Teen arthlete, Crosses Finish Line, Then Collapses

Race after race teenager crosses finish line then collapses

Sam Peterman, Dale Peterman, Blair Grubb, Brian Lombardo, cardiologist, coach, University of Toledo, Sweet Home High School, Sprinting, Racing, Running, Fainting, Race Finish Line, Athlete, Teenage Runner, neurocardiogenic syncope, irregularity of the nervous system, fainting after running

Sam Peterman, 15, a runner for Sweet Home High School, falls into the arms of her father, Dale, after a high school state title race in Albany, N.Y.

అమె విజయాల వెనుక. తండ్రి స్పూర్తి, ప్రోత్సాహం

Posted: 06/15/2015 04:36 PM IST
Race after race teenager crosses finish line then collapses

అమె విజయాల వెనుక. తండ్రి స్పూర్తి, ప్రోత్సాహంలు అధికంగా వున్నాయి. అమేంటి ఎవరి వెనుకైనా.. వారి తల్లిదండ్రుల ప్రోత్సహం, స్పూర్తి తప్పనిసరిగా వుంటాయని అంటున్నారు కదూ. నిజమే. కానీ అమెరికాలోని న్యూయార్క్ పట్టణ ప్రాంతంలో గల బషెలో లోని స్వీట్ హోం హై స్కూల్ పాఠశాలలో చదవుతున్న సామ్ పీటర్ మెన్ మాత్రం తన తండ్రి లేనిదే విజయం లేదు. అమె పరుగుపందెంలో పాల్గొంటుందంటే చాలు వెంటనే అన్ని పనులు పక్కన పెట్టేసి ఆమెతో ఉండిపోతాడు. అల్లారుముద్దుగా చూసుకుంటాడు. ధైర్యం చెప్తాడు. గెలుస్తావని ప్రోత్సహిస్తాడు. మరో పరుగు పందెనికి సిద్దంగా వుండాలని స్పూర్తినిస్తాడు. అతడే డేల్ పిటర్ మెన్

అందరు తండ్రులు అలానేగా చేస్తారు. ఆయన చేయడంలో ప్రత్యేకత ఏముందంటారా..? అక్కడికే వస్తున్నాం. అమె ఈ నెల 13న జరిగిన పరుగుపందెంలో తన గత రికార్డును తానే తిరగరాసుకుంది. అది 9 సెకన్లతో. ఇదీ కామన్ గానే జరిగేది. విషయానికి రండి అంటున్నారు కదూ. అమె పరుగు పందెం లో లక్ష్యానికి చేరుకునే క్రమంలో మరో రెండుమూడు అడుగులు వేస్తే లక్ష్యం చేరువవుతుందనగానే.. అమె కుప్పకూలిపోతుంది. అంతకు ముందుగానే అమె తండ్రి డేల్ మీటర్ మన్ అమె వస్తున్న లేన్ లో లక్ష్యం గీత దాటిని రెండు మూడు అడుగుల దూరంలో అమెను పట్టుకునేందుకు సిద్దంగా వుంటాడు. ఎందుకంటే అమె కుప్పకూలిపోయేది తన తండ్రి చేతులపైనే.

మాములుగా చూసేవారయితే తనకు ఏమౌతుందో అని కంగారు పడిపోతుంటారు. కానీ, ఆ తండ్రి మాత్రం ఎంతో ధైర్యంగా ఆమెను తిరిగి పునరుత్తేజితం చేస్తాడు. సామ్ పీటర్మన్(15) అనే అమ్మాయికి పరుగు అంటే చాలా ఇష్టం. ఆమెకు న్యూరోకార్డియాక్ జెనిక్ సింకోప్ అనే వ్యాధితో బాధపుడుతున్నా.. అమెకు పరుగు పందెం అంటే ఉన్న మక్కువను చూసి తన తండ్రి అమెను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. దీని కారణంగా ఆమె పరుగు పందెంలో పాల్గొని లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఓపికగా ఉండి లక్ష్యాన్ని దాటుతుండగానే తన తండ్రి చేతుల్లో కుప్పకూలిపోతుంటుంది.

అలా కూలిపోవడం.. తనకు ఊపిరి ఆడటం లేదని బాలిక చెప్పడం.. ఇక నువ్వు పరుగెత్తడానికి ఏమీ లేదని, చెబుతున్న తండ్రితో మధ్యలో తాను గెలిచానా అంటూ ఆర్తిగా అడుగుతుంది. ఈ నెల 13న జరిగిన పరుగుపందెంలోనూ అదే జరిగింది. సామ్ పీటర్ సన్ విజేతగా నిలవడమే కాకుండా.. గతంలో తాను నెలకోల్పిన రికార్డును అమె 9 సెకన్ల వ్యవధితో అధిగమించి తిరగరాసుకుంది. అమెను శాంతపడమని చెప్పిన తండ్రి, శాంతించేంత వరకు అమెకు పక్కకు తీసుకెళ్లి సపర్యలు చేస్తాడు. అమెకు పరుగు పందెం వున్నప్పుడల్లా.. ఇదే అతనికి దినచర్య మారింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Race After Race  Teenager  Collapse  Sam Peterman  father  

Other Articles