 worldcup  football  

Other Articles