nadal turns cook at liesure time

Nadal a good cook too

Rafael Nadal, Spanish professional tennis player nadal, wisports, cooking, Nadal, a good cook too, sachin tendulkar, wimbledon open 2015, king of clay, Brazil player ‘Dustin Brown, Brazil player ‘Thomas Bellucci’, social networking site

Rafael Nadal, the Spanish professional tennis player is generally considered as the king of clay. His performance in the game has given him that identity.

నలభీముడిగా కూడా రాణిస్తున్న నాదల్

Posted: 07/02/2015 07:03 PM IST
Nadal a good cook too

పాకశాలలో ప్రావీణ్యం పొందేందుకో లేదా టైంపాస్ కో కానీ వింబుల్డన్ క్రీడాకారుడు నాదల్ గరిట పట్టారు. క్రికెట్ గాడ్ ఫాదర్ సచిన్ టెండూల్కర్ తీరిక సమయాల్లో గరిట తిప్పి తన వంటల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారన్న వార్తలు గతంలో చదివాం.  అయితే తాజాగా అలా తీరిక సమయంలో వంటులు చేస్తు.. నలభీముడి అవతారాన్ని ఎత్తిన వారి జాబితాలోకి నాదల్ కూడా చేరారు. వింబుల్డన్‌ టోర్నమెంట్‌తో టెన్నిస్‌ స్టార్ట్స్‌ అంతా బిజీబిజీగా గడుపుతుంటే స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ నాదల్‌ మాత్రం తీరిగ్గా వంట మొదలు పెట్టాడు.  

టెన్నిస్ కోర్టులో బ్యాటు తప్పడం కన్నా.. వంటగదిలో అందులోనూ చిన్నపాటి ప్యాన్ లో గరిట తిప్పడమూ రెండూ ఒకటేనంటున్నాడు. కోర్టులో బ్యాట్ తిప్పి పాయింట్లు సాధించి ప్రత్యర్థులపై విజయాన్ని నమోదు చేయడం ఎంత ముఖ్యమో.. వంటగదిలో ప్యాణ్ పై గరిట తప్పి.. మంచి రుచికరమైన ఆహారాన్ని వండి వార్చడం కూడా అంతే ముఖ్యమంటున్నాడు. కాగా, కోర్టులో పాయింట్లను బట్టి గెలుపోటములు లెక్క తెలుస్తుందని, కానీ వంటగదిలో మాత్రం వంట పూర్తైన తరువాత.. దానిని తిన్నవారు బాగుందని చెబితే కానీ విజయాన్ని అందుకోలేమంటున్నాడు రఫెల్ నాదల్ .

అయితే గరిట తిప్పడంలో ప్రావిణ్యం సంపాదించాలని అనుకుంటున్నారా అంటే మాత్రం ముసిముసి నవ్వులు చిందిస్తూ సమాధానం దాటవేస్తున్నాడు ఈ యువ ఆటగాడు. సోమవారం జరిగిన మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ క్రీడాకారుడు థామస్‌ బెల్లూసీతో అలవోకగా విజయం సాధించిన నాదల్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ క్రీడాకారుడు డుస్టిల్‌బ్రౌన్‌తో తలపడనున్నాడు.ఈ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉండడంతో నాదల్‌ గరిటతో వంట గదిలో సాధన చేస్తున్నాడు. మొత్తానికి భోజనం అతిప్రియం అన్నట్లు నాదల్ గరిట తిప్పడం వార్తల్లోకెక్కారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rafael Nadal  sports  cooking  

Other Articles