Parupalli Kashyap Bows Out in Semis of Indonesia Open Badminton

Parupalli kashyap loses to kento momota in indonesia open semis

Badminton Parupalli Kashyap Bows Out in Semis of Indonesia Open Badminton, Japan's Kento Momota, Parupalli Kashyap, Kento Momota, Indonesia Open, semis, Istora Gelora Bung Karno Stadium, latest Badminton news

Indian shuttler Parupalli Kashyap's splendid run at the $800,000 Indonesia Open Superseries Premier ended on Saturday as he lost to Japanese rising star Kento Momota 21-12, 17-21, 19-21 in the men's singles semifinal here

ఇండోనేషియా ఓపెన్: సెమీస్ లో పోరాడి ఓడిన పారుపల్లి కశ్యప్

Posted: 06/06/2015 09:01 PM IST
Parupalli kashyap loses to kento momota in indonesia open semis

ఇండోనేసియా ఓపెన్ సూపర్ సీరీస్ లో తెలుగుతేజం హైదరాబాదీ షట్లర్ పారుపల్లి కశ్యప్ పోరాటం ముగిసింది. భారత్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్ల కశ్యప్ మాత్రమే సెమీస్ స్థాయికి చేరుకున్నాడు. ఇవాళ ఇండోనేషియా రాజధాని జకర్తాలోని ఇస్టోరా గెలోరా బంద్ కర్నో స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్లో కశ్యప్ ఓటమి చెందాడు. క్వార్టర్స్లో ప్రపంచ నెంబర్ వన్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించిన కశ్యప్.. శనివారం హోరాహోరీగా సాగిన సెమీస్లో 21-12, 17-21, 19-21 స్కోరుతో జపాన్ షట్లర్ కెంటో మొమోట చేతిలో పోరాడి ఓడాడు.

ఆద్యంతం నువ్వా నేనా అన్నట్టు సాగిన సెమీస్ పోరులో కశ్యప్ తొలి గేమ్ను సునాయాసంగా గెల్చుకున్నాడు. కాగా రెండో గేమ్లో కశ్యప్ కాస్త తడబాటుకు గురయ్యాడు. రెండో రౌండులో జపాన్ షట్లర్ మొమోట రాణించడంతో మ్యాచ్ 1-1తో సమమైంది. దీంతో మిగిలిని చివరి, నిర్ణాయక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. కశ్యప్, మొమోటల మధ్య మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. గెలుపును నిర్ధేశించే సెట్ లో రెండు పాయింట్ల స్కోరుతో పారుపల్లి కశ్యప్ వెనుకబడగా, చివరికి మొమోట పైచేయి సాధించాడు. ఆధ్యంతం పోరాడిన కశ్యప్ కొద్దిలో మ్యాచ్ను చేజార్చుకున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parupalli kashyap  indonesia open  india badminton  

Other Articles