Hockey: India hold New Zealand to 1-1 draw, win Test series 2-1

India hold new zealand to 1 1 draw win series 2 1

india hockey, hockey india, india vs new zealand, new zealand india hockey, hockey new zealand vs india, hockey news, hockey

India eked out a 1-1 draw against New Zealand in the final hockey Test to pocket the four-match series 2-1 in Christchurch.

సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్

Posted: 10/11/2015 07:07 PM IST
India hold new zealand to 1 1 draw win series 2 1

న్యూజిలాండ్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్  కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ 1-1 తో డ్రా ముగియడంతో సిరీస్ ను భారత్ చేజిక్కించుకుంది.  సర్ధార్ సింగ్ నేతృత్వంలోని భారత్ రెండు, మూడు టెస్టుల్లో గెలవడంతో సిరీస్ ను 2-1 తేడాతో సాధించింది. తొలి టెస్టులో టెస్టులో మాత్రమే గెలిచిన న్యూజిలాండ్ ఆపై వరుసగా రెండు మ్యాచ్ లను కోల్పోయింది.

నాలుగో టెస్టులో గెలిచి  సిరీస్ ను డ్రా చేయాలని భావించిన న్యూజిలాండ్ కు నిరాశే ఎదురైంది. ఆట 11వ నిమిషంలో  భారత ఆటగాడు రూపేందర్ పాల్ సింగ్ కు పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు.  అయితే 41 నిమిషంలో ఎడ్వర్డ్స్ ఇచ్చిన పాస్ ను అందుకున్న రోజ్ గోల్ గా మలచడంతో  న్యూజిలాండ్ 1-0 తో ముందంజ వేసింది. ఆ తరువాత 43 నిమిషంలో భారత ఆటగాడు సునీల్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు.  అటు తరువాత న్యూజిలాండ్ ఎటాకింగ్ ను భారత్ అడ్డుకోవడంతో మ్యాచ్ డ్రాగా ముగియక తప్పలేదు.  దీంతో సిరీస్ భారత్ వశమైంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hockey series  test series  india  new zealand  

Other Articles