Indian boxer Vijender Singh looking for 4th straight pro win

Vijender looks for 4th straight pro win

Vijender Singh, Indian Boxer, Alexander Horvath, Hungarian, Liverpool, WBO Asia belt, Professional boxing, sports news

The fight will be precursor to Vijender's India debut in June when he will fight for the WBO Asia belt.

విజయేందర్ సింగ్ తన జోరు కోనసాగిస్తాడా..?

Posted: 03/12/2016 03:39 PM IST
Vijender looks for 4th straight pro win

గతేడాది ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన విజేందర్ సింగ్‌కు ఇప్పటిదాకా ఓటమి లేదు. ఇప్పటిదాకా మూడు బౌట్‌లలో తలపడిన అతను అన్నీ నాకౌట్ విజయాలనే సాధించి అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ బాక్సర్ నేడు (శనివారం) నాలుగో ఫైట్‌కు సిద్ధమవుతున్నాడు. అతనికి ఈ ఏడాది ఇదే తొలి ఫైట్ అవడంతో ఇప్పటిదాకా కనబరిచిన జోరునే మరోసారి చూపి సీజన్‌ను విజయంతో ఆరంభించాలని భావిస్తున్నాడు. ఇక ఈ బౌట్‌లో విజేందర్ ప్రత్యర్థిగా హంగేరికి చెందిన అలెగ్జాండర్ హోర్వత్ బరిలోకి దిగుతున్నాడు.

ఈ పోటీ కోసం పటిష్టంగా తయారయ్యేందుకు పాము ర క్తం తీసుకుంటున్నట్టు 20 ఏళ్ల హోర్వత్ ఇప్పటికే ప్రకటించి ఆసక్తిని మరింత పెంచాడు. ఏడు ఫైట్లలో తలపడిన ఈ యువ బాక్సర్ ఐదింటిలో నెగ్గాడు. అలాగే 31 రౌండ్లపాటు ఆడిన అనుభవం ఉంది. అందుకే ఈ బౌట్‌ను అంత తేలిగ్గా తీసుకోవడం ఇష్టం లేని 30 ఏళ్ల విజేందర్ కూడా రోజుకు 10 గంటలపాటు ప్రాక్టీస్‌తో చెమటోడ్చుతున్నాడు. నిజానికి ఈ బౌట్ గత నెలలోనే జరగాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.

తన విజయాల రికార్డును కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకే హోర్వత్‌పై పైచేయి సాధించడమే కాకుండా ఆ తర్వాత హారోలో జరిగే ఫైట్ కూడా నెగ్గి భారత్‌లో టైటిల్ పోరుకు సిద్ధమవ్వాలని భావిస్తున్నన్నాడు. హోర్వత్ కచ్చితంగా గట్టి పోటీదారని అంగీకరిస్తూనే.. తనకన్నా అనుభవం కలిగి ఉన్నా ప్రత్యర్థి తన పంచ్‌లకు ఎక్కువ సేపు రింగ్‌లో నిలబడడనే అనుకుంటున్నంటూ విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijender Singh  Indian Boxer  Alexander Horvath  Hungary  

Other Articles