Saina Nehwal regains top spot in world rankings

Shuttler saina regains world no 1

ace India shuttler Saina Nehwal, Saina Nehwal officially became the World No. 1, Badminton World Federation (BWF) released its latest rankings, Saina Nehwal thanks fans, Saina Nehwal, BWF rankings, World No. 1, India Open, Caroline Marin, Ratchanok Inaton, Badminton News

The Olympic bronze medallist, however, climbed to the number one ranking on Thursday once again ahead of the Australian Open, starting on May 26.

బ్యాట్మింటన్ ప్రపంచ నెం. 1 ర్యాంకును తిరిగి సాధించిన సైనా

Posted: 05/21/2015 06:16 PM IST
Shuttler saina regains world no 1

అంతర్జాతీయ స్థాయిలో అరుదైన టైటిల్స్‌తో పాటు... అమోఘమైన ఆటతీరుతో చైనా డ్రాగన్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరోమారు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సోంతం చేసుకుంది. మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో సైనా మరోమారు నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సైనా గత మార్చిలోనే ఈ స్థాయికి చేరుకుంది. అయితే సైనా గెలుపోటములతో పాటు రెండో స్థానంలో వున్న చైనా క్రీడాకారిణి గెలుపోటములు కూడా అమె ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును శాసించడంతో.. ఇవాళ తాజాగా ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ ర్యాకింగ్స్ లో మళ్లీ సైనా నెంబర్ వన్ గా నిలిచింది.

లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన 25 ఏళ్ల సైనా అంతర్జాతీయ స్థాయిలో 14 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా కూడా రికార్డు సృష్టించింది. ఈ నెల 26 నుంచి జరగనున్న ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటెన్‌ టోర్నమెంట్‌లో తలపడనున్న సైనాకు మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ కొండంత బలాన్ని ఇవ్వనుంది. ప్రపంచ నెంబర్ 2 ర్యాంక్ లో టోర్నమెంటులోకి అడుగుపెట్టనున్న సైనాకు మళ్లీ నెంబర్ వన్ ర్యాంకింగ్ రావడం.. అమె గెలుపు బాటలు వేయనుంది.

కాగా ప్రపంచ ర్యాంక్స్‌లో 12వ స్థానంలో కొపసాగిన పి.వీ. సింధూ ఒక స్థానం కిందకు వచ్చి 13వ స్థానంలో నిలిచింది. అటు పురుషుల సింగిల్స్‌లో భారత్‌ ఆటగాడు కదండి శ్రీకాంత్‌ నాల్గవ స్థానంలో కోనసాగుతుండగా, కామన్వెల్త్‌ గేమ్స్‌ పతక విజేత పారుపల్లి కశ్యప్‌ 13వ స్థానంలో.. హెచ్ ఎస్ ప్రరన్నోయ్ 15వ స్థానంలో కోనసాగుతున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  BWF rankings  World No. 1  Badminton News  

Other Articles