Sachin Tendulkar predicted that I will become World No 1: Kidambi Srikanth

Tendulkar told me i will become world no 1 srikanth

Arjuna Award, Kidambi Srikanth, Sachin Tendulkar, Badminton, Cricket, prediction, Arjuna Award, badminton, sachin on kidambi, kidambi on sachin

Set to be bestowed with the Arjuna award, ace India shuttler Kidambi Srikanth on Thursday said that the prestigious honour in addition to some encouraging words by legendary cricketer Sachin Tendulkar has made him hungrier to scale new heights.

సచిన్ నెంబర్ వన్ అవుతానన్నాడు.. శ్రీకాంత్

Posted: 08/20/2015 07:25 PM IST
Tendulkar told me i will become world no 1 srikanth

అర్జున అవార్డు దక్కించుకున్నతెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్(22) ఆనందంతో ఉబ్బితబ్బివుతున్నాడు. ఎందుకనుకుంటున్నారు..? అర్జునా అవార్డు దక్కినందుకు కాదండీ..? మరేంటి విషయం అంటారా..? తాను అభిమానించే ఓ ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ నుంచి ప్రశంసలు అందుకోవడమే దీనికి కారణం. ఎవరాయన అంటారా..?  భారత బ్యాటింగ్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి ప్రశంసలు లభించాయి. దీంతో  శ్రీకాంత్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. తనకు సచిన్ నుంచి అరుదైన అభినందన లభించినట్లు తెలిపాడు. ప్రస్తుతం వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో ఉన్న తాను.. ఏదో ఒక రోజు వరల్డ్ నంబర్ ర్యాంక్ ను కూడా అందుకుంటానని సచిన్ పేర్కొనడం తనకు ఒక మధురమైన జ్ఞాపకమని శ్రీకాంత్ అన్నాడు.

వరల్డ్ చాంపియన్స్ టోర్నీ ఆరంభానికి ముందు తన అంకుల్ ను కలవడానికి సచిన్ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో ఆ క్రికెటర్ నుంచి తనకు అభినందనలు లభించినట్లు శ్రీకాంత్ తెలిపాడు. సచిన్ వంటి ప్రముఖ వ్యక్తిని కలవడమే గొప్ప విషయమైతే..  ఆ దిగ్గజ క్రికెటర్ నుంచి అభినందనలు అందుకోవడం మరో అద్భుతమైన విషయంగా శ్రీకాంత్ పేర్కొన్నాడు. తాను సచిన్ ముందు ఇంకా చిన్నపిల్లవాడినేనని.. ఆ లెజెండ్ క్రికెటర్ ను తాను ఎప్పటికీ ఫాలో అవుతుంటానని తెలిపాడు. కేవలం సచిన్ తో ఐదు నుంచి ఏడు నిమిషాల లోపే మాట్లాడానని శ్రీకాంత్ అన్నాడు. ఆ సందర్భంలోనే తనను సచిన్ ప్రశించినట్లు తెలిపాడు.

శ్రీకాంత్ బ్యాడ్మింటన్ చరిత్రలో తొలి ఇండియన్ సూపర్ సిరీస్ తో పాటు, స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టైటిల్, చైనా ఓపెన్, థాయ్ లాండ్ ఓపెన్లు సాధించాడు. కాగా, జనవరిలో జరిగిన సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ లో ఫైనల్ కు చేరండంతో ప్రపంచ మూడో ర్యాంక్ ను సాధించి కెరీయర్ లో తొలిసారి తన బెస్ట్ ను దక్కించుకున్నాడు. అనంతరం శ్రీకాంత్ ఐదో ర్యాంకుకు పడిపోయాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kidambi srikanth  sachin tendulkar  prediction  Arjuna Award  badminton  

Other Articles