Narsingh Yadav's food was spiked, Sonepat hostel insiders reveal

Wrestler narsingh yadav demands cbi probe pm modi takes note

narsingh yadav,narsingh yadav doping, narsingh yadav doping test, narsingh yadav sports authority of india, narsingh yadav sai, narsingh yadav vijay goel, vijay goel, vijay goel sports minister, pm modi, narendra modi, rio 2016 olympics, rio olympics, rio 2016, rio, olympics, wrestling

Prime Minister Narendra Modi has asked the Wrestling Federation of India (WFI) to share details of the failed dope test report of Rio Games-bound Narsingh Yadav,

కుట్ర పై విచారణకు డిమాండ్.. ప్రధాని జోక్యం..

Posted: 07/25/2016 08:41 PM IST
Wrestler narsingh yadav demands cbi probe pm modi takes note

డోపింగ్ టెస్టులో విఫలమైన భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ వివాదం ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు చేరింది. డోపింగ్ టెస్టులో నర్సింగ్ విఫలం కావడం, ఆపై అది కాస్త తీవ్ర దుమారం రేపడంతో మోదీ స్పందించారు. ఆ వివాదానికి సంబంధించిన వివరాలను తనకు అందజేయాలంటూ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ను కోరారు. ఈ మేరకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కలిసిన మోదీ.. ప్రస్తుత వివాదం గురించి అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా ఆ వివరాలను తక్షణమే తనకు పంపాలంటూ బ్రిజ్ భూషణ్ కు తెలియజేశారు.

రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) డోపింగ్ పరీక్షలో పట్టుబడిన సంగతి తెలిసిందే.  హరియాణాలోని సోనేపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్‌కు నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతను విఫలమయ్యాడు. అతని నుంచి సేకరించిన నమూనాలో నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లు తేలిందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నర్సింగ్ యాదవ్ రియోకు వెళ్లడంపై సందిగ్ధత ఏర్పడింది. మరోవైపు తనను రియోకు వెళ్లకుండా చేయడానికి కుట్ర జరిగిందని నర్సింగ్ ఆరోపిస్తున్నాడు.  

తాను ఎటువంటి నిషేధిత డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరో కావాలనే తన భోజనంలో డ్రగ్స్ కలిపి ఇరికించే యత్నం చేసి ఉంటారని నర్సింగ్ అనుమానిస్తున్నాడు. భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రూమ్మేట్ సందీప్ తులసీ యాదవ్ కూడా డోప్ పరీక్షలో పట్టుబట్టడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షలో వీరిద్దరూ నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్టు తేలింది. అయితే నిషేధిత ఉత్ర్పేరకాలను తాము వాడలేదని నర్సింగ్ యాదవ్, సందీప్ యాదవ్ చెబుతున్నారు.

భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్, తాను ఒకే రూమ్లో ఉన్నామని, తాము తిన్న ఆహారంలో ఎవరో నిషేధిత ఉత్ప్రేరకాలను కలిపి ఉంటారని భావిస్తున్నట్టు సందీప్ చెప్పాడు. తాను డోపీగా తేలినట్టు వచ్చిన వార్త విని షాకయ్యానని చెప్పాడు. నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ తనపై కుట్ర జరిగిందని, సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశాడు. ఏనాడూ తాను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకోలేదని స్పష్టం చేశాడు. అతని కోచ్ జగ్మల్ సింగ్ కూడా కుట్ర జరిగిందని ఆరోపించాడు. నర్సింగ్ యాదవ్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మద్దతుగా నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Narsing Yadav  Sandeep Tulsi Yadav  wrestler  Rio Olympics  doping controversy  

Other Articles